S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/04/2016 - 09:03

హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రైతులనుంచి నేరుగా భూములు కొనుగోలు చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో123ను కొట్టివేస్తూ హైకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2015 జూలై 30న జీవో 123 జారీ చేసిన విషయం తెలిసిందే.

08/04/2016 - 09:01

రియో డి జెనీరో, ఆగస్టు 3: రియో డి జెనీరోలో భారత బృందానికి బుధవారం ఘన స్వాగతం లభించింది. ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులు రియో క్రీడా గ్రామానికి చేరుకొని, తమకు కేటాయించిన గదుల్లో బస చేస్తున్నారు. అయితే, ఒక్కో దేశ బృందాన్ని ఆహ్వానించడానికి ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీ (ఒసి) ఒక్కో తేదీని ఖరారు చేసింది. అధికారికంగా బుధవారం భారత్ వంతు వచ్చింది.

08/04/2016 - 08:58

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో శుభారంభమే అత్యంత కీలకమని భారత హాకీ జట్టు గోల్‌కీపర్, కెప్టెన్ శ్రీజేష్ అభిప్రాయపడ్డాడు. గతంలో ఎనిమిది పర్యాయాలు ఒలింపిక్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న భారత్ చాలా కాలంగా అదే స్థాయిలో రాణించలేకపోతున్నది. పతకం మాట ఎలావున్నా, ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించడానికే నానా తంటాలు పడుతున్నది.

08/04/2016 - 08:58

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఒలింపిక్స్‌లో భారత హాకీ గత కీర్తి ఎంతో ఘనం. నేడు అది అంతంత మాత్రం. ఒకప్పుడు ప్ర పంచాన్ని శాసించిన భారత హాకీ నేడు ఉనికి కోసం అల్లా డుతున్నది. ఒలింపిక్స్‌లో మన ప్రస్థానం సాగిన తీరును చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఒలింపిక్స్‌లో అంతకు ముందు మూడు పర్యాయాలు స్వర్ణ పతకాలు సాధించినా అప్పటి మన దేశానికి స్వాతంత్య్రం రాలేదు.

08/04/2016 - 08:57

కింగ్‌స్టన్, ఆగస్టు 3: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ని డ్రా చేసుకోవడానికి విండీస్ పోరాడు తున్నది. నాలుగు వికెట్లకు 48 పరు గుల ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రో జైన బుధవారం ఆటను కొనసాగిం చిన ఆ జట్టు భోజన విరామ సమ యానికి మరో వికెట్ కోల్పోయ 215 పరుగులు చేయగలిగింది. జెర్మయ న్ బ్లాక్‌వుడ్ 63 పరుగులు సాధించి అశ్విన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యా డు.

08/04/2016 - 08:57

న్యూఢిల్లీ, ఆగస్టు 3: యువ రెజ్లర్ నర్సింగ్ పంచమ్ యాదవ్ ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి లైన్ క్లియర్ అయంది. ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యుడబ్లుడబ్ల్యు) అమోదముద్ర వేయడంతో అతనికి రియో టికెట్ ఖాయమైంది. భారత రెజ్లింగ్ సంఘం బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విషయాన్ని ధ్రువీకరించింది. డోపింగ్ పరీక్షలో విఫలమైన కారణంగా నర్సిం గ్‌పై తాత్కాలిక వేటు పడిన విషయం తెలిసిందే.

08/04/2016 - 08:42

న్యూఢిల్లీ, ఆగస్టు 3: చారిత్రాత్మక జిఎస్‌టి బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంపట్ల పారిశ్రామిక, వ్యాపార రంగాలు హర్షం వ్యక్తం చేశాయి. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఈ వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)కు రాజ్యసభ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం అభినందించదగ్గ పరిణామంగా పలువురు అభిప్రాయపడ్డారు.
‘దేశంలో పన్నులకు సంబంధించి అతిపెద్ద సంస్కరణ ఇది. దీనివల్ల ఎన్నో ఆర్థిక ప్రయోజనాలుంటాయి.’

08/04/2016 - 08:40

విశాఖపట్నం, ఆగస్టు 3: వైద్య పరికరాల తయారీకి సంబంధించి పరిశ్రమలన్నింటినీ ఒకే ప్రాంతంలో ఏర్పా టు చేసేందుకు వీలుగా ప్రభుత్వం మెడ్‌టెక్ పార్క్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దక్షిణాసియాలోనే తొలి మెడికల్ పరికరాల ప్రాజెక్టుకు విశాఖ కేంద్రం కానుంది. పెదగంట్యాడ మండలం నడుపూరులో 270 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక వైద్య పరికరాల తయారీ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు.

08/04/2016 - 08:39

హైదరాబాద్, ఆగస్టు 3: టెక్ సంస్థ ఆర్‌డిపి వర్క్‌స్టేషన్స్.. బుధవారం ఇక్కడ ‘తిన్‌బుక్’ పేరిట 14.1 అంగుళాల చౌక ల్యాప్‌ట్యాప్‌ను పరిచయం చేసింది. దీని ధర 9,999 రూపాయలు. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు దీన్ని ఆవిష్కరించారు. మైక్రోసాఫ్ట్, ఇంటెల్‌తో ఏర్పరచుకున్న వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా దీన్ని రూపొందించామని, ఇదే ఇప్పటిదాకా అత్యంత చౌక ల్యాప్‌ట్యాప్ అని కూడా సంస్థ ఈ సందర్భంగా తెలిపింది.

08/04/2016 - 08:38

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఎంతోకాలంగా వేచిచూస్తున్న మోటార్ వాహనాల (సవరణ) బిల్లు 2016ను కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదించింది. ఈ బిల్లు అమలుతో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారికి భారీగా జరిమానాలు పడనున్నాయి. మద్యం సేవించి నడిపితే 10,000 రూపాయల వరకు జరిమానా, ప్రమాద తీవ్రతనుబట్టి 2 లక్షల రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

Pages