S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/24/2017 - 04:04

విజయవాడ, అక్టోబర్ 23: రేషన్ షాపుల్లో ఎన్ని నెలలు రేషన్ తీసుకోకపోయినా రేషన్ కార్డు రద్దుకాదని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.

10/24/2017 - 04:05

విజయవాడ, అక్టోబర్ 23: అమెరికాలోని అయోవా విశ్వవిద్యాలయ సాంకేతిక సహకారంతో కర్నూలు జిల్లాలో అత్యాధునిక విత్తన పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. 650 ఎకరాల విస్తీర్ణంలో రూ.680 కోట్ల వ్యయంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

10/24/2017 - 04:01

విజయవాడ, అక్టోబర్ 23: రాష్ట్రంలో ఐదుకోట్ల మంది ప్రజలకు ఆహార భద్రతే ధ్యేయంగా రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ పనిచేస్తుందని కమిషన్ చైర్మన్ జెఆర్ పుష్పరాజ్ అన్నారు. ఆహార భద్రతకు విఘాతం కల్గించే చర్యలపై మీడియాలో వచ్చే వార్తా కథనాలను కూడా సుమోటోగా స్వీకరించి కేసు స్థాయిని బట్టి జ్యుడిషియల్ విధానంలో కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

10/24/2017 - 04:00

విజయవాడ, అక్టోబర్ 23: రాష్ట్రంలో డెంగ్యూ కేసులు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం బాగా పెరిగాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో సీజనల్ వ్యాధులు, జ్వరాలు, పథకాల అమలుపై వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, నోడల్ ఆఫీసర్స్‌తో మంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు.

10/24/2017 - 04:00

భీమవరం, అక్టోబర్ 23: పార్టీని వీడేవారే బురదజల్లుతారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలంగాణ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామివారిని సోమవారం చినరాజప్ప దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

10/24/2017 - 03:59

కరప, ఆక్టోబర్ 23: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 63వ కామన్‌వెల్త్ స్పీకర్ల సదస్సు నవంబర్ 6, 7 తేదీల్లో జరగనుందని రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ ఇన్‌ఛార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సదస్సుకు రాష్ట్రం తరపున శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు డెలిగేట్‌గా, పరిశీలకునిగా తాను హాజరవుతున్నట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కరపలో సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

10/24/2017 - 03:58

బి.కోడూరు, అక్టోబర్ 23: అనుమానంతో భార్యా, పిల్లలను చంపిన పరారయ్యాడు ఓ కసాయి. ఈ సంఘటన కడప జిల్లా బి.కోడూరు మండలం పాయలకుంట్లలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రమణారెడ్డి తన భార్య లక్ష్మీప్రియ(23), కూతురు సాయి శ్రీహిత(3), ఏడాది కుమారుడిని ఆదివారం రాత్రి చంపి పారిపోయాడు.

10/24/2017 - 02:22

శ్రీశైలం, అక్టోబర్ 23: కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శ్రీశైలంలో లక్ష దీపార్చన కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. భక్తులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దేవస్థానం వారు ఈ ఏడాది పుష్కరిణి వద్ద ప్రత్యేకంగా పుష్కర హారతి, లక్ష దీపార్చన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెలలో ప్రతి సోమవారం ఈ కార్యక్రమాలు ఉంటాయి.

10/24/2017 - 02:20

తాడిపత్రి, అక్టోబర్ 23: అనంతపురం జిల్లా తాడిపత్రి శాసనసభ్యులు జెసి ప్రభాకర్‌రెడ్డిపై ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో అనుచిత పోస్టులు పెట్టిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు పట్టణ సిఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.

10/24/2017 - 02:19

నంద్యాల, అక్టోబర్ 23: పొగాకు ఉప ఉత్పత్తుల ద్వారా మరిన్ని లాభాలు ఆర్జించవచ్చని జాతీయ పొగాకు పరిశోధనా సంస్థ సంచాలకులు డాక్టర్ ఆర్‌కె.సింగ్ అన్నారు. దేశంలో పండిస్తున్న పొగాకు పంటను కేవలం బీడీలు, సిగరెట్లు, చూయింగ్‌గమ్ తయారీకి మాత్రమే పరిమితం చేయరాదన్నారు. పొగాకు ఉప ఉత్పత్తులను అనే్వషించి రైతులకు దారి చూపిస్తే పొగాకు సాగుతో రైతులు మరిన్ని లాభాలు ఆర్జిస్తారన్నారు.

Pages