S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/15/2017 - 23:55

గుంటూరు, నవంబర్ 15: చంద్రన్న బీమా పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శం.. పేదవాడి బతుకుకు ఓ భరోసా.. ఈ పథకాన్ని మరింత విస్తృతం చేసేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు అందజేస్తాం.. మధ్యతరగతి వర్గాలు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు.. చివరకు వంట పనిచేసుకునే వారికి సైతం ప్రీమియం వర్తింపచేసే విధంగా నిబంధనలు సరళతరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు.

11/15/2017 - 23:54

హైదరాబాద్, నవంబర్ 15: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్పొరేట్ అనుకూల ఆలోచన ధోరణి మారాలని వైఎస్‌ఆర్‌సిపి అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కె.పార్థసారథి అన్నారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

11/15/2017 - 23:50

నెల్లూరు, నవంబర్ 15: ఇటీవల నిర్వహించిన జైలు సిబ్బంది పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉద్యోగాలకు ఎంపికైన వారికి వచ్చే ఏడాది జనవరి నుండి నెల్లూరులోని ఏపి స్టార్స్ శిక్షణా కేంద్రంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జైళ్ల శాఖ డిజి వినయ్‌రంజన్ రే తెలిపారు. బుధవారం ఏపి స్టార్స్ కేంద్రంలో శిక్షణ కోసం అవసరమైన వౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి అధికారులతో సమీక్షించారు.

11/15/2017 - 23:50

విజయవాడ, నవంబర్ 15: రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా ఎన్‌ఎండి ఫరూఖ్ బుధవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఆయన నవ్యాంధ్రలో శాసన మండలి తొలి చైర్మన్ కావడం విశేషం. మండలి చైర్మన్‌గా చక్రపాణి పదవీ విరమణ చేశాక, ఎవరినీ ఎంపిక చేయలేదు. కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన శీతాకాల సమావేశాలను శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం నడుపుతున్నారు.

11/15/2017 - 23:48

శ్రీకాకుళం, నవంబర్ 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష అనే ప్రత్యేక ప్రాజెక్టు ఏమీ టీడీపీకి లేదని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధి ఒక్కటే ఆకర్షణ అంటూ ఎంపీ రామ్మొహన్‌నాయుడు స్పష్టం చేశారు. అది చూసే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు వస్తున్నారని అభిప్రాయపడ్డారు. బుధవారం ఇక్కడ ప్రజాసదన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మట్లాడారు.

11/15/2017 - 04:07

గుంటూరు, నవంబర్ 14: పేదవాడి సొంత ఇంటి కల మేం నెరవేరుస్తాం.. అన్ని వసతులు..ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సువిశాలమైన ఇళ్లు నిర్మిస్తాం.. గృహ సముదాయాల్లోనే ఉపాధి కల్పిస్తాం.. 2019 నాటికి రాష్ట్రంలో 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేయటమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా మంగళవారం గృహనిర్మాణంపై చర్చ అనంతరం సీఎం ప్రసంగిస్తూ ఇల్లు అనేది పేదవాడి కల..

11/15/2017 - 04:07

అమరావతి, నవంబర్ 14: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై చేస్తున్న ప్రచారంలో నిజం లేదని, కావాలనే కేంద్రంపై బురద జల్లుతున్న వైఖరిని మార్చుకోవాలని కేంద్ర మాజీ మంత్రి, మహిళా మోర్చా ఇన్‌చార్జ్ దగ్గుబాటి పురంధ్రీశ్వరి, రాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ హితవు పలికారు. ప్రాజెక్టుపై వాస్తవ పరిస్థితులను కేంద్ర మంత్రి గడ్కరీని అడిగి తెలుసుకున్నామని వారు చెప్పారు.

11/15/2017 - 04:06

విజయవాడ (క్రైం), నవంబర్ 14: రాష్టవ్య్రాప్తంగా సంచలనం కలిగించిన బోటు ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు ఊపందుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న బోటు యజమాని కొండలరావును ఇప్పటికే పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఇతనితోపాటు మరి కొందరిని కూడా విచారిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాలతో ఇక దర్యాప్తుపై దృష్టి సారించిన యంత్రాంగం పూర్తి వివరాలు రాబట్టే పనిలో ఉంది.

11/15/2017 - 04:05

తిరుపతి, నవంబర్ 14: తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా మంగళవారం అంకురార్పణ జరిగింది. బుధవారం ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 23వ తేదీ వరకు జరగనున్న పద్మావతిదేవీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

11/15/2017 - 04:05

మడకశిర, నవంబర్ 14: గుజరాత్‌లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడి పోతుందనే భయంతోనే కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీకి సవరణలు చేసిందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నరేంద్రమోదీకి ప్రధాని పదవి పిచ్చోడి చేతిలో రాయిగా మారిందని ఎద్దేవా చేశారు.

Pages