S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/27/2017 - 02:44

అమరావతి, అక్టోబర్ 26: వరస వెంట వరసగా సంఘటనలతో వైకాపా బెంబేలెత్తిపోతోంది. ఓ పక్క జగన్ పాదయాత్రకు న్యాయస్థానం లో ఉపశమనం లభించక నిరు త్సాహంలో ఉండగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేరు ఈడీ జాబితాలోకి ఎక్కడం కేడర్‌ను గందరగోళ పరుస్తోంది. ఖురేషీ కేసు వ్యవహారానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో బొత్స సత్యనారాయణ పేరు తెరమీదకు వచ్చింది.

10/27/2017 - 02:43

పీలేరు, అక్టోబర్ 26: రాష్ట్రంలోని కాపులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కచ్చితంగా బిసి జాబితాలో చేరుస్తారని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ తెలిపారు. గురువారం ఆయన చిత్తూరు జిల్లా పీలేరులో విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.50 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించినట్లు చెప్పారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో కాపు కార్పొరేషన్‌కు ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు.

10/27/2017 - 02:43

భీమవరం, అక్టోబర్ 26: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా ముందుకు వెళ్లడానికి అన్ని పార్టీల తరహాలోనే భారతీయ జనతా పార్టీ (బిజెపి) కూడా బిసి కార్డును ఉపయోగించుకుంటోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాల మేరకు బిజెపి ఒబిసి మోర్చా జిల్లాల వారీగా బిసి చైతన్య మహాసభలను నిర్వహించబోతోంది. ఈ సభలను రెండు దశల్లో నిర్వహించనున్నారు.

10/27/2017 - 02:42

కర్నూలు, అక్టోబర్ 26: కంచ ఐలయ్యకు పిచ్చిపట్టి పిచ్చిపిచ్చి పుస్తకాలు రాస్తున్నారని రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్య అంటే శ్రేష్టమైన అని అర్థం.. అలాంటి ఆర్యవైశ్యులను కంచ ఐలయ్య విదేశీయులుగా పేర్కొనడం దుర్మార్గమన్నారు. ఆర్యవైశ్యులు ద్రావిడులేనని స్పష్టం చేశారు.

10/27/2017 - 02:47

కామవరపుకోట, అక్టోబర్ 26: కుటుంబ కలహాల కారణంగా భార్య, ఇద్దరు పిల్లలను నిద్రిస్తున్న సమయంలో గదిలో పెట్రోలు పోసి, నిప్పంటించి సజీవదహనం చేసిన కిరాతకుడి ఉదంతమిది. ఈ ఘటనలో వారితో కలిసి నిద్రించిన సమీప బంధువు అయిన బాలుడు కూడా సజీవదహనం కాగా, అతడి తల్లి తీవ్రంగా గాయపడింది. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడెం గ్రామంలో బుధవారం అర్థరాత్రి దాటాక ఈ దారుణం చోటుచేసుకుంది.

10/27/2017 - 02:30

విశాఖపట్నం, అక్టోబర్ 26: విశాఖ వన్ టౌన్ ఏరియాలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు బ్రిటిష్ కాలం నాటి ఫిరంగులు బయటపడ్డాయి. స్థానిక క్వీన్ మేరీ స్కూల్‌లో గత కొద్ది రోజులుగా నిర్మాణ పనులు జరుగతున్నాయి. కాలువల నిర్మాణం కోసం కూలీలు గురువారం తవ్వకాలు జరుపుతుండగా నాలుగు ఫిరంగులు బయటపడ్డాయి. భూమి లోపల మూడు అడుగులు తవ్వగానే ఈ ఫిరంగులు బయటపడినట్టు కార్మికులు తెలియచేశారు.

10/26/2017 - 01:15

విశాఖపట్నం, అక్టోబర్ 25: మావోయిస్టు సానుభూతిపరులుగా పేర్కొంటూ చైతన్య మహిళా సంఘం(సిఎంఎస్) ప్రతినిధులపై పోస్టర్లను ముద్రించి ప్రచారానికి పాల్పడిన పోలీసు చర్య ఉద్రిక్తతకు దారితీసింది.

10/26/2017 - 01:14

విజయవాడ, అక్టోబర్ 25: రాష్ట్రంలో నాబార్డ్ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల వినియోగంలో, పనుల నిర్వహణలోనూ నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వెలగపూడి సచివాలయంలో నాబార్డు నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

10/26/2017 - 01:12

విజయవాడ, అక్టోబర్ 25: ప్రభుత్వ ట్రెజరీల నుంచి కోట్లాది రూపాయలు అక్రమ మార్గంలో తరలివెళుతున్న సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కృష్ణా జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగం చేయనివారు కూడా ఏళ్ల తరబడి కోట్లాది రూపాయలు ఉద్యోగి పెన్షన్ పేరిట స్వాహా చేస్తుండటం ఇటీవల బైటపడితే.. తాజాగా తెనాలి సబ్ ట్రెజరీ కార్యాలయంలో మృతురాలి పేరిట పదేళ్లుగా ఆమె కుమారుడు పెన్షన్ తీసుకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది.

10/26/2017 - 01:11

విజయవాడ, అక్టోబర్ 25: జగన్ తల్లకిందులుగా తపస్సు చేసినా సిఎం కాలేడని, ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి ఆయన బిసిలపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నాడని డెప్యూటీ సిఎం కెఈ కృష్ణమూర్తి విమర్శించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో బిసి సంక్షేమ శాఖ మంత్రి అచ్చన్నాయుడుతో కలిసి బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు.

Pages