S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/09/2017 - 00:23

విజయవాడ, డిసెంబర్ 8: ఈనెల 14 నుంచి 20వ తేదీవరకు జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాలను భారీస్థాయిలో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇంధన సామర్థ్యం పెంపు, పరిరక్షణ కోసం ప్రజా చైతన్య కార్యక్రమాన్ని చేపట్టాలని, ఇంధన వినియోగదారులు, లబ్ధిదారులను భాగస్వాములుగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించింది.

12/09/2017 - 00:22

విజయవాడ, డిసెంబర్ 8: ప్రభుత్వం శనివారం నుంచి ‘సాధికార మిత్ర’ల ఎంపికకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలోని ఒక కోటీ 4లక్షల గ్రామీణ కుటుంబాల పరిధిలోని ప్రతి 35 కుటుంబాల క్లస్టర్‌కు ఒకరు చొప్పున ‘సాధికార మిత్ర’ను ఎంపిక చేస్తారని ‘సెర్ప్’ సీఈఓ కృష్ణమోహన్ వెల్లడించారు. ఈ ఎంపిక డిసెంబర్ 8 నుంచి 12 వరకు జరుగుతుంది.

12/09/2017 - 00:22

విజయవాడ, డిసెంబర్ 8: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ సంక్రాంతి వేడుకలను వైభవంగా నిర్వహించనుంది. ‘అమరావతి సంక్రాంతి జీవన వారసత్వ సంబరాలు’ పేరిట అమరావతి వేదికగా జనవరి 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని తన ఛాంబర్‌లో సంబరాల నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

12/09/2017 - 00:21

విజయవాడ, డిసెంబర్ 8: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి 2884 కోట్ల రూపాయల మేర రావాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు తేల్చింది. ఇటీవల ఢీల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు ప్రాజెక్టు గురించి వివిధ అంశాలపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 380 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారు.

12/09/2017 - 00:20

విజయవాడ, డిసెంబర్ 8: పోలవరం ప్రాజెక్టును అన్ని విధాల కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పూర్తి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకుగాను రాజకీయాలకు అతీతంగా రైతుల భాగస్వామ్యంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో జనవరి 7,8,9 తేదీల్లో ధవళేశ్వరం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి శుక్రవారం ఒక ప్ర

12/09/2017 - 00:20

విజయవాడ, డిసెంబర్ 8: సర్వశిక్షా అభియాన్, ప్రభుత్వం ప్రారంభించిన ‘బడి రుణం తీర్చుకుందాం’ పథకం కింద ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు ఇస్తూ ఆదాయపు పన్నుశాఖ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ‘బడి రుణం తీర్చుకుందాం’కు విశేష స్పందన వస్తున్న విషయం తెలిసిందే.

12/09/2017 - 00:19

విజయవాడ, డిసెంబర్ 8: గ్రామీణ ప్రాంతాల్లో పశు వైద్యశాలలు, సాంఘిక సంక్షేమ పాఠశాలలు, జూనియర్ కాలేజీలను పటిష్ఠపరచడానికి రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామీణ వౌలిక వసతుల అభివృద్ధి నిధి (ఆర్‌ఐడీఎఫ్) నుంచి నాబార్డు రూ.154.93 కోట్ల రుణం మంజూరు చేసింది.

12/08/2017 - 04:07

విజయవాడ, డిసెంబర్ 7: బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం జరిగే విధంగా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ వెన్నుపోటు రాజకీయాలు నడపటం దారుణమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. విజయవాడలో గురువారం జరిగిన సంఘ కార్యవర్గ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు.

12/08/2017 - 04:06

పోలవరం, డిసెంబర్ 7: పోలవరం ప్రాజెక్టు కేంద్రం నిర్మించాల్సి ఉండగా ముడుపుల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మాణ బాధ్యత చేపట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసిపి) ఎంపి వైసి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వైసిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు, నాయకులు గురువారం పరిశీలించారు.

12/08/2017 - 04:04

ఏలూరు, డిసెంబర్ 7: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులపై శే్వతపత్రం విడుదల చేయాలని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించిన పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకున్న రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు వెనుకంజ వేయటంలో అర్ధమేమిటని ప్రశ్నించారు.

Pages