S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/25/2017 - 00:10

విజయవాడ, ఆగస్టు 24: ఉప ఎన్నిక జరిగిన నంద్యాలలో గురువారం కాల్పులతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, ఈ ఘటనకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, వైసిపి అధినేత జగన్ బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. అంతరించిపోతున్న రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని తిరిగి రెచ్చగొట్టే విధంగా టిడిపి, వైసిపి వ్యవహరిస్తున్నాయని గురువారం ఒక ప్రకటనలో రఘువీరా పేర్కొన్నారు.

08/25/2017 - 00:10

విజయవాడ, ఆగస్టు 24: గణపతి నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా విజయవాడ గాంధీనగర్ జింఖానా గ్రౌండ్స్‌లో డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏడు మూషికాలతో కూడిన ప్రత్యేక వాహనంపై 72 అడుగుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ఏర్పాటుపై విశేష స్పందన కన్పించడంతో నిర్వాహకులు రెట్టింపు ఉత్సాహంతో 72 అడుగులకు పెంచారు. ఈసారి 81 అడుగుల ఎత్తులో ఏర్పాటుచేయాలని భావించినప్పటికీ సాంకేతికంగా సాధ్యపడలేదు.

08/25/2017 - 00:10

విజయవాడ, ఆగస్టు 24: కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 26 నుండి రెండు రోజులపాటు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 26వ తేదీ నగరంలో జరిగే పలు బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.

08/25/2017 - 00:09

విజయవాడ, ఆగస్టు 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న సుమారు 27వేల మంది గ్రామ రెవెన్యూ సహాయకుల (విఆర్‌ఏ)ల వేతనాల పెంపు కోసం గురువారం విజయవాడలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.

08/25/2017 - 00:09

విజయవాడ, ఆగస్టు 24: భారతదేశ పార్లమెంట్ విద్యాహక్కు చట్టం 2009 సెక్షన్ 23(2)కి సవరణ ప్రకారం శిక్షణ పొందని ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న వారందరూ విధిగా ఉపాధ్యాయ శిక్షణ పొందాల్సిందేనని దీనికి మరికొంత సమయం కల్పించబడిందని పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి ఓ ప్రకటనలో తెలిపారు.

08/25/2017 - 00:08

విజయవాడ, ఆగస్టు 24: వినాయకుడు ప్రకృతికి ప్రతీకగా నిలిచే ఆరాధ్యదైవం అని, గణేశ్ పూజలకు మట్టి ప్రతిమలనే ఉపయోగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు దేశ, విదేశాల్లోని తెలుగు వారికి ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పురోభివృద్ధికి విఘ్నాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.

08/25/2017 - 00:08

విజయవాడ, ఆగస్టు 24: రహదారి భద్రతపై చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రతి ఆరు మాసాలకు ఒకసారి భారీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రహదారులను ఎలా వినియోగించుకోవాలి, వాటిపై ఎలా ప్రయాణాలు చేయాలి, వాటిని ఎలా పరిరక్షించుకోవాలి.. అనే అంశాలపై రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అర్థమయ్యేలా అవగాహన కల్పించాలని చెప్పారు.

08/24/2017 - 23:52

కాకినాడ, ఆగస్టు 24: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో అచ్చంగా సంకుల సమరం జరుగుతోంది. ఎన్నడూ లేని విధంగా కులాల వారీగా ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయా కులాల మంత్రులు, నేతలను ప్రధాన పార్టీలు రంగంలోకి దించాయి. ఏ డివిజన్‌లో ఏ కులం ఓట్లు అధిక సంఖ్యలో ఉంటే ఆ డివిజన్‌లో ప్రచారానికి ఆ కులానికి చెందిన నేతలను ప్రయోగిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలు పూర్తిగా కులం రంగు పులుముకున్నాయి.

08/24/2017 - 23:52

విజయవాడ, ఆగస్టు 24: రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా జరుగుతున్న మైనింగ్‌పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా గ్రానైట్, బైరటీస్, సున్నపురాయి విషయంలో చట్టవిరుద్ధంగా మైనింగ్ జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తక్షణం దీనిపై అధికారులు దృష్టి సారించాలని చెప్పారు. గురువారం వెలగపూడి సచివాలయంలో ఆదాయం ఆర్జించే శాఖలపై దినేష్‌కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

08/24/2017 - 23:51

మేదరమెట్ల, ఆగస్టు 24 : ముందు వెళ్తున్న లారీని టూరిస్టు బస్సు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌తోసహా ఒక ప్రయాణికుడు మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లాలో గురువారం జరిగింది.

Pages