S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/09/2017 - 03:28

విశాఖపట్నం, డిసెంబర్ 8: జనసేన నేత పవన్ కళ్యాణ్ విమర్శలను తాము పాజటివ్‌గా తీసుకుంటామని రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలెప్‌మెంట్ విశాఖపట్నం ఛాప్టర్(ఐస్‌టీడీ) ఆధ్వర్యంలో నగరంలో ఓ హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన జాతీయ హెచ్‌ఆర్ సదస్సులో ఆయన మాట్లాడారు.

12/09/2017 - 03:27

తిరుపతి, డిసెంబర్ 8: తిరుమలలో భక్తుల సౌకర్యార్థం 39 కోట్ల రూపాయల వ్యయంతో వసతి గృహ సముదాయాన్ని నిర్మించాలని సంకల్పించినట్టు టిటిడి ఇఓ సింఘాల్ చెప్పారు. శుక్రవారం తిరుమలలో ఆయన జేఈఓ శ్రీనివాసరాజుతో కలసి విస్తృతంగా తనిఖీలు చేశారు. పాపవినాశనం మార్గంలో నూతనంగా నిర్మిస్తున్న వకుళామాత విశ్రాంతి భవనాన్ని, శ్రీవారి సేవా సదన్ నిర్మాణ పనులను పరిశీలించి అకారులకు పలు సూచనలు చేశారు.

12/09/2017 - 03:22

విశాఖపట్నం, డిసెంబర్ 8: దేశ రక్షణలో జలాంతర్గాముల పాత్ర కీలకమైనదని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. భారత నౌకాదళంలో జలాంతర్గాముల సేవలు ప్రారంభించి సరిగ్గా 50 ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో సబ్‌మెరైన్ ఆర్మ్‌కు ప్రెసిడెంట్స్ కలర్స్ (జలాంతర్గాముల సేవలను గుర్తించి సర్వ సైన్యాధ్యక్షుడు బహూకరించే పతాకం)ను రాష్టప్రతి కోవింద్ ప్రదానం చేశారు.

12/09/2017 - 03:19

విజయవాడ, డిసెంబర్ 8: రాష్ట్ర ప్రభుత్వానికి తానేమీ వ్యతిరేకం లేదా అనుకూలం కాదని, తానేమి చెప్పినా ప్రభుత్వం క్షణాల్లో స్పందిస్తున్నదనే ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని అయితే శ్రమదోపిడీకి పాలకుల అనాలోచిత నిర్ణయాలు, అవినీతి, అక్రమాలకే తాను పూర్తి వ్యతిరేకినని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తెలిసో తెలియకో తప్పులు చేయొచ్చు.. సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం వహించవచ్చు..

12/09/2017 - 03:17

విజయవాడ (పటమట) డిసెంబర్ 8: రాజకీయ నాయకులకు కుల వివక్ష ఉండకూడదని, ఏపీ అభివృద్థి జరగాలంటే కులాల గొడవలు పోవాలని, ఇప్పటికీ విజయవాడ కులాల ఉచ్చులో చిక్కుకుని ఉందని జననేత పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల జనసేన సమన్వయ కర్తల సమావేశం శుక్రవారం విజయవాడ పటమటలోని మారిస్‌స్టెల్లా కళాశాల ఆడిటోరియంలో జరిగింది.

12/09/2017 - 03:16

విజయవాడ, డిసెంబర్ 8: రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఏపీ యువజన విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు.

12/09/2017 - 03:14

విజయవాడ, డిసెంబర్ 8: పోలవరంపై శే్వతపత్రం అనవసరం.. ఢిల్లీకి అఖిలపక్షం అవసరం లేదు.. ప్రాజెక్టును అడ్డుకోటానికి కాంగ్రెస్, వైకాపాలు కుయుక్తులు పన్నుతున్నాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం గర్హనీయమని పీసీసీ అధికార ప్రతినిధి ఎన్ తులసిరెడ్డి అన్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది చంద్రబాబు వాలకం అంటూ శుక్రవారం ఒక ప్రకటనలో తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.

12/09/2017 - 03:13

రాజమహేంద్రవరం, డిసెంబర్ 8: పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసే ఎన్నికలకు వెళ్తామని గతంలో చేసిన ప్రకటనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కట్టుబడివుండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) రైతు విభాగం రాష్ట్ర అద్యక్షుడు ఎంవిఎస్ నాగిరెడ్డి కోరారు. ముఖ్యమంత్రి జీవితంలో ఈ ఒక్క మాటపైనైనా నిలబడాలని ఆయన కోరారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం అయన విలేఖరులతో మాట్లాడారు.

12/09/2017 - 03:13

విజయవాడ, డిసెంబర్ 8: రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని, అధికార పక్షమే ప్రతిపక్షంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి కూడా తన ఆస్తులు ప్రకటించాలని, పోలవరం పూర్తి కాకూడదని ఆయన దేవుడిని ప్రార్థిస్తుంటారని ఎద్దేవా చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో తెలియదన్నారు.

12/09/2017 - 00:23

విశాఖపట్నం, డిసెంబర్ 8: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయగుండం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 330 కిలో మీటర్ల వద్ద, మచిలీపట్టణానికి తూర్పు ఈశాన్యంగా 550 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. ఇది ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించి శనివారం ఉదయానికి ఒడిశా తీరానికి చేరుకుంటుంది.

Pages