S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/21/2018 - 03:28

విజయవాడ, మార్చి 20: అవిశ్వాసం నుంచి తప్పించుకోవడమంటే అది రాజకీయ ఆత్మహత్య లాంటిందేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. సభలో అవిశ్వాసంపై నోటీసు వస్తే తిరస్కరించే అధికారం స్పీకర్‌కు లేదని స్పష్టం చేశారు. సభ సజావుగా లేదని తిరస్కరించడం స్పీకర్‌కు తగదని సూచించారు. సభను సజావుగా నడపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు.

03/21/2018 - 03:25

విజయవాడ(బెంజిసర్కిల్), మార్చి 20: నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్యాకేజీతో పాటు హోదా కూడా తప్పని సరిగా కావాల్సిందేనని, ఇందులో రాజీపడే ప్రసక్తేలేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ట్విట్టర్‌లో డిమాండ్ చేశారు. ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన ఏపీకి తక్షణ సహాయం కావాలని, అది హోదానా.. ప్యాకేజీనా..

03/21/2018 - 03:59

శ్రీకాళహస్తి, మార్చి 20: ప్రత్యేక హోదా సాధనలో భాగంగా టీడీపీ వినూత్న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. మంగళవారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ చిత్రపటాలకు పెళ్లి జరిపించారు.

03/21/2018 - 02:59

విజయవాడ, మార్చి 20: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకూ సముద్రంలో చేపల వేటను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చేపలు తమ సంతానోత్పత్తి చేసుకునేందుకు వీలుగా 61 రోజుల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. అయితే నాన్-మోటరైజ్డ్ సాంప్రదాయ బోట్లకు మాత్రం మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

03/21/2018 - 02:59

విజయవాడ(బెంజిసర్కిల్), మార్చి 20: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఈనెల 22వ తేదిన జరప తలపెట్టిన రహదారుల దిగ్బంధన కార్యక్రమానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు.

03/21/2018 - 02:58

విజయవాడ(బెంజిసర్కిల్), మార్చి 20: రాష్ట్రంలోని బోయ కులస్థులను ఎస్టీల్లో చేర్చడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో గత కొంత కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా దీనిని వ్యతిరేకిస్తున్న గిరిజన జేఏసీ మంగళవారం చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సమావేశాలను అడ్డుకునే ప్రయత్నంలో అసెంబ్లీ ముట్టడికి గిరిజన జేఏసీ నేతృత్వంలో నేతలు ప్రయత్నించారు.

03/21/2018 - 02:58

విజయవాడ, మార్చి 20: ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న బీజేపీ సీనియర్ నేత ఆర్.లక్ష్మీపతి మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. భారతీయ జనతాపార్టీతో పొత్తు ఉన్న కారణంగా ముఖ్యమంత్రి ఇటీవల లక్ష్మీపతికి ఈ పదవీ బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల కారణంగా బీజేపీ అధిష్ఠానం ఆదేశానుసారం తన పదవికి రాజీనామా చేశారు.

03/21/2018 - 02:57

విజయవాడ, మార్చి 20: రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి పటిష్ఠమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. మంగళవారం సచివాలయంలో తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ బేస్ క్యాంప్స్ ఆర్మ్‌డ్ బేస్ క్యాంప్స్, స్ట్రైక్ ఫోర్సెస్, చెక్‌పోస్టుల్లో ఈ-నిఘా ద్వారా ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

03/20/2018 - 04:17

విశాఖపట్నం, మార్చి 19: రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు, విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ అధిష్ఠానం ఇచ్చిన పిలుపు మేరకు విశాఖలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు మానవహారాలు నిర్వహించారు.

03/20/2018 - 04:15

విజయవాడ (ఎడ్యుకేషన్): రెండువేల పదమూడులో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాల్లో 35శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధిస్తే 2017లో 43శాతం మంది ఉత్తీర్ణులై డీఎస్సీకి అర్హత సాధించారని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. సోమవారం నగరంలోని ఓ హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ టెట్) ఫలితాలను ఆయన విడుదల చేశారు.

Pages