S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/04/2016 - 23:43

చోదకుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు, నిమగ్నతా రాహిత్యం వల్ల కావచ్చు, నిరంతరం పొంచివున్న బీభత్స పిశాచాల దాడుల వల్ల కావచ్చు. విధి వికటించడం వల్ల కావచ్చు...వాహనాలు కూలిపోతున్నాయి, వాహనాలు పేలిపోతున్నాయి, వాహనాలు కాలిపోతున్నాయి. ఢీకొట్టి ప్రాణాలు తీస్తున్నాయి. నదులలోపడి కొట్టుకుపోతున్నాయి. సముద్రాలలో మునిగిపోతున్నాయి.

08/04/2016 - 23:41

అన్నమయ్య పాటకు పట్ట్భాషేకం అనే శీర్షికతో అన్నమయ్య కీర్తనలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌వారు ప్రసారం చేస్తున్నారు. అయితే ఆ పాటలు వారు (పాడేవారు) తేటగా పాడలేకపోతున్నారనిపిస్తున్నది. ఎందుకంటే ఆ గాయనీ గాయకులంతా, వారి అభ్యసనమంతా సినీ గీతాల ఆలాపనతోనే జరిగింది. అందువల్లనే స్పష్టత లోపించింది. లేదా వారికి ఈ సాహిత్య పదాలు (600 సం.నాటివి కదా) అపరిచితాలు అయి వుండవచ్చు.

08/04/2016 - 23:39

ఆ మధ్య రెండు వారాల్లో కేరళ ప్రాంతంలో ఇద్దరు యువతులు మానభంగానికి గురై భయంకరంగా హత్యకు గురయ్యారు. ఇంకా మొన్నమధ్య హైద్రాబాదులో ఒక ఇంజనీరింగు అమ్మాయి యాక్సిడెంటులో చనిపోయిందని, కాదు హత్యేనని ఇంకా ఎటూ తేలలేదు. ఇలా రోజూ వార్తాపత్రికలు తెరవగానే కనీసం వారానికి రెండుమూడు ఇలాంటి సంఘటనలను చదవటం బాధపడటం జరుగుతోంది. ఏదైతేనేం మనుష్యులలోని అమానుషత్వానికి నిండు ప్రాణాలు, మానాలు బలైపోతున్నాయి.

08/04/2016 - 23:39

పంధొమ్మిదవ శతాబ్దంలో ‘గెలివర్ ట్రావెల్స్’అనే నవల వచ్చింది. దానితో కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. అది ఇంగ్లీషులో వుండడం వలన ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రాచుర్యాన్ని పొందింది. స్వాతంత్య్రానికి ముందు తరువాత కొంతకాలం మన దేశంలో హైస్కూళ్ళలోనూ, కాలేజీల్లోనూ విద్యార్థులకానవలను ఉపవాచకంగా పెట్టేవారు.

08/04/2016 - 23:34

శ్రీకాకుళం(కల్చరల్), ఆగస్టు 4: ఇస్తినమ్మ వాయినం... పుచ్చుకుంటినమ్మ వాయినాం శ్రావణ మాసంలో ఈ మాటలు ప్రతీ ఇంటా మహిళల నోట వింటుంటాం. ఇది మహిళల మాసం.. పూజలు, వాయినాలతో ప్రతీ ఇళ్లు ఈ నెలంతా ఆధ్యాత్మిక శోభలో కళకళలాడుతుంటుంది. శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాల నిర్వహణకు మహిళలు ఇచ్చే ప్రాధాన్యం మాటల్లో చెప్పలేనిది. ఎంతో నిష్ట నియమాలతో ఈ పూజలు మహిళలకు పండగ వాతావరణమే.

08/04/2016 - 23:33

శ్రీకాకుళం: 150 ఏళ్ళ చరిత్ర కలిగిన శ్రీకాకుళం మున్సిపాలిటీ రాష్ట్ర విభజన అనంతరం కార్పొరేషన్‌గా మారింది. పన్నుల భారాలు తప్ప పేదోళ్ళకు కావల్సిన వౌలిక సదుపాయాల కల్పనలో రెండేళ్ళ టిడిపి పాలనపై నగరవాసులు అసంతృప్తిగానే ఉన్నారు. నగర పాలక సంస్థకు డిసెంబరులోగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రతికూల ఫలితాలు వెలువడతాయన్న సర్వే ఫలితాలతో టిడిపికి మైనస్ మార్కులే వచ్చినట్టు తెలుస్తోంది.

08/04/2016 - 23:33

శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 4: జిల్లాలో కార్మిక హక్కులను కాలరాస్తూ పరిశ్రమ యాజమాన్యాలు తమ ఇష్టాను సారం వ్యవహరిస్తున్నాయని, అయినప్పటికీ కార్మిక శాఖ మంత్రి పట్టించుకోపోవడం అన్యాయమంటూ సిఐటియు నేతృత్వంలో కార్మికులు గురువారం కదం తొక్కారు.

08/04/2016 - 23:32

శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 4: విభజన నేపథ్యంలో యుపిఎ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రకటించిన హోదాతో పాటు అనేక అంశాలపై తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి విమర్శించారు.

08/04/2016 - 23:32

పలాస, ఆగస్టు 4: కాశీబుగ్గలోని పోస్టుమెట్రిక్ హాస్టల్, బాలల వసతి సంక్షేమ గృహంలో గురువారం ఎసిబి అధికారులు తనిఖీలు నిర్వహించారు. అందిన ఫిర్యాదు మేరకు ఎసిబి అధికారులు కాశీబుగ్గలోని హాస్టల్‌కు సంబంధించి వార్డెన్ గురువులు ఇంటి వద్దకు వేకువజామున అయిదు గంటలకు చేరుకొని ఆయనతో హాస్టల్ వద్దకు చేరుకొని తనిఖీలు నిర్వహించారు.

08/04/2016 - 23:31

మందస, ఆగస్టు 4: భూదందాలు, రౌడీయిజం చేస్తే ఉక్కుపాదంతో అణగదొక్కుతామని జిల్లా ఎస్పీ బ్రహ్మరెడ్డి హెచ్చరించారు. గురువారం మందస పోలీసుస్టేషన్‌ను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పోలీసుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. జిల్లాలోని మావోయిస్టుల ప్రభావం లేదని, ఆంధ్రా, ఒడిశా సరిహద్దు కావడంతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Pages