S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

12/27/2017 - 02:55

ఇస్లామాబాద్, డిసెంబర్ 26: ఐరాస భద్రతా మండలి సూచన మేరకు కాశ్మీర్ సమస్య పరిష్కారంపై ఇరుపక్షాల నుంచి శాంతి ఒప్పందం ఒకటి ఉండాలన్న సూచనపై పాక్‌లో జరిగిన ఆరు దేశాల పార్లమెంట్ ప్రతినిధుల సమావేశం సంయుక్త ప్రకటన చేసింది.

12/27/2017 - 02:52

లండన్, డిసెంబర్ 26: ఎడమచేతివాటం వారికి దేవునిపై నమ్మకం, విశ్వాసం తక్కువట. ఇలాంటివారు దేవునిపై నమ్మకం కలిగిన కుడిచేతివాటం వారికంటే కొన్ని విషయాల్లో భిన్నంగా వ్యవహరిస్తుంటారట. ఇందుకు వారిలో జన్యుపరమైన కారణాలు కూడా దోహదం చేస్తాయట. ఈ విషయాన్ని ఫిన్‌లాండ్‌లోని ఉలూ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఎవల్యూషనరీ సైకలాజికల్ సైన్స్ జర్నల్‌లో ఈమేరకు ప్రచురితమైన కథనం ప్రకారం...

12/26/2017 - 02:18

లాహోర్, డిసెంబర్ 25: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని ప్రకటించిన ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సరుూద్, ఆదివారం మిల్లి ముస్లిం లీగ్ తరఫున రాజకీయ కార్యాలయాన్ని ప్రారంభించాడు. హఫీజ్‌ను రాజకీయాల్లోకి రానిస్తే ఎన్నికల్లో విధ్వంసం తప్పదంటూ పాక్ సర్కారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా, హఫీజ్ తన ప్రయత్నాలు తాను చేసుకుపోతున్నాడు.

12/26/2017 - 02:15

యేసుక్రీస్తు జన్మదినం క్రిస్‌మస్‌ను ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు సోమవారం ఘనంగా నిర్వహించారు.
చిత్రాలు.. వాటికన్‌సిటీలో నిర్వహించిన వేడుకల్లో బాలయేసు విగ్రహాన్ని ముద్దాడుతున్న పోప్ ఫ్రాన్సిస్.
* జైపూర్‌లోని సెయంట్ ఆండ్రూ చర్చ్ వద్ద అభినందనలు తెలుపుకుంటున్న యువతులు

12/26/2017 - 02:25

బగుయో (్ఫలిప్పీన్స్), డిసెంబర్ 25: క్రిస్మస్ పండుగ జరుపుకోడానికి చర్చికి వెళ్తున్న బస్సును మరో వ్యాను బలంగా ఢీకొన్న ప్రమాదంలో 20మంది మృత్యువాతపడ్డారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. ఉత్తర ఫిలిప్పీన్స్‌లో ఈ ఘోరం చోటుచేసుకుంది.

12/26/2017 - 01:44

ఇస్లామాబాద్, డిసెంబర్ 25: గూఢచర్యం అభియోగంపై పాకిస్తాన్‌లో ఉరి శిక్ష ఎదుర్కొంటున్న భారత నేవీ కమాండర్ కుల్‌భూషణ యాదవ్‌ను ఎట్టకేలకు తల్లి, భార్య కలిశారు. జాదవ్‌ను కలిసే అవకాశం కల్పించాలంటూ వీరిద్దరూ పెట్టుకున్న అనేక అర్జీల నేపథ్యంలో, మానవతా దృక్ఫథంతో అవకాశం కల్పించినట్టు పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది.

12/26/2017 - 00:53

వాటికన్ సిటీ, డిసెంబర్ 25: పాలస్తీనా- ఇజ్రాయల్ సంఘర్షణకు చర్చల ద్వారా పరిష్కారం కనుగొంటేనే మధ్య ఆసియాలో శాంతి వెల్లివిరుస్తుందని పోప్ ఫ్రాన్సిస్ తన క్రిస్మస్ సందేశంలో ఆకాంక్షించారు. జెరూసలెం నగరాన్ని ఇజ్రాయల్ రాజధానిగా గుర్తిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించడంతో మధ్య ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

12/25/2017 - 03:29

బెత్లెహాం, డిసెంబర్ 24: జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయంపై చెలరేగిన ఉద్రిక్తతల ప్రభావం క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ జరిగే వేడుకలపై తీవ్రంగా కనబడే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 6న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నప్పటినుంచి పాలస్తీనా ప్రాంతాల్లో, అలాగే ఇజ్రాయెల్ ఆక్రమణలోని వెస్ట్‌బ్యాంక్ పట్టణమైన బెత్లెహాంలోనూ ఘర్షణలు మొదలయ్యాయి.

12/25/2017 - 03:28

ఇస్లామాబాద్, డిసెంబర్ 24: గూఢచర్య ఆరోపణలపై పాకిస్తాన్ న్యాయస్థానాలు మరణశిక్ష విధించిన భారత సైనికుడు కుల్‌భూషణ్ జాదవ్‌ను కలుసుకునేందుకు ఆయన భార్య, తల్లి సోమవారం ఇక్కడకు వస్తున్నారు. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ కార్యాలయం వెల్లడించింది. ఓ ప్రయివేట్ విమానంలో వీరిద్దరూ ఇస్లామాబాద్ చేరుకుంటారని, జాదవ్‌ను కలుసుకున్న తరువాత తిరిగి స్వదేశానికి వెళ్లిపోతారని స్పష్టం చేసింది.

12/25/2017 - 03:30

దావావో (ఫిలిప్పీన్స్), డిసెంబర్ 24: ఫిలిప్పీన్స్‌లోని దావావో పట్టణంలోని ఓ షాపింగ్ మాల్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో కాల్‌సెంటర్ ఉద్యోగులు సహా 37మంది సజీవదహనమయ్యారు. దావావో పట్టణానికి చెందిన దేశాధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టే ప్రమాద స్థలిని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ షాపింగ్ మాల్‌లో చిక్కుకున్న ఎవ్వరూ బతికి బయటపడే అవకాశం లేదని అధికారులు అంటున్నారు.

Pages