S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/04/2016 - 20:42

నాని, సురభి, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘జెంటిల్‌మన్’ చిత్రం ఇటీవలే విడుదలై అర్థశతదినోత్సవం పూర్తిచేసుకున్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుకల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, ఈ చిత్రం 28 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం పూర్తిచేసుకోవడం ఆనందంగా వుంది.

08/04/2016 - 18:25

దిల్లీ: దిల్లీ ప్రభుత్వ పాలనలో ప్రధాని మోదీ గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ జోక్యం చేసుకోవడం లేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు గురువారం మీడియాతో అన్నారు. కొంతమంది విపక్ష నాయకులు దేశంలో ఎక్కడ ఏం జరిగినా ప్రధాని కారణమంటూ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రతిదానికీ మోదీ స్పందించాలని అనుకోవడంలో అర్థం లేదన్నారు.

08/04/2016 - 18:24

హైదరాబాద్: ఈనెల 7న నగరంలోని ఎల్‌బి స్టేడియంలో బిజెపి కార్యకర్తల సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటున్నందున కొన్ని ప్రాంతాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు విధిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆరోజు ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కును మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

08/04/2016 - 18:24

హైదరాబాద్: తెలంగాణ పర్యటన సందర్భంగా మిషన్ భగీరథ ప్రాజెక్టును ప్రారంభించవద్దని కోరుతూ టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రధాని మోదీకి గురువారం బహిరంగ లేఖ రాశారు. గతంలో ప్రారంభించిన ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించడం సరికాదన్నారు.

08/04/2016 - 18:23

విజయవాడ: ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు ఇతర పార్టీలతో పాటు మద్దతు ఇచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు ఇపుడు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సిపిఐ నేత నారాయణ అన్నారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, అవసరమైతే చట్టాలను సవరించైనా ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాలన్నారు. రాజ్యాంగాన్ని, చట్టాలను అవసరాల మేరకు మార్చడం కొత్తేమీ కాదన్నారు.

08/04/2016 - 18:23

ఇస్లామాబాద్: ఉగ్రవాదాన్ని అణచివేయాలని, ఉగ్రవాదులను ప్రోత్సహించే దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రసంగాన్ని పాకిస్థాన్ సర్కారు అడ్డుకుంది. ఇస్లామాబాద్‌లో సార్క్ దేశాల హోం మంత్రుల సమావేశంలో రాజ్‌నాథ్ ప్రసంగిస్తున్నపుడు భారత మీడియాను, అంతర్జాతీయ మీడియాను అనుమతించలేదు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆ దేశ హోం మంత్రి ప్రసంగాలను మాత్రమే పాక్ మీడియా ప్రసారం చేసింది.

08/04/2016 - 18:22

ఇస్లామాబాద్: ఉగ్రవాదాన్ని సమర్థించే వ్యక్తులు, దేశాలు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇస్లామాబాద్‌లో గురువారం సార్క్ దేశాల హోం మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరోక్షంగా పాకిస్థాన్‌పై విమర్శలు చేశారు. ఉగ్రవాదంలో మంచిది, చెడ్డది అనేవి ఉండవన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దీన్ని అరికట్టాలన్నారు.

08/04/2016 - 18:22

ఏలూరు: ఎపికి ప్రత్యేక హోదా కావాలని టిడిపి ఎంపీలు, ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుండగా ఇందుకు విరుద్ధంగా ఎపి మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మంత్రివర్గంలో బిజెపి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దేవాదాయ మంత్రి మాణిక్యాల రావు చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

08/04/2016 - 18:20

హైదరాబాద్‌ : జాతీయ ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడిగా ఎంపికైన వెంకటయ్యను గురువారం సచివాలయంలో మంత్రి కేటీఆర్‌ సన్మానించి రూ. 1,11,111ల చెక్కును బహుమతిగా అందజేశారు. వెంకటయ్య యోగ క్షేమాలను, కుటుంబ నేపథ్యాన్ని మంత్రి తెలుసుకున్నారు.

08/04/2016 - 18:18

ఢిల్లీ: పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రైవేట్ బిల్లును రేపు రాజ్యసభలో పెట్టనున్నారు. టీడీపీలోకి వలసల విషయంలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు, గవర్నర్ నరసింహన్‌కు వైసీపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసి0దే.

Pages