S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/19/2018 - 02:56

విజయవాడ, మార్చి 18: ఆత్మస్థైర్యం, శక్తి, సమర్థత తెలుగువారి సొత్తు అని, అందుకే ఏ దేశానికి వెళ్లినా రాణిస్తున్నారని, అలాంటి తెలుగువారు, ప్రధానంగా ఆంధ్రులతో పేచీ పెట్టుకోవటం కేంద్రానికి ఏమాత్రం మంచిది కాదని శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు.

03/19/2018 - 03:42

విశాఖపట్నం, మార్చి 18: తమ పార్టీకి నష్టమని తెలిసినా బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుందని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందు టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే, గణనీయమైన ఓట్ల శాతం వచ్చిందని అన్నారు. సాధారణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తే, ఓట్ల శాతం తగ్గిందని అన్నారు.

03/18/2018 - 02:29

అమరావతి, మార్చి 17: విళంబి నామ సంవత్సరం తెలుగువారి జీవితాల్లో నవ్యకాంతులు నింపాలని, ప్రతి లోగిలిలో సంతోషం వెల్లివిరియాలని, కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా గడపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లోని తెలుగువారికి ఆయన విళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

03/18/2018 - 00:41

విజయవాడ, మార్చి 17: ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) సంయుక్తంగా చేపట్టిన హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలు పరిశోధనలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు.

03/18/2018 - 00:41

విజయవాడ(బెంజిసర్కిల్), మార్చి 17: టీడీపీ, వైకాపాలకు రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలనే ముఖ్యమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్ విమర్శించారు. వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే క్రమంలో బీజేపీపై తప్పుడు, అసత్య ప్రచారాలను చేస్తున్నారని, వీటిని సహించేది లేదన్నారు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

03/18/2018 - 00:40

విజయవాడ, మార్చి 17: ఇప్పటివరకు ప్రభుత్వ పథకాలకు కేవలం లబ్ధిదారులుగా ఉన్న గ్రామీణ వర్గాలను ఇక ముందు అంకుర వాణిజ్య వ్యవస్థాపకులుగా చూడబోతున్నాము. కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే నేషనల్ లైలీహుడ్ మిషన్ ఈ మేరకు ఇప్పటికే పలు రాష్ట్రాలకు ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు పంపింది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో దీని అమలుకు పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ఫ్) కార్యాచరణ ప్రారంభించింది.

03/18/2018 - 00:39

అమరావతి, మార్చి 17: కేంద్ర ప్రభుత్వ సహకారం అందించకపోయినప్పటికీ, 16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ గత నాలుగు సంవత్సరాలుగా మైనార్టీల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం 2,300 కోట్ల భారీగా బడ్జెట్ కేటాయించి ఖర్చు చేసిందని మండలిలో ప్రభుత్వ విప్ ఎంఏ షరీఫ్ చెప్పారు.

03/18/2018 - 00:39

విజయవాడ (క్రైం), మార్చి 17: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)లో పని చేస్తున్న 16మంది అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం సేవాపతకాలు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు సేవా పతకం, ఉత్తమ సేవా పతకం, మహోన్నత సేవా పతకం మూడు విభాగాలు ప్రకటించిన హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనూరాధ ఉత్తర్వులు జారీ చేశారు. ఉగాది తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని ఈ పతకాలు ప్రకటించారు.

03/18/2018 - 00:38

విజయవాడ, మార్చి 17: పెరూ దేశంలోని అంతర్జాతీయ బంగాళదుంప పరిశోధనా సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బార్బరా వెల్స్, ఆసియా రీజినల్ డైరెక్టర్ సమరేందు మొహంతి శనివారం వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో విజయవాడలో భేటీ అయ్యారు. బంగాళదుంపలు, చిలకడదుంపల పరిశోధనాంశాలు, కొత్త వంగడాలు, మన రాష్ట్రంలో వేడికి తట్టుకునే వంగడాల సాగుకు ఉన్న అవకాశాలపైన సుదీర్ఘంగా చర్చించారు.

03/18/2018 - 00:38

విజయవాడ(బెంజిసర్కిల్), మార్చి 17: గత రెండు సంవత్సరాల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం చేయూత, ఆర్థిక వనరుల వినయోగంతో నష్టాలను అధిగమిస్తూ లాభాల బాటలోనికి పయనిస్తోంది. ఇదే క్రమంలో ఆర్థిక వనరులను కల్పించుకునే దిశగా సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్న సంస్థ ఎండీ మాలకొండయ్య మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు.

Pages