S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/09/2017 - 00:55

అమెరికాకు చెందిన లగ్జరీ బైక్‌ల తయారీ సంస్థ ఇండియన్ మోటార్‌సైకిల్.. భారతీయ మార్కెట్‌కు సరికొత్త బైక్‌ను తీసుకొస్తోంది. స్కౌట్ బాబర్ పేరిట వస్తున్న దీని ధర ఎక్స్‌షోరూం ప్రకారం 12.99 లక్షల రూపాయలు. ఇటలీకి చెందిన మోటో గుజ్జి, బ్రిటన్‌కు చెందిన ట్రయంఫ్ మోటార్‌సైకిల్ మోడళ్లకు పోటీగా ఇండియన్ మోటార్‌సైకిల్ సంస్థ దీన్ని పరిచయం చేస్తోంది.

08/09/2017 - 00:53

మంగళవారం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో వరిష్ట మోటార్స్ తమ నూతన పియాజియో డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. ఇప్పటికే నాంపల్లి, సంగారెడ్డి, వికారాబాద్, జహీరాబాద్‌లలో వరిష్ట మోటార్స్‌కు షోరూంలు, వర్క్‌షాప్‌లున్నాయ. ఈ క్రమంలో కూకట్‌పల్లిలోనూ కొత్త శాఖను మొదలుపెట్టింది. త్రిచక్ర వాహన వినియోగదారులకు అమ్మకాలు, సర్వీస్‌లో ప్రపంచ శ్రేణి అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని సంస్థ వెల్లడించింది

08/09/2017 - 00:51

దేశీయ ఆటో రంగ సంస్థ టివిఎస్ మోటార్.. మంగళవారం మార్కెట్‌లోకి సరికొత్త జుపిటర్ క్లాసిక్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. మార్కెట్‌లో ఇప్పటికే జుపిటర్ స్కూటర్ మోడల్ ఉన్నది తెలిసిందే.
అయతే దానికి లేటెస్ట్ ఎడిషన్‌గా వచ్చినదే ఈ జుపిటర్ క్లాసిక్.

08/09/2017 - 00:50

న్యూఢిల్లీ, ఆగస్టు 8: టాటా మోటార్స్.. విదేశీ అమ్మకాలు గత నెలలో 12 శాతం పెరిగాయి. జూలైలో మొత్తం 98,534 యూనిట్ల విక్రయాలు జరిగినట్లు మంగళవారం సంస్థ వెల్లడించింది. నిరుడు జూలైలో 88,159 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ప్యాసింజర్ వాహన అమ్మకాలు ఈసారి 66,508 యూనిట్లుగా, పోయినసారి 57,796 యూనిట్లుగా ఉన్నాయి.

08/09/2017 - 00:50

ముంబయి, ఆగస్టు 8: దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ యాక్సిస్ బ్యాంక్.. సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించింది. 50 లక్షల రూపాయల వరకు ఉన్న డిపాజిట్లపై వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్లు దించి 3.50 శాతానికి పరిమితం చేసింది. 50 లక్షల రూపాయలకు మించిన డిపాజిట్ల వడ్డీరేటును మాత్రం 4 శాతంగానే ఉంచింది.

08/09/2017 - 00:49

ముంబయి, ఆగస్టు 8: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలకు లోనయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 259.48 పాయింట్లు క్షీణించి 32,014.19 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 78.55 పాయింట్లు కోల్పోయి 9,978.55 వద్ద నిలిచింది.

08/09/2017 - 00:48

న్యూఢిల్లీ, ఆగస్టు 8: దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్ర బ్యాంక్.. జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ల కోసం డెబిట్ కార్డ్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. జీరో బ్యాలెన్స్ అకౌంట్ క్రింద ఖాతాను తెరిచినవారికి తొలి ఏడాది కేవలం 99 రూపాయలకే డెబిట్ కార్డును అందిస్తామని కొటక్ మహీంద్ర బ్యాంక్ తెలిపింది.

08/09/2017 - 00:47

హైదరాబాద్, ఆగస్టు 8: రాష్ట్రంలో చేనేత ఉత్పత్తిదారులకు శుభవార్త. ప్రఖ్యాత ఈ-కామ ర్స్ సంస్థ అమెజాన్ వేదికగా ఆన్‌లైన్‌లో చేనేత ఉత్పత్తులను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. చేనేత కళాకారులు తమ ఉత్పత్తులను దేశ వ్యాప్తంగా ఉన్న అమెజాన్ కస్టమర్లకు విక్రయించవచ్చు. ఏ విధంగా విక్రయించవచ్చునో అవగాహన కల్పించేందుకు అమెజాన్ శిక్షణ కూడా ఇవ్వనుంది.

08/09/2017 - 00:46

హైదరాబాద్, ఆగస్టు 8: అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ సారథ్యంలో అమెరికాలో జరిగే సదస్సులో ప్రసంగించాలని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావును ఆహ్వానించారు. సెప్టెంబర్ 12న అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో జరిగే సమ్మిట్‌లో ప్రసంగించాలని కోరుతూ యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ లీగల్ పాలసీ కౌన్సిల్ ఉపాధ్యక్షులు ఎమి హరియాని కెటిఆర్‌కు ఆహ్వానం పంపించారు.

08/09/2017 - 00:46

న్యూఢిల్లీ, ఆగస్టు 8: మొండి బకాయిలు 5 వేల కోట్ల రూపాయలకు పైబడి పేరుకుపోయి, వాటిలో 60 శాతానికిపైగా నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ)గా బ్యాంకులు గుర్తించిన ఖాతాదారులను దివాలా తీసిన సంస్థలుగా పరిగణించడం జరుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు.

Pages