S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/18/2019 - 22:18

పగలే వెన్నెల జగమే ఊయల
కదలే ఊహలకే కన్నులుంటే...

05/18/2019 - 22:13

1962లో బాబూ ఆర్ట్స్ బ్యానరుపై సహజసిద్ధమైన సన్నివేశాలు, సంభాషణలు, అభినయాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు ఆదుర్తి మార్కు సినిమా మంచి మనసులు. మంచితనానికి పేద- గొప్ప అనే తావుండదని చాటిచెప్పిన చిత్రం. తమ్ముడి చదువుకోసం తన ఆరోగ్యాన్ని ఫణంగాపెట్టి గుమ్మడి ఏఎన్నాఆర్‌ను పట్నంలో చదివిస్తుంటాడు. అన్నకు భారం కాకూడదని ఆలోచిస్తాడు ఏఎన్నార్. పేద విద్యార్థులకు సాయం చేసే ఎస్వీ రంగారావు ఇంట చేరతాడు.

05/18/2019 - 22:01

హీరోగా నటించేవారికి కొన్ని పడికట్టు పాత్రలుంటాయి. అలాగే కేరెక్టర్ ఆర్టిస్టుకి వారికి తగ్గ గుండెపోటు పాత్రలూ ఉంటాయి. కానీ రాళ్ళపల్లిలాంటి నటుడికి ఈ పాత్రలే ఖచ్చితంగా
సరిపోతాయి అన్నమాట ఏ దర్శకుడినుండీ వినలేం.

05/11/2019 - 21:12

‘శేష శైలావాసా శ్రీవేంకటేశా/ శయనించు మా అయ్య శ్రీ చిద్విలాసా..’ ఈ మకుటంతో మకుటాయమానమైన ఈ భక్తిగీతం చిరంతరం నిరంతరం భక్తుల హృదయాలను అలరిస్తోంది. ఈ గీతం అందుకే అయ్యింది అప్పటికీ, ఇప్పటికీ మరెప్పటికీ అజరామరం.

05/11/2019 - 21:11

కృష్ణ 100వ చిత్రంగా తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి సినిమా స్కోప్‌గా 1974న విడుదలైన సినిమా -అల్లూరి సీతారామరాజు. ఈ చిత్రంలో ఎన్నో సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించారు దర్శకులు వి రామచంద్రరావు. అల్లూరి పాత్రలో ‘కృష్ణ’ అందరి అభిమానాన్ని చూరగొన్నారు.

05/11/2019 - 21:10

రాజేంద్రప్రసాద్ అప్పుడప్పుడే పైకొస్తున్నాడు. నాలుగైదు సినిమాల్లో మంచి రోల్స్ వేస్తూ -పాత్రలకు న్యాయం చేస్తున్నాడన్న మంచి పేరుంది. నేను ‘ముద్దుల చెల్లెలు’ సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. అందులో నూతనప్రసాద్ కొడుకుగా ‘ముద్దుల చెల్లెలు’ని పిచ్చిగా ప్రేమించే పిచ్చి పాత్ర ఒకటుంది. దానికి రాజేంద్రప్రసాద్ అయితే న్యాయం చేస్తాడని తీసుకున్నాం.

05/11/2019 - 21:00

బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీసావంత్ గుర్తుందిగా.. అయినా ఆమెను మరిచిపోయినపుడల్లా ఏదో దుమారం రేపుతూ మరిచిపోకుండా చేస్తూనే ఉంటుందిలెండి. తాజాగా ఈ అమ్మడు పాకిస్తాన్ జెండా పట్టుకుని దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. అసలే పాకిస్తాన్ విషయంలో ఫైర్‌మీదున్న ఇండియన్స్ ఊరుకుంటారా.. రాఖీ సావంత్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ గుప్పిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు నీకు పాకిస్తాన్ వారసత్వమే కరెక్ట్..

05/04/2019 - 20:11

మనిషి భూగోళమంత గొప్పవాడు. ఇది అందరికీ తెలిసిన సత్యం. కానీ మనిషి తలచుకుంటే భూగోళాన్ని మించి విశ్వాంతరాల్లోకి వెళ్లి రాగలిగే శక్తి ఉన్నవాడు. అతని శక్తియుక్తులు అతనికి తెలియవు. అవసరమైనప్పుడు మాత్రమే ఎలాగైనాసరే వాటిని ఉపయోగించి విశ్వాంతరాళాలకు ఎదిగి విశ్వంభరుడవుతాడు. అలాంటి ఆలోచనతోనే ఓ అద్భుతమైన పాటను బాలభారతం చిత్రం కోసం ఆరుద్ర రాశారు.

05/04/2019 - 20:09

కోడూరి కౌసల్యాదేవి రాసిన ‘చక్రభ్రమణం’ నవల ఆధారంగా దిగ్గజ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన సినిమా -డాక్టర్ చక్రవర్తి. 1964 జూలైలో స్క్రీన్స్‌కు వచ్చిన సినిమా గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరదు. అంతేకాదు, వర్థమాన దర్శకులకు పెద్ద బాలశిక్షగా చెప్పుకునే చిత్రాల్లో డాక్టర్ చక్రవర్తికీ ప్రాధాన్యత కలిగిన స్థానం ఉంటుంది.

Pages