S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/04/2016 - 08:02

కర్నూలు, ఆగస్టు 3: మహారాష్టల్రో కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి శుక్రవారం నాటికి రెండు లక్షల క్యూసెక్కుల నీరు వస్తుందని, జాగ్రత్తగా ఉండాలంటూ సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి) బుధవారం జిల్లా కలెక్టర్‌కు సమాచారం పంపింది. కృష్ణానదిపై ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు ఇప్పటికే నిండినందున వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు విడుదల చేయనున్నారు.

08/04/2016 - 08:01

హైదరాబాద్, ఆగస్టు 3: అపోలో ఆసుపత్రి పరిధిలో ఉన్న కేన్సర్ మేనేజిమెంట్ వౌలిక సదుపాయాల వ్యవస్ధ విభాగాలను ఇకపై అపోలో కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లుగా మారుస్తున్నట్లు అపోలో ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. చెన్నై, హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్‌కొత్తా, అహ్మదాబాద్, బిలాస్‌పూర్, బెంగళూరు, మధురైలో అపోలో ఆసుపత్రుల ఇనిస్టిట్యూట్‌ల మధ్య అనుసంధానం నెలకొల్పనున్నట్లు ఆయన చెప్పారు.

08/04/2016 - 08:00

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు పరిష్కారానికి కేం ద్రం హామీ ఇచ్చినందునే ప్రస్తుతానికి ఆందోళనలు విరమించినట్లు టీపీపీ ఎంపీలు చెప్పారు. బుధవారం నాడు టీడీపీ ఎంపీలు మురళీమోహన్, అవంతిశ్రీనివాస్, రామ్మోహన్‌నాయుడు విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, అనంత్‌కుమార్ ఆంధ్రప్రదేశ్‌కి తప్పక సాయం చేస్తామని చెప్పారని అందుకే నిరసనలకు విరామం ఇచ్చామన్నారు.

08/04/2016 - 07:59

విశాఖపట్నం, ఆగస్టు 3: రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు అమలు జరుగుతున్న తీరును అధ్యయనం చేసేందుకు 10 రాష్ట్రాల ప్రతినిధులు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఉపాధిలో సాధించిన విజయాలను పరిశీలించడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రతిపాదించారు. ఇందులో భాగంగా ఈ నెల 4 నుంచి మూడు రోజుల పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటిస్తారని రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ రామాంజనేయులు తెలిపారు.

08/04/2016 - 07:58

హైదరాబాద్, ఆగస్టు 3: ఒక భూమిని అపార్టుమెంటు నిర్మించి ఫ్లాట్లలో వాటా పొందేందుకు ఇచ్చిన యాజమాని వినియోగదారుడు అవుతారని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం సెక్షన్ 2(1) (డి) కింద భూమి ఇచ్చిన వ్యక్తి వినియోగదారుడని, ఈ కేసులో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇచ్చిన తీర్పులు చెల్లవని సుప్రీం కోర్టు పేర్కొంది.

08/04/2016 - 07:57

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సభ్యులు బుధవారం లోక్‌సభ పోడియం వద్ద రెండు గంటల పాటు ధర్నా చేశారు. వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, సభ్యులు సుబ్బారెడ్డి, బుట్టా రేణుక, వర ప్రసాదరావు, అవినాష్‌రెడ్డి ఉదయం 11గంటలకు సభ సమావేశం కాగానే పోడియం వద్దకు వచ్చి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు ప్రారంభించారు.

08/04/2016 - 07:57

హైదరాబాద్, ఆగస్టు 3: ఒక శాఖ సమీక్షకు ముందు డేటా రావల్సి ఉంటుంది. అది ఉంటేనే సమీక్ష. లేకపోతే లేదు. అది పాత పద్ధతి. ఇప్పుడు ఆ పద్ధతి మార్చేశారు చంద్రబాబు నాయుడు. అధికారుల కంటే ముందే తన ట్యాబ్‌లో సమాచారం సిద్ధంగా ఉంచుకుంటున్నారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వయసు మీరుతున్నకొద్దీ సాంకేతిక పరిజ్ఞానం పెంచుకుంటున్నారు.

08/04/2016 - 07:51

చిట్యాల, ఆగస్టు 3: పారిశ్రామిక రంగం కోసం తెరాస ప్రభుత్వ అనుకూలంగా ఉన్నప్పటికీ పరిశ్రమలను నెలకొల్పే ప్రాంతాల్లో ప్రజాభీష్టం మేరకే వాతావరణ కాలుష్యాన్ని వెదజల్లేటటువంటి పరిశ్రమలకు అనుమతులుండవని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.

08/04/2016 - 07:51

హైదరాబాద్/బేగంపేట, ఆగస్టు 3: సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మాతృమూర్తికి అత్యంత క్లిష్టమైన గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి కొత్త జీవితాన్ని ప్రసాదించింది.

08/04/2016 - 07:49

హైదరాబాద్, ఆగస్టు 3: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రావడం వల్ల అభివృద్ధికి మరింత ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంతి బండారు దత్తాత్రేయ తెలిపారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ బుధవారం ఎన్‌టిపిసి, రామగుండం ఎరువుల ప్రాజెక్టు, రైల్వేల ఉన్నతాధికారులతో సమీక్షించారు.

Pages