S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/11/2017 - 22:00

ఒకప్పుడు ఇంట్లో గోడలకి బట్టల్ని వేలాడదీసేందుకూ, హేంగర్స్ తగిలించేందుకు చిలక్కొయ్యలుండేవి. ఇవి చెక్క, జంతువుల కొమ్ములూ, ప్లాస్టిక్.. ఇలా రకరకాల మెటీరియల్‌తో తయారయ్యేవి. మాసిపోయిన, వాడిన బట్టలు వేలాడదియ్యడానికి అందం ఆకారం అని ఒకప్పుడు అనుకునేవారేమోనీ, ఇప్పడలా కాదు. ఆ చిలక్కొయ్యలే ఇపుడు ‘హుక్స్’గా పిలవబడుతూ రకరకాల ఆకారాలతో గోడలపై అతుక్కుంటున్నాయి.

07/08/2017 - 22:01

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకనేది సామెత. ఈ సామెతని బాగా అర్థం చేసుకున్న ఫొటోగ్రాఫర్ ‘జూలీ వింటర్ హాల్టర్’. అదెలా అంటే ఆకలేసి హోటల్‌కి వెళ్లి వాళ్ళకి నడిచొచ్చే టేబుల్స్ ఫలహారాలు తెస్తే ఎలా ఉంటుందా అని. అలా ఆలోచన వచ్చిందో లేదో చేస్తున్న

07/07/2017 - 22:57

‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’- ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో గోడలమీదో, పుస్తకాల్లోనో చదువుకున్నమాట ఆ అమ్మాయిని కదిలించింది. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఆరుషి గుప్తా కళ్లుండి చూడలేని పేదలకు ఊతమైంది. చిన్న వయసులో మొగ్గతొడిగిన ఈ సేవా కుసుమం పేదలకు కళ్లజోళ్లు సరఫరా చేస్తోంది. ఓసారి తను ఉపయోగిస్తున్న కళ్లజోడు స్థానంలో కొత్తది కనుక్కొంది. మరి పాతది ఏం చేయాలి?

07/07/2017 - 22:56

మన దేశం నుంచి విదేశాలకు అక్రమ రవాణా అవుతున్న మహిళలు, ఆడపిల్లల వివరాలు తెలుసుకుంటే మనసు ఒకింత బాధకు లోనవుతుంది.
జార్ఖండ్ రాష్ట్రం నుంచి ఏటా 8000 మంది మహిళలు, 5000 మంది ఆడపిల్లలు దుబాయ్‌కి అక్రమ రవాణాకు గురవుతున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో తెలియజేస్తోంది.
ఆడవాళ్ల అక్రమ రవాణా ఐదేళ్లలో 38.3 శాతం నుంచి 45శాతానికి పెరిగినట్లు అంచనావేశారు.

07/06/2017 - 22:39

అది ప్రపంచ సంగీత దినోత్సవం. ఈ సందర్భంగా సంగీత కచేరి ఏర్పాటుచేశారు. వాయిద్యకారులు అంతా సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా పాతికేళ్లుదాటినవారే. వారి మధ్య ఓ పదేళ్ల బుడతడు కూడా ఉన్నాడు. డ్రమ్స్ ముందు నిలబెడ్డాడు. పక్క వాయిద్యకారులు కూడా సందేహంగా ఆ పిల్లాడి వంక చూస్తున్నారు. పాటకు అనుగుణంగా వాయించగలడా అని సందేహిస్తున్నారు.

07/06/2017 - 22:38

ప్రేరణ స్పందిస్తే సృజన ఆవిష్కృతమవుతుంది. అసలు ఫ్యాషన్ అంటే గుర్తొచ్చేది ప్రకృతే. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో ఆవిష్కరణలు ప్రకృతిలోని ఎన్నో విశేషాలని అనుకరించిన మన ఫ్యాషన్ డిజైనర్లు ఇప్పుడు పండ్లు మీద తమ కనే్నశారు. ఉంగరాలు, గొలుసులు, పెండెంట్లు, నెక్లెసులు, చైనులు, క్లిప్పులు, శారీపిన్నులు, చెవిరింగులు- ఇలా ఫ్రూట్స్‌ని ఎన్నో రకాల అభరణాల్లో ఒదిగేలా తీర్చిదిద్దుతున్నారు.

07/06/2017 - 22:37

స్వాతంత్య్రం సిద్ధించి ఆరు దశాబ్దాలు దాటినా భారతావనిలో తరుణీ అడుగులు తడబడుతూనే ఉన్నాయి. వివిధ రంగాల్లో ఆమెకు దక్కాల్సిన స్థానం దక్కటం లేదు. కారణాలు ఎన్నైనా విధాన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత విభాగాల్లో అతివల భాగస్వామ్యం ఇంకా అనుకున్నంత పురోగతి సాధించలేదని గణాంకాలు తెలియజేస్తున్నాయి. వివరాలలోకి వెళితే...

07/06/2017 - 22:36

రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో ఇ్ద్య్యౄజర్ఘీబ్ఘశజ్ద్ఘూఇ్ద్య్యౄజ.శళఆకు మెయల్ చేయవచ్చు.
లేదా ఈ కింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

07/04/2017 - 22:55

ఆస్తమా వ్యాధి నిర్థారణ అవగానే ఇన్‌హేలర్ ఎల్లప్పుడూ మీతో ఉంచుకోమని వైద్యుడు సలహా ఇస్తాడు. కానీ, రాత్రి పడుకునేపుడు వచ్చే గురకలు ఇన్‌హేలర్‌లు ఎంతవరకు తగ్గిస్తాయి? కానీ కొన్ని రకాల ఔషధాలు ఇలాంటి గురకలను తగ్గించటమే కాకుండా, ఆస్తమా వ్యాధి తీవ్రతలను సమర్థవంతంగా తగ్గిస్తాయి. ఆ ఔషధాలంటే మీరే చూడండి..

06/30/2017 - 21:09

గోరింటాకు ఇష్టపడని మహిళలు చాలా అరుదు. పండుగలైనా..్ఫంక్షలైనా ముందుగా ఆడవారు గోరింటాకుకే ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడంటే మార్కెట్లో పౌడర్లు, కోక్‌లాంటివి రెడిమేడ్‌గా దొరుకుతున్నాయి. కాని, ఇదివరకటి రోజుల్లో ప్రతి ఇంటి పెరిట్లో గోరింటాకు చెట్టు తప్పనిసరిగా ఉండేది. ఆషాఢంలో గోరింటాకుకు చాలా ప్రత్యేకత ఉంది. ఆషాఢమాసం వచ్చేస్తోంది..అనగానే ఆడవారి అరచేతులు గోరింటాకుతో అందంగా మెరిసిపోతుంటాయి.

Pages