S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/25/2017 - 01:39

హైదరాబాద్, ఆగస్టు 24: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లనే ఫ్యాక్షన్ పెరుగుతోందని, రౌడీషీటర్లకు గన్‌మెన్‌లను కేటాయిస్తూ రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. గురువారం ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ నంద్యాలలో వైకాపా నేత, మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి లక్ష్యంగా జరిగిన కాల్పుల దాడిని ఆయన ఖండించారు.

08/25/2017 - 01:39

విశాఖపట్నం, ఆగస్టు 24: నంద్యాలలో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతోందని రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. కొత్తగా నెలకొల్పిన ఐటి కంపెనీలను ప్రారంభించడానికి గురువారం నగరానికి వచ్చిన లోకేష్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు నంద్యాల ఎన్నికల గురించి విలేఖరులు ప్రస్తావించగా, ‘మీరే చూస్తారుగా’ అని అన్నారు.

08/25/2017 - 01:38

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ఏపి మంత్రి ఆదినారాయణ రెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని ఆలిండియా దళిత్ రైట్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. గురువారం నాడు ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫెడరేషన్ నేత అనంద్‌రావు మాట్లాడుతూ మంత్రి ఆదినారాయణరెడ్డిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించి, అరెస్టు చేయాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు దళిత, గిరిజలను అవమానపరిచేలా మంత్రి మట్లాడారని ఆరోపించారు.

08/25/2017 - 01:38

ఆదోని, ఆగస్టు 24: కర్నూలు జిల్లా ఆదోనిలో గురువారం గణేష్ మండపం వద్ద పెద్ద పేలుడు సంభవించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదోని పట్టణంలోని మట్కార్‌గేరి ప్రాంతంలో వినాయక మండపాన్ని ఏర్పాటుచేశారు. విద్యుత్ దీపాలు ఏర్పాటుకుగాను వెదురు బొంగులు పాతేందుకు మండపం సమీపంలో గుంతలు తవ్వుతుండగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. దీంతో అక్కడే ఉన్న వారు భయాందోళనకు గురయ్యారు.

08/25/2017 - 01:36

విజయవాడ (పటమట) ఆగస్టు 24: రైతాంగ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సెప్టెంబర్ 17న విజయవాడలో ‘రైతాంగ సమర భేరి మహాసభను నిర్వహిస్తున్నట్లు రైతాంగ రక్షణ వేదిక సన్నాహక కమిటీ కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు.

08/25/2017 - 01:35

విజయవాడ, ఆగస్టు 24: మైదాన ప్రాంత స్వయం సహాయ బృందాలు (డ్వాక్రా గ్రూపులు) డిజిటల్ టెక్నాలజీ ఆకౌంటింగ్ వంటి ఆధునిక నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్న తరుణంలో, ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీ మహిళా బృందాలు గత పదేళ్లలో మునుపటి చైతన్యం కోల్పోవడాన్ని ప్రభుత్వం గుర్తించి దానిమీద ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా గత రెండు వారాలుగా సెర్ప్ సీనియర్ అధికారులు గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

08/25/2017 - 01:35

చిత్రం..వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని
కడియం పల్ల వెంకన్న నర్సరీలో మొక్కలతో తీర్చిదిద్దిన వినాయకుని ఆకృతి

08/25/2017 - 00:12

విజయవాడ, ఆగస్టు 24: రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా జరుగుతున్న మైనింగ్‌పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా గ్రానైట్, బైరటీస్, సున్నపురాయి విషయంలో చట్టవిరుద్ధంగా మైనింగ్ జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తక్షణం దీనిపై అధికారులు దృష్టి సారించాలని చెప్పారు. గురువారం వెలగపూడి సచివాలయంలో ఆదాయం ఆర్జించే శాఖలపై దినేష్‌కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

08/25/2017 - 00:11

విజయవాడ(పాతబస్తీ), ఆగస్టు 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్‌బోర్డుకు ఈ నెల 31న జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో మెంబర్‌గా నామినేషన్ పత్రాలను విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు జలీల్‌ఖాన్ గురువారం ఉదయం అధికారులకు అందజేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో కదిలి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాష, నాయకులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

08/25/2017 - 00:11

విజయవాడ, ఆగస్టు 24: ప్రభుత్వ భూముల్లో అభ్యంతరం లేని ఆక్రమణలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 500 చదరపు గజాల్లోపు నివాస గృహాలు నిర్మించిన వారికి ఇది వర్తిస్తుంది. 100 చచరపు గజాల లోపు బిపిఎల్ (దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న) కుటుంబాలకు ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. 2013 నాటి రిజిస్ట్రేషన్ శాఖ బేసిక్ విలువ ఆధారంగా క్రమబద్ధీకరణకు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.

Pages