S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/15/2017 - 00:08

అమరావతి, ఏప్రిల్ 14: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

04/15/2017 - 00:07

విజయవాడ (ఎడ్యుకేషన్), ఏప్రిల్ 14: ఇంటర్మీడియట్ రాష్ట్ర టాపర్‌గా నిలిచిన ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన షేక్ షర్మిలను శుక్రవారం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి శిద్దా రాఘవరావు ప్రత్యేకంగా అభినందించారు. గురువారం విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో 992 మార్కులతో ఎంపిసిలో రాష్ట్ర టాప్ ర్యాంకర్‌గా షర్మిల నిలిచింది. ఈ సందర్భంగా షర్మిలను రాజధాని అమరావతిలో అభినందించారు.

04/15/2017 - 00:06

అమరావతి, ఏప్రిల్ 14: మరో రెండేళ్లలో ఎన్నికలు ఉండటం, అధికారుల పెత్తనం వల్ల పార్టీ కార్యకర్తలకు కావలసిన పనులు చేయలేకపోతున్నామని మంత్రులు, ఎమ్మెల్యేలు వాపోతుండటంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెరదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. వారంరోజుల నుంచి ఏఐఎస్, ఐపిఎస్ బదిలీలు జరుగుతాయని వార్తలు, లీకులు రావడమే తప్ప, ఇంతవరకూ దాన్ని కార్యాచరణలో పెట్టకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

04/15/2017 - 00:06

విజయవాడ, ఏప్రిల్ 14: గ్రామస్థాయిలో కీలకమైన రెవెన్యూ విధులు నిర్వర్తిస్తున్న రెవెన్యూ సహాయకులు ఏళ్లతరబడి కేవలం రూ.6,400ల గౌరవ వేతనంతో కొట్టుమిట్టాడుతున్నందున తక్షణం వారికి కనీస వేతనంగా రూ.18వేలు చెల్లిస్తూ తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే అనుసరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దన్న, ప్రధాన కార్యదర్శి ఎం బాలకాశి డిమాండ్ చేశారు.

04/15/2017 - 00:05

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 14: సంచలనం రేపిన ఆయేషా మీరా కేసు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అగ్నిపరీక్షలా పరిణమించింది. ఈ కేసులో జీవిత ఖైదు పడిన పిడతల సత్యంబాబు నిర్దోషిగా బయటపడటాన్ని పోలీసు శాఖ జీర్ణించుకోలేకపోతోంది. ఆయేషా కేసు దర్యాప్తులో ఆదినుంచీ పోలీసులు చాలా తప్పులు చేశారంటూ సత్యంబాబు తరఫు డిఫెన్స్ న్యాయవాది పట్ట్భా బహిరంగంగానే చెప్పడం పోలీసులు మరింత అవమానంగా భావిస్తున్నారు.

04/15/2017 - 00:04

విజయవాడ, ఏప్రిల్ 14: అడ్డగోలుగా జరిగిన రాష్ట్ర విభజన తరువాత కట్టుబట్టలతో రోడ్డునపడ్డ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే అర్హత ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి లేదని నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

04/15/2017 - 00:03

విజయవాడ, ఏప్రిల్ 13: ‘వ్యవసాయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం 25 శాతం వృద్ధి సాధించింది. ఆ రాష్ట్రంకన్నా మెరుగైన ఫలితాలు సాధించడానికి మత్స్య, ఉద్యాన రంగంలో మనకు అవకాశాలు ఎక్కువ. వీటన్నింటినీ ఉపయోగించుకుని ఈ ఏడాది వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 30శాతం పైబడి వృద్ధి సాధించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం తన నివాసం నుంచి వ్యవసాయం, అనుబంధ రంగాల అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

04/14/2017 - 23:32

అమరావతి, ఏప్రిల్ 14: రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పోరాడిన అప్పటి పొలిటికల్ ఫైర్‌బ్రాండ్, విజయవాడ మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ హఠాత్తుగా శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ప్రత్యక్షమయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి సచివాలయానికి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.

04/14/2017 - 23:32

విజయనగరం, ఏప్రిల్ 14: వారం రోజులుగా ఎఒబిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మావోయిస్టుల అగ్రనేతలు సమావేశమయ్యారని సమాచారం తెలియడంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఒకపక్క పోలీసులు కూంబింగ్‌ను ముమ్మరం చేయగా, మరోపక్క మావోయిస్టులు పోస్టర్లను గోడలకు, చెట్లకు అంటిస్తూ ఉనికిని చాటుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడి గిరిజనులు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

04/14/2017 - 23:31

ఒంగోలు,ఏప్రిల్ 14:రాష్ట్రంలో పోలీసులకు నూతన పద్ధతిలో శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్టడ్రిజిపి నండూరి సాంబశివరావుతెలిపారు. శుక్రవారం ఒంగోలులోని జిల్లాపోలీసు శిక్షణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 12వేల కానిస్టేబుళ్ళ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అందులో ఆరువేల పోస్టులను ఇప్పటికే భర్తీచేశామన్నారు.

Pages