S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

12/08/2017 - 01:40

పశ్చిమాసియాలో మళ్లీ పెనుమంటలు చెలరేగుతున్నాయి. తన మిత్ర దేశమైన ఇజ్రాయెల్ రాజధానిగా జరూసలెంను గుర్తిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయంపై ముస్లిం ప్రపంచం భగ్గుమంటోంది. అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా గాజా ప్రాంతంలో నినాదాలు చెలరేగాయి. ఈ రెండు దేశాల జెండాలను తగులబెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలూ ట్రంప్ నిర్ణయాన్ని తూర్పారబట్టాయి.

12/04/2017 - 02:44

టెహరాన్, డిసెంబర్ 3: భారత్-ఇరాన్ దేశాలు సంయుక్తంగా నిర్మించిన అతిపెద్ద చబహార్ రేవు తొలిదశను ఇరాన్ ప్రధాని హుస్సేన్ రౌహానీ ఆదివారం ప్రారంభించారు. దీనివల్ల అఫ్గానిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు పాకిస్తాన్‌తో నిమిత్తం లేకుండా వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు మార్గం సుగమం అవుతుంది.

12/04/2017 - 02:39

లాహోర్, డిసెంబర్ 3: తొమ్మిదేళ్ల క్రితం భారత వాణిజ్య నగరం ముంబయిపై జరిగిన ఉగ్రదాడికి కుట్రదారుగా భావిస్తున్న హఫీజ్ సరుూద్ సారథ్యంలోని జమాత్ ఉద్ దవా పార్టీ వచ్చే ఏడాది జరగనున్న పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. ఇందుకు సంబంధించిన రాజకీయ సంకేతాలను హఫీజ్ సరుూద్ అందించారు.

12/04/2017 - 02:31

వాషింగ్టన్, డిసెంబర్ 3: ఉగ్రవాద నిరోధన విషయంలో పాకిస్తాన్ అందిస్తున్న సహాయ సహకారాలు ఎంతమాత్రం సంతృప్తికరంగా లేవని అమెరికా ఆరోపించింది. తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌లను అదుపు చేయడంలో పాక్ ప్రభుత్వం ఎలాంటి విజయమూ సాధించలేదని, ఈ రెండు ఉగ్రవాద సంస్థలూ పాక్ గడ్డపై తమ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నాయని సీనియర్ వైట్‌హౌస్ అధికారి ఒకరు స్పష్టం చేశారు.

12/02/2017 - 03:09

జెనీవా, డిసెంబర్ 1: ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి విలయాలు, ఘర్షణలు, కరువుకాటకాలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోడానికి ఆర్థిక సహాయం చేయాలని ఐరాస తన సభ్యదేశాలకు పిలుపునిచ్చింది. ప్రపంచ దేశాలన్నీ మనవతాదృక్పథంతో ముందుకు రావాలని విజ్ఞప్తి చేసింది. ప్రపంచ వ్యాప్తపంగా 136 మిలియన్ల మంది జనం సాయం కోసం ఎదురుచూస్తున్నారిన ఐరాస స్పష్టం చేసింది. ‘ వారందిని ఆదుకోవల్సిన బాధ్యత మనపై ఉంది.

12/02/2017 - 02:59

వాషింగ్టన్, డిసెంబర్ 1: పాకిస్థాన్‌లో పౌర ప్రభుత్వం అత్యంత బలహీనంగా ఉందని అమెరికా అభిప్రాయపడింది. కొద్దిరోజుల క్రితం పాక్‌లో రెచ్చిపోయిన మతవ్ఢ్యౌ పార్టీలను నియంత్రించటంలో ఆర్మీ అనుసరించిన విధానం వారికి మరింత ఊతమిచ్చేలా ఉందని ట్రంప్ యంత్రాంగంలోని ఓ సీనియర్ అధికారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

12/01/2017 - 03:21

బీజింగ్, నవంబర్ 30: భారత్‌తో వివాదాంశంగా ఉన్న డోక్లాం ప్రాంతానికి సమీపంలో ఈ శీతాకాలంలో గణనీయ సంఖ్యలో భద్రతా బలగాల మోహరింపును కొనసాగించనున్నట్టు చైనా సైన్యం గురువారం తెలిపింది. డోక్లాం ప్రాంతం తనదేనని కూడా చైనా పునరుద్ఘాటించింది. భారత్, చైనాల మధ్య డోక్లాంపై 73 రోజుల పాటు కొనసాగిన ఉద్రిక్త భరితమైన ప్రతిష్టంభన ఆగస్టు 28న తొలగిపోయింది.

11/30/2017 - 03:18

సియోల్, నవంబర్ 29: ఉత్తర కొరియా, అత్యంత అణ్వాయుధ క్షిపణి సామర్థ్యం కలిగిన దేశంగా అవతరించిందని అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ సంచలన ప్రకటన చేశారు. తాజా క్షిపణి ప్రయోగ సామర్థ్యంతో ఈ ప్రకటన చేస్తున్నామని అంటూనే, ఇప్పుడు అమెరికాలో ఎక్కడ ఏ లక్ష్యాన్నైనా చేధించగలిగే శక్తిని ఉ.కొరియా పుణికి పుచ్చుకుందని ప్రకటించారు.

11/30/2017 - 03:15

వాషింగ్టన్, నవంబర్ 29: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కుమార్తె, ‘శే్వతసౌధం’ సలహాదారు అయిన ఇవాంకను ప్రశంసలతో ముంచెత్తారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ‘ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు’ (జీఈఎస్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇవాంక ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ఉందని ఆయన కొనియాడారు. భారత పర్యటన సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఇవాంక అద్భుత పనితీరు కనపరుస్తున్నారని ట్రంప్ ట్వీట్ చేశారు.

11/30/2017 - 03:10

కరాచీ, నవంబర్ 29: ప్రముఖ ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తోయిబా’కు, ఆ సంస్థ వ్యవస్థాపకుడైన హఫీజ్ సరుూద్‌కు తాను ‘అతిపెద్ద మద్దతుదారు’నని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. కాశ్మీర్‌లో భారతీయ ఆర్మీని అణచివేయడంలో ఉగ్రవాదుల పాత్రను తాను ఎంతగానో అభినందిస్తానని 74 ఏళ్ల ముషారఫ్ ‘ఏఆర్‌వై’ వార్తాసంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

Pages