S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/08/2017 - 03:44

విజయవాడ, డిసెంబర్ 7: దక్షిణ కొరియాలో మూడు రోజుల పర్యటన విజయవంతమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగానికి అనుకూల వాతావరణం కల్పించగలిగామన్నారు. కొరియా అభివృద్ధి తనను ముగ్ధుడిని చేసిందన్నారు. దక్షిణ కొరియా పర్యటన ముగించుకుని బుధవారం రాత్రి ఆయన విజయవాడ చేరుకున్న ఆయన గురువారం సీఎంవోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన పర్యటన విశేషాలు వెల్లడించారు.

12/08/2017 - 03:43

మచిలీపట్నం, డిసెంబర్ 7: క్రీడాకారులకు విద్య, ఉద్యోగావకాశాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మోటమర్రి హరిత మెమోరియల్ 8వ ఆంధ్రప్రదేశ్ సీనియర్స్ మహిళా అంతర్ జిల్లాల హాకీ ఛాంపియన్‌షిప్ పోటీలను గురువారం కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం ఆంధ్ర జాతీయ కళాశాలలో ఆయన ప్రారంభించారు.

12/08/2017 - 03:26

విజయవాడ, డిసెంబర్ 7: ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థుల సమస్యపై కేంద్ర ప్రభుత్వం ఈ నెల 11న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్థానిక ఎన్‌టిఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో మంత్రి కామినేని గురువారం ఫాతిమా కాలేజీ విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు.

12/08/2017 - 03:26

రైల్వేకోడూరు, డిసెంబర్ 7: కడప జిల్లాలోని శేషాచలం అడవుల్లో తమిళ కూలీలు, స్మగ్లర్లు బరి తెగించారు. గురువారం టాస్క్ఫోర్స్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దీంతో సిబ్బంది కాల్పులు జరిపారు.

12/08/2017 - 03:25

గూడెంకొత్తవీధి, డిసెంబర్ 7: విశాఖపట్నం జిల్లాలో విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రిన్సిపాల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. గూడెంకొత్తవీధి మండలం, పెదవలస పంచాయతీ పరిధిలో చాపరాతిపాలెం గ్రామానికి చెందిన గిరిజన బాలిక చింతపల్లిలోని జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. గూడెంకొత్తవీధి మండలం ఏకలవ్య పాఠశాలలో పదో తరగతి చదువుతున్న తన బావను చూసేందుకు గత నెల 26న మధ్యాహ్నం పాఠశాలకు వెళ్ళింది.

12/08/2017 - 03:25

విశాఖపట్నం, డిసెంబర్ 7: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వచ్చే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు. ప్రస్తుతం మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని, ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరువ అవుతోందన్నారు.

12/08/2017 - 03:24

విశాఖపట్నం(క్రైం), డిసెంబర్ 7: రాష్ట్రంలో అవినీతి నిరోధక (ఏసీబీ) కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలో ఏసీబీ నూతన కార్యాలయ భవనాన్ని గురువారం ప్రారంభించిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాజమండ్రి కేంద్రంగా ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.

12/08/2017 - 03:23

అనంతపురం, డిసెంబర్ 7: వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 400 కిలోమీటర్ల మైలురాయి దాటింది. గత నెల 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర కర్నూలు జిల్లా మీదుగా అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. శింగనమల మండలం కల్లుమడి దాటగానే 400 కిలోమీటర్ల మైలురాయిని జగన్ దాటారు. గురువారానికి 408.1 కిమీ పాదయాత్ర ముగిసినట్టయింది. బుధవారానికే 396.9 కి.మీ.

12/08/2017 - 03:23

అనంతపురం సిటీ, డిసెంబర్ 7: రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ విభజన తరువాత రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చదువుకోవాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.

12/08/2017 - 03:22

విశాఖపట్నం, డిసెంబర్ 7: డీసీఐని కాపాడుకునేందుకు పార్లమెంట్‌లో పోరాడతామని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హెచ్చరించారు. విశాఖ షీహార్స్ జంక్షన్ వద్ద డీసీఐ ఉద్యోగులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని ఆయన పేర్కొన్నారు.

Pages