S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/14/2017 - 00:16

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ద్రవ్యోల్బణం గణాంకాలు, అమెరికా-ఉత్తర కొరియా మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు, ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను వివిధ సంస్థలు వెల్లడించే ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్ సరళిని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వారం కోల్ ఇండియా, ఐడిబిఐ, టాటా పవర్ తదితర సంస్థలు తమ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయ.

08/14/2017 - 00:15

న్యూఢిల్లీ, ఆగస్టు 13: యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యుబిఎల్).. విజయ్ మాల్యాతో సంస్థాగత సమాచారాన్ని పంచుకోవడం లేదు. యుబిఎల్ ఒకప్పటి చైర్మన్ మాల్యా అన్నది తెలిసిందే. అయితే స్టాక్ మార్కెట్లలో ఉన్న సంస్థల్లో డైరెక్టర్‌గా లేదా ఏదైనా కీలక బాధ్యతల్లో మాల్యా ఉండరాదంటూ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిషేధం విధించిన తర్వాత మాల్యాతో యుబిఎల్ సంబంధాలు తెగిపోయాయి.

08/14/2017 - 00:14

హైదరాబాద్, ఆగస్టు 13: ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్‌ఐటి లేదా ఐఐఐటి) హైదరాబాద్ గ్రాడ్యుయేట్లకు లక్షల్లో సాలరీలున్న జాబ్ ఆఫర్లు వచ్చాయ. 116 సంస్థలు చేపట్టిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్లలో ఇక్కడి విద్యార్థులందరికీ ప్లేస్‌మెంట్లు రాగా, బిటెక్ విద్యార్థుల వార్షిక వేతన ఆఫర్లు 13.4 లక్షల నుంచి 18.8 లక్షల రూపాయల మధ్య ఉన్నాయ.

08/14/2017 - 00:13

హైదరాబాద్, ఆగస్టు 13: తెలంగాణ రాష్ట్రానికి త్వరలోనే మిగులు విద్యుత్ వెలుగులు రానున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నిర్మిస్తున్న 800 మెగావాట్ల కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం (కెటిపిఎస్) 7వ దశ ప్లాంట్ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తి కానున్నాయి.

08/14/2017 - 00:11

జిఎమ్‌ఆర్ ఇన్‌ఫ్రా
నష్టం రూ. 136.6 కోట్లు
న్యూఢిల్లీ, ఆగస్టు 13: జిఎమ్‌ఆర్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ ఏకీకృత నష్టం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 136.60 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో 235 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 3,159 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 2,239 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.

08/14/2017 - 00:11

న్యూఢిల్లీ, ఆగస్టు 13: దేశీయ రుణ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి పెట్టుబడులు పోటెత్తుతున్నాయ. ఈ నెలలో ఇప్పటిదాకా 10,419 (1.6 బిలియన్ డాలర్లు) కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చాయ. అయతే స్టాక్ మార్కెట్ల నుంచి 2,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులు వెనక్కిపోయాయ.

08/13/2017 - 00:24

పారిస్/బెర్లిన్, ఆగస్టు 12: రోజుకో గుడ్డు తింటే.. ఆరోగ్యానికి ఢోకా లేదన్నది ఒకప్పటి మాటే. నేడు గుడ్డు లాగిస్తే.. అనారోగ్యాన్ని ఆహ్వానించినట్లే అవుతోందిమరి. యూరప్‌లో పరిస్థితి ఇలాగే ఉందిప్పుడు. యూరోపియన్ యూనియన్ (ఈయు) దేశాల్లో విషపూరిత గుడ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ల్యాబ్ పరీక్షల్లో లక్షలాది గుడ్లలో కీటక సంహారిణి ఫిప్రోనిల్ అవశేషాలు బయటపడుతున్నాయి.

08/13/2017 - 00:21

కోల్‌కతా, ఆగస్టు 12: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) శ్లాబుల హేతుబద్ధీకరణ, రాబోయే రోజుల్లో దాని ఆదాయంపై ఆధారపడి ఉందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.

08/13/2017 - 00:19

హైదరాబాద్, ఆగస్టు 12: జెటా కంపెనీతో కలిసి తమ బ్యాంకు కార్పోరేట్స్ ప్రయోజనాల కోసం ఐడిఎఫ్‌సి బ్యాంక్ బెనిఫిట్స్‌ను ఆవిష్కరించింది. ఈ మేరకు ఆ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవతార్ మోంగా ప్రకటించారు. ఉద్యోగులు తమ ఖర్చులు, క్లైమ్స్‌ను డిజిటైజ్ చేయడంతోపాటుగా తమ విధులను కాగిత రహితంగా మార్చుకోవచ్చని ఆయన చెప్పారు.

08/13/2017 - 00:19

న్యూఢిల్లీ, ఆగస్టు 12: దేశీయ ప్రైవేట్ రంగ టెలికామ్ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో ఏకంగా 1,210 కోట్ల రూపాయల ఏకీకృత నికర నష్టాన్ని నమోదు చేసింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఈ అనిల్ అంబానీ సారథ్యంలోని సంస్థ.. ఇలా నష్టాల పాలవడం ఇది వరుసగా మూడో త్రైమాసికం.

Pages