S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/27/2017 - 04:25

అమరావతి, ఆగస్టు 26: ఉప రాష్టప్రతిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రానికి వచ్చిన తెలుగుతేజం ముప్పవరపు వెంకయ్యనాయుడుకు ఘనస్వాగతం లభించింది. రాష్ట్రప్రభుత్వం ఆయనకు చేసిన పౌరసన్మానం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. గన్నవరం విమానాశ్రయం నుంచి వెలగపూడి సచివాలయం వరకూ దారిపొడవునా ఉపరాష్టప్రతిని స్వాగతిస్తూ స్వాగత ఏర్పాట్లు చేశారు.

08/27/2017 - 04:00

విశాఖపట్నం, ఆగస్టు 26: భారత నౌకాదళంలో విశేష సేవలందించిన విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విరాట్‌ను టూరిజం ప్రాజెక్టుగా తీర్చిదిద్దే ప్రతిపాదనకు మళ్లీ కదలిక వచ్చింది. ఇతర రాష్ట్రాలతో పోటీపడి విరాట్‌ను పర్యాటక ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశాన్ని దక్కించుకుంది.

08/27/2017 - 02:58

ఐరాల , ఆగస్టు 26: చిత్తూరు జిల్లా కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకుని వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. 21 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ఆలయంలో ధ్వజ స్థంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య శనివారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. దీంతో ఈ బ్రహ్మోత్సవాలకు నాంది పలికినట్టయింది.

08/27/2017 - 02:56

తిరుపతి, ఆగస్టు 26 : చెన్నైలో టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించిన దాడుల్లో మలేషియాకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన రూ.16 కోట్లు విలువచేసే 40 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని పట్టుకున్నారు. ఇంతేకాకుండా చెన్నై పోర్టు నుంచి మలేషియాకు ఎవరికి చేరుతున్నాయన్న దానిపై కూడా ఆరా తీస్తున్నారు.

08/27/2017 - 02:47

కొయ్యూరు, ఆగస్టు 26: విశాఖపట్నం జిల్లా, కొయ్యూరు మండలంలో గుప్తనిధుల కోసం దుండగులు గ్రామదేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లోని ఆలయాల్లో గుప్త నిధులు నిక్షిప్తమై ఉన్నాయని, విగ్రహాలను తొలగించి తవ్వకాలు జరుపుతున్నారు.

08/27/2017 - 02:47

కర్నూలు, ఆగస్టు 26: నంద్యాల శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఓట్ల లెక్కింపునకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో అత్యంత భద్రతాచర్యల మధ్య సోమవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభించనున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కించి ఆ తరువాత ఈవిఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు.

08/27/2017 - 01:56

కర్నూలు, ఆగస్టు 26: తమిళనాడులోని ఆర్కేనగర్ ఉప ఎన్నిక తరువాత జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో విజయానికి తెలుగుదేశం పార్టీ భారీ కసరత్తునే చేసినట్లు ఆ పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. ఆ వ్యూహాల కారణంగా నియోజకవర్గంలో ప్రజలను ఆకట్టుకోగలిగామని, విజయం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

08/27/2017 - 01:56

విశాఖపట్నం, ఆగస్టు 26: దేశంలో లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను దశల వారీగా మూసివేయడం లేదా ప్రైవేటుపరం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్ర పన్నుతున్నారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు మండిపడ్డారు. ‘సేవ్ పబ్లిక్ సెక్టార్’ పేరిట విశాఖలో శనివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

08/27/2017 - 01:17

విజయవాడ, ఆగస్టు 26: భారత ఉప రాష్టప్రతి హోదాలో తొలిసారిగా రాష్ట్రానికి విచ్చేస్తున్న వెంకయ్యనాయుడికి తలపెట్టిన పౌర సన్మానానికి ముందు జరిగిన రోడ్‌షో విజయవంతానికి రాష్ట్ర ప్రభుత్వం శాఖలవారీగా జన సమీకరణకు అధికారికంగానే ఇండెంట్లు పెట్టింది.

08/27/2017 - 01:16

విజయవాడ, ఆగస్టు 26: రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ వివాహం అక్టోబర్ 1వ తేదీ జరుగనుంది. ఈ సందర్భంగా సునీత శనివారం తన కుటుంబ సభ్యులతో కలసి ఉండవల్లిలోని సిఎం చంద్రబాబు నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వాన పత్రికను అందచేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలి ఆహ్వాన పత్రికను బాబుకు అందచేసామని చెప్పారు. వివాహానికి తప్పక హాజరు కాగలనని బాబు చెప్పారన్నారు.

Pages