S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/04/2016 - 23:18

వనపర్తి, ఆగస్టు4: వనపర్తి పట్టణానికి అనుకొని ఉన్న పీర్లగుట్టలో మొక్కలు నాటి వాటిని పెంచి చిట్టడవిగా మార్చాలని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి పట్టణంలోని పీర్లగుట్ట, మెట్టుపల్లి గ్రామాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని మొక్కలు నాటామనేది ముఖ్యం కాదని, నాటిన ప్రతి మొక్కను పెంచాలని ఆయన సూచించారు.

08/04/2016 - 23:18

మహబూబ్‌నగర్‌టౌన్, ఆగస్టు 4: ప్రభుత్వం ఆమలు చేస్తున్న విద్యావిధానం ఎంతో మహోన్నతమైనదని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో రూ.కోటి వ్యయంతో అదనపు తరగతి గదులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజలందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్ది వారిని సంస్కరవంతులుగా చేయాలని ప్రభుత్వం ఉచిత నిర్భంద విద్యాను అందిస్తుందన్నారు.

08/04/2016 - 23:17

నాగర్‌కర్నూల్, ఆగస్టు 4: సాగునీటిరంగ నిపుణులు రూపొందించిన డిజైన్ కాదని, కాంట్రాక్టు తీసుకున్న ఏజెన్సీ కోసం డిజైన్ మార్చేందుకు ప్రభుత్వం సిద్ధ్దమవుతుందని, ఇదే జరిగితే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంకు ముప్పువాటిల్లుతుందని మాజీ మంత్రి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు నాగం జనార్ధన్‌రెడ్డి ఆరోపించారు.

08/04/2016 - 23:16

మహబూబ్‌నగర్, ఆగస్టు 4: కృష్ణా పుష్కరాల సందర్భంగా తెలంగాణ ఆర్టీసి 434 ప్రత్యేక బస్సులను జిల్లాలో నడపనుందని మహబూబ్‌నగర్ ఆర్టీసి ఆర్‌ఎం వినోద్‌కుమార్ వెల్లడించారు. కృష్ణా పుష్కరాల్లో ఆర్టీసి సేవలపై గురువారం వివిధ డిపోల మేనేజర్లతో పాటు కార్మిక సంఘాల నేతలతో సమీక్షించారు.

08/04/2016 - 23:15

సంగారెడ్డి టౌన్, ఆగస్టు 4: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సేవలను విస్తరించి ప్రజలకు, రైతాంగానికి మెరుగైన సేవలందించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సూచించారు. సంగారెడ్డిలోని డిసిసిబిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎటిఎం సేవలను గురువారం చైర్మన్ చిట్టి దేవేందర్‌తో కలిసి ప్రారంభించారు.

08/04/2016 - 23:14

దౌల్తాబాద్, ఆగస్ట్ 4 : రాష్ట్రంలో విరివిగా వర్షాలు కురుస్తున్నప్పటికీ దౌల్తాబాద్ మండలంలో మాత్రం వర్షాలు అంతంత మాత్రంగానే కురిసాయి. ప్రతి రోజు ఆకాశం మేఘావృతం అవుతున్నప్పటికీ చిరుజల్లులకే పరిమితమవుతున్నది. ఆరుతడి పంటలకు పెద్దగా నష్టం లేకపోయినప్పటికీ వరి పంటలకు మాత్రం ఇబ్బందులు తప్పడంలేదు. సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరుకోలేదు.

08/04/2016 - 23:14

మెదక్, ఆగస్టు 4: ఇటీవల కురిసిన వర్షాలతో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో 36 చెరువులు నిండి అలుగులు పారాయని మెదక్ డివిజన్ నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏసయ్య, డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివనాగరాజు గురువారం నాడు ఇక్కడ మాట్లాడుతూ తెలిపారు. బొల్లారం మత్తడిలో 40 ఎంసిఎఫ్‌టితో ఐదు చెరువులను పూర్తిగా నింపామని, మరో రెండు చెరువులు 75 శాతం నీటిని నింపామని వారు తెలిపారు.

08/04/2016 - 23:13

గజ్వేల్, ఆగస్ట్ 4 : జిఒ 123ని కోర్టు రద్దు చేసినందున టిఅర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటికైనా బలవంతపు భూసేకరణకు స్వస్తి చెప్పాలని, అవసరమైన పక్షంలో 2013 చట్టం ప్రకారం వ్యవసాయ కూలీలు, వ్యవసాయ రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్దార్‌ఖాన్, నియోజకవర్గ ప్రచార కమిటీ చైర్మెన్ రామరాజశర్మ, ఎస్సిసెల్ జిల్లా అధ్యక్షులు గాలెంక నర్సింలు స్పష్టం చేశారు.

08/04/2016 - 23:13

తొగుట, ఆగస్టు 4: జన్మనిచ్చిన గ్రామాన్ని మరువకుండా ఆ గ్రామంలోని పాఠశాలనే ఎన్‌ఆర్‌ఐ కుమారుడు ప్రాజెక్టు పనికి ఎంచుకొని 3రోజులు విద్యార్థులకు ఆంగ్లంలో వివిధ ఆంశాలను బోధించిన సంఘటన మండలంలోని తుక్కాపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన గడీల శ్రీనివాస్‌రెడ్డి ఎన్‌ఆర్‌ఐ కుమారుడు సౌమిత్‌రెడ్డి ఆంగ్లభాష అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నార్త్,సౌత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు.

08/04/2016 - 23:12

సంగారెడ్డి టౌన్, ఆగస్టు 4: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పర్యటనను విజయవంతం చేయాలని, బహిరంగ సభలో ప్రతి ఒక్కరు స్వచ్చందంగా పాల్గొని రాష్ట్ర ప్రతిష్టను కాపాడాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సూచించారు. ప్రధాని హోదాలో మొదటి సారి రాష్ట్రంతో పాటు మెదక్ జిల్లాకు రావడం సభసుచికమన్నారు.

Pages