S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/06/2016 - 07:42

విశాఖపట్నం, అక్టోబర్ 5: వివిధ రాష్ట్రాలు ఇప్పటికే ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు పెద్దపీట వేస్తున్న తరుణంలో రాష్ట్రంలో కూడా ప్రైవేట్ వర్శిటీల ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. దీంతో ఐదు వర్సిటీల ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే 21 వర్సిటీలు దరఖాస్తు చేయగా, దాదాపు ఐదింటికి దాదాపు లైన్ క్లియర్ అవడంతో దూసుకొస్తున్నాయి.

10/06/2016 - 07:41

విజయవాడ (ఇంద్రకీలాద్రి), అక్టోబర్ 5: దేవాదాయ ధర్మాదాయశాఖలో పైస్థాయి అధికారుల వేధింపులతోనే ఇవో బొమ్మకంటి త్రిమూర్తులు మృతి చెందినట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇవోల సంఘం ఆరోపించింది. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సంఘ నాయకులు తెలిపారు.

10/06/2016 - 06:41

హైదరాబాద్, అక్టోబర్ 5: రాజకీయ, సామాజిక కోణంలో ఇప్పటివరకూ తెదేపాను ఆదరించని రాయలసీమపై పట్టు సాధించే లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికి రాజకీయంగా వైసీపీని దెబ్బకొట్టిన బాబు, ఇక అభివృద్ధి కోణంలో సీమ ప్రజలకు చేరువయ్యే ప్రణాళికలకు పదునుపెడుతున్నారు.

10/06/2016 - 06:41

విజయవాడ, అక్టోబర్ 5: ‘కొత్త విషయాలు తెలుసుకోవటం తేలికే, కానీ నేర్చుకోవటం అనుకున్నంత సులభం కాదు.. అదొక పెద్ద సమస్య... ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థిగా మారి నేర్చుకోవటం వల్లనే అది సాధ్యపడుతుంది’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్బోధించారు.

10/06/2016 - 06:37

విజయవాడ, అక్టోబర్ 5: రాజధాని అమరావతిని నీలం, ఆకుపచ్చ నగరంగా అభివృద్ధి చేసేందుకై ఓ ప్రణాళికాబద్ధంగా ప్రపంచంలోని ఉత్తమ విధానాలను అనుసరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో రాజధానికి కొండవీటి వాగు నుంచి ఎలాంటి వరద ముంపు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పరిసరాల్లోని సహజ వనరులను కాపాడుకుంటూనే వాటి ఫలితాలు అందుకునేలా చూడాలన్నారు.

10/05/2016 - 08:20

తిరుమల, అక్టోబర్ 4: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండోరోజైన మంగళవారం ఉదయం శ్రీమలయప్పస్వామి చిరుజల్లులు కురుస్తుండగా పటాటోపం చాటున ఐదు తలల చిన్నశేష వాహనంపై బదరీనారాయణుని రూపంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య భక్తులు నృత్యాలు, భజనలు, జియ్యంగార్ల ,వైష్ణవ స్వాముల వేదమంత్రాలతో చిన్నశేష వాహనం మలయప్పస్వామి విహారం ఆద్యంతం రసరమ్యంగా సాగింది.

10/05/2016 - 07:58

హైదరాబాద్, అక్టోబర్ 4: ఏపి బిజెపిలో అంతర్గత కుమ్ములాటలు రోడ్డెక్కాయి. విజయవాడ నగర బిజెపి అధ్యక్షుడు, బీసీ వర్గానికి చెందిన డాక్టర్ ఉమామహేశ్వరరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ, రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు తీసుకున్న నిర్ణయంపై పార్టీలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

10/05/2016 - 07:57

శ్రీకాకుళం(టౌన్), అక్టోబర్ 4: ఇంతవరకూ ఇంటర్నేషనల్ జర్నల్‌లో నమోదుకాని, విశాఖ, హైదరాబాద్ వంటి మహానగరాల్లో సాధ్యం కాని ఓ అరుదైన శస్తచ్రికిత్స శ్రీకాకుళానికి చెందిన డాక్టర్ దానేటి శ్రీ్ధర్ విజయవంతంగా నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో దానేటి మాట్లాడుతూ శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు గ్రామానికి చెందిన ఓ ఉపాధ్యాయుని భార్య లోపింటి ధనలక్ష్మి గర్భవతి.

10/05/2016 - 07:57

హైదరాబాద్, అక్టోబర్ 4: ఆంధ్రప్రదేశ్‌లో కాలేజీ విద్యార్థులకు వెల్‌నెస్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. విద్యార్థినీ, విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, వికాసం, విజ్ఞానం, జబ్బులపై ముందస్తు అవగాహన కల్పించేందుకు వెల్‌నెస్ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించామని అన్నారు.

10/05/2016 - 07:56

హైదరాబాద్, అక్టోబర్ 4: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎంబిబిఎస్ సీట్ల భర్తీలో అక్రమాలు జరిగాయని ఎపి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ ఎన్. రఘువీరారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు రఘువీరారెడ్డి పార్టీ నాయకులతో మంగళవారం రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు.

Pages