S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అభివృద్ధికి ఇచ్చే భూ యజమాని వినియోగదారుడే

హైదరాబాద్, ఆగస్టు 3: ఒక భూమిని అపార్టుమెంటు నిర్మించి ఫ్లాట్లలో వాటా పొందేందుకు ఇచ్చిన యాజమాని వినియోగదారుడు అవుతారని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం సెక్షన్ 2(1) (డి) కింద భూమి ఇచ్చిన వ్యక్తి వినియోగదారుడని, ఈ కేసులో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇచ్చిన తీర్పులు చెల్లవని సుప్రీం కోర్టు పేర్కొంది. గతంలో రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తన తీర్పులో భూమిని అభివృద్ధి చేసేందుకు ఇచ్చిన వ్యక్తి వినియోగదారుడు కాదని, ఫ్లాట్లు నిర్మించేందుకు భూ యజమానులు బిల్డర్‌తో కుదుర్చుకున్న ఒప్పందం వాణిజ్యపరమైన లావాదేవీలకు సంబంధించినదని పేర్కొంది. తాను ఇచ్చిన భూమి అభివృద్ధిపై వివాదంతో ఫిర్యాదు చేసిన భూ యజమాని వినియోగదారుల పరిరక్షణ చట్టం పరిధిలోకి రారని రాష్ట్ర కమిషన్ పేర్కొంది. ఇదే తీర్పును జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఖరారు చేయడం గమనార్హం. కాని ఈ రెండు కమిషన్ల తీర్పులు చెల్లవని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. విశాఖపట్నంకు చెందిన బి డేనయల్ బాబు అనే వ్యక్తి మెసర్స్ శ్రీ వాసుదేవ కన్‌స్ట్రక్షన్స్‌తో ఓపెన్ ప్లాట్ల అభివృద్ధిపై ఒప్పందం కుదుర్చుకున్నారు. అపార్టుమెంటు నిర్మించిన తర్వాత అందులో 40 శాతం భూ యజమానికి, 60 శాతం ఫ్లాట్లు బిల్డర్‌కు చెందుతాయని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం బిల్డర్ అపార్టుమెంట్‌ను నిర్మించలేకపోయారంటూ డేనియల్ బాబు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరంను ఆశ్రయించారు. నిర్మాణాన్ని జాప్యం చేసినందుకు 15.96 లక్షల రూపాయల అద్దెను చెల్లించాలని, వేకెంట్ ల్యాండ్ పన్ను కింద రూ. 19,800ను చెల్లించాలని, మానసిక ఆందోళన కలిగించినందుకు రూ. 25వేలు, ఇతర చార్జీల కింద రూ. 70 వేలు చెల్లించాలని వాసుదేవ కన్‌స్ట్రక్షన్స్‌ను ఫోరం ఆదేశించింది. ఈ తీర్పును రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లోఆ సంస్థ సవాలు చేసింది. భూమి యజమాని వినియోగదారుడు కాడని రాష్ట్ర సంఘం ఇచ్చిన తీర్పుతో జాతీయ వినియోగదారుల కమిషన్ ఏకీభవించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో డేనియల్ బాబు సవాలు చేశారు. సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎన్‌వి రమణలు ఈ పిటిషన్‌ను విచారించారు. నిర్మాణంపైన భూమి యజమానికి నియంత్రణ ఉండదని, ఈ వ్యాపారంలో అతను పాల్గొనరని తీర్పులో పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం భూమి యజమానికి రావాల్సిన బెనిఫిట్‌ను ఇవ్వాల్సిన బాధ్యత బిల్డర్‌దేనని తీర్పులో పేర్కొన్నారు. కాగా ఈ కేసును మళ్లీ విచారించాలని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.