S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/19/2018 - 04:21

విజయవాడ, మార్చి 18: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ మాతృమూర్తి సత్యవతి శనివారం రాత్రి కొత్త ఢిల్లీలో పరమపదించారు. ఆమె మరణవార్త తెలిసిన వెంటనే దినేష్‌కుమార్ హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. సత్యవతికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారిలో దినేష్‌కుమార్ అందరికంటే పెద్దవారు.

03/19/2018 - 04:20

రాజమహేంద్రవరం, మార్చి 18: గోదావరి జిల్లాల్లో వర్జీనియా పొగాకు సాగు ఏటికేడాది తగ్గిపోతోంది. అధిక శాతం రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళుతున్నారు. పొగాకు గిట్టుబాటు కావడం లేదని మొక్కజొన్న, శనగ వంటి పంటల వైపు రైతులు దృష్టిసారిస్తున్నారు. గోదావరి నదీ ప్రాంతాల్లో వర్జీనియా సాగుచేసే పొలాల్లో అధిక శాతం ఇపుడు తీపి జొన్న, తెల్లజొన్న, మొక్కజొన్న, శనగ పంటలు సాగుచేస్తున్నారు.

03/19/2018 - 03:17

శ్రీశైలం టౌన్, మార్చి 18: ఉగాది మహోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన ఆదివారం శ్రీశైలంలో తెలుగు సంవత్సరాది పర్వదినం పురస్కరించుకుని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల రథోత్సవం నయనానందకరంగా సాగింది. లక్షలాది మంది కన్నడ భక్తుల మధ్య ప్రధాన మాడవీధుల్లో సాగిన మల్లన్న రథోత్సవం ఆద్యంతం అలరించింది.

03/19/2018 - 03:17

రైళ్ల రాకపోకలకు అంతరాయం

03/19/2018 - 03:15

పినపాక, మార్చి 18: గిరిజన బాలికపై మానవ మృగాలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాయి. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్లబయ్యారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..

03/19/2018 - 03:13

భద్రాచలం టౌన్, మార్చి 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం స్వామివారి వసంతపక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉగాదిని పురస్కరించుకుని ముందుగా మూలవరులకు పంచామృతాభిషేకం నిర్వహించారు. రాత్రి స్వామిని నిత్యకల్యాణ మండప వేదిక వద్దకు తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పంచాంగాలను స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు.

03/19/2018 - 04:12

విజయవాడ (ఇంద్రకీలాద్రి) మార్చి 18: తెలుగువారి తొలి పండుగ ఉగాది సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ఆదివారం వెండి రథంపై ఊరేగించారు. మల్లికార్జున మహామండపం ప్రక్కన వివిధ రకాల పుష్పాలతో రథాన్ని అందంగా అలకరించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను రథంలో కొలువుతీర్చారు.

03/19/2018 - 04:14

తిరుపతి, మార్చి 18: తెలుగు నూతన సంవత్సరాది శ్రీ విలంబినామ ఉగాది వేడుకలు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ఉగాది ఆస్థానం ఆగమోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో సర్వభూపాల వాహనంపై గురుడాళ్వార్‌కు అభిముఖంగా ఆశీనులను చేశారు.

03/19/2018 - 04:05

కర్నూలు, మార్చి 18: ‘‘రానున్న ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం.. ఆ వెంటనే అమరావతి నుంచి రాజధానిని ప్రకాశం జిల్లా దొనకొండకు మార్చడం తథ్యం’’ అన్న ప్రచారం రాయలసీమ జిల్లాల్లో జోరందుకుంది.

03/19/2018 - 03:44

గుంటూరు (కొత్తపేట), మార్చి 18: ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనలోనే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని పంచాంగకర్తలు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. శ్రీ విళంబి నామ సంవత్సరంలో తెలుగు ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉంటారని, రాష్ట్రం సుభిక్షంగా వెలుగొందుతుందని వివరించారు.

Pages