S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/04/2016 - 23:31

జలుమూరు, ఆగస్టు 4: ప్రతీ గర్భిణీ బలమైన పౌష్టికాహారం వాడాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. జలుమూరు మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం అంగన్వాడీ ఏర్పాటు చేసిన సీమంతాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

08/04/2016 - 23:31

శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 4: అమలు కాని హామీలతో అధికారం చేపట్టి రెండేళ్లు అయినా ఇచ్చిన హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసాలపై ప్రజలు తిరగబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు.

08/04/2016 - 23:30

ఆమదాలవలస, ఆగస్టు 4: ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి నయవంచన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును నమ్మవద్దని మాజీ మంత్రి తమ్మినేని పిలుపునిచ్చారు. పట్టణంలోని 7వ వార్డు పాతినవానివీధిలో గురువారం సాయంత్రం నిర్వహించిన గడపగడపకూ వైసిపి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

08/04/2016 - 23:30

ఎచ్చెర్ల, ఆగస్టు 4: పారిశ్రామికాభివృద్ధికి సాంకేతిక శిక్షణ మరింత దోహదపడుతుందని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం స్పష్టంచేశారు. ఏఏ వలస పరిధిలో ఉన్న నాగార్జున ఆగ్రికమ్ పరిశ్రమ ఆవరణలో జ్ఞాన వికాస భవన్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ వికాస్ భవన్ కేంద్రంగా స్థానికంగా పనిచేస్తున్న సిబ్బందితోపాటు పరిసర గ్రామాలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులకు కూడా సాంకేతిక శిక్షణను అందిపుచ్చుకోవచ్చునన్నారు.

08/04/2016 - 23:29

ఎచ్చెర్ల, ఆగస్టు 4: జిల్లాలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయం అనుబంద డిగ్రీ కళాశాలకు సంబంధించిన ప్రథమ సంవత్సరం రెండో సెమిస్టరీ ఫలితాలను వీసి ఛాంబర్‌లో గురువారం విడుదల చేశారు. 27.18 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు వెల్లడించారు. 12,456మంది హాజరు కాగా 3,386మంది పాసై 22.91శాతం ఫలితాలు సాధించగా వర్శిటీ అధికారులు 1.1శాతం గ్రాస్ మార్కులు కలపడంతో ప్రస్తుతం 27.18శాతానికి పెరిగిందన్నారు.

08/04/2016 - 23:28

భీమిని, ఆగస్టు 4: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గత మూడు రోజులుగా 35మంది విద్యార్థినిలు విరేచనాలు, వాంతులు, తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురవగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్సలు అందించారు. అనంతరం విద్యార్థినిలను వారి ఇండ్లకు పంపించినట్లు ప్రత్యేకాధికారి నారాయణ రావు తెలిపారు.

08/04/2016 - 23:27

బాసర, ఆగస్టు 4: గోదావరి అంత్యపుష్కరాలు బాసర క్షేత్రంలో వైభవంగా జరుగుతున్నాయి. గురువారం అంత్యపుష్కరాలు 5వ రోజుకు చేరుకున్నాయి. శ్రావణమాసం ప్రారంభం కావడంతో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు బాసరకు వేలాదిగా తరలివస్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు గోదావరి ఘాట్లు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. ఆలయ అధికారులు పర్యవేక్షణ కొరవడడంతో చెత్తాచెదారం దర్శనమిస్తుండడంతో భక్తులు ఇబ్బందుల పాలవుతున్నారు.

08/04/2016 - 23:27

ఉట్నూరు, ఆగస్టు 4: ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు లోలం శ్యాంసుందర్ హెచ్చరించారు. గురువారం ఆర్డీవో కార్యలయం ముందు టిడిపి అధ్వర్యంలో ప్రజా సమస్యలపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూరు, ఇంద్రవెల్లి, జన్నారం, కడెం, ఖానాపూర్‌కు చెందిన కార్యకర్తలు హాజరయ్యారు.

08/04/2016 - 23:26

ఉట్నూరు, ఆగస్టు 4: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగురామన్న, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలు గురువారం ఏజెన్సీలో పర్యటించారు. ఖానాపూర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు రేఖానాయక్, కోవలక్ష్మిలతో పాటు ఆధికార యంత్రాంగంతో కలిసి ఉట్నూరు, జైనూర్, సిర్పూర్ మండలాల్లోని పలు గిరిజన గ్రామాల్లో పర్యటించి ఏజెన్సీలో గిరిజనులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు.

08/04/2016 - 23:26

దండేపల్లి, ఆగస్టు 4: కమీషన్ల కోసమే ప్రాజెక్ట్‌ల రీ డిజైనింగని ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. గురువారం దండేపల్లి మండల కేంద్రంలో విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనలు చేసిన సాగు నీటి ప్రాజెక్ట్‌లను రీడిజైనింగ్ పేరుతో మాయ చేస్తు తన అనుచరులకు ముఖ్యమంత్రి కెసిఆర్ పనులు కట్టబెడుతున్నాడని ఆయన ఆరోపించారు.

Pages