S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/12/2017 - 23:10

నదిలో అలలు ఎంత సహజమో సంసారంలో కలతలు కూడా అంతే సహజం. అల ఎంత ఎగిరిపడినా నదిని విడిచి ఉండలేదు. అదేవిధంగా భార్యాభర్తలిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడంతోపాటుగా ఒకర్ని ఒకరు పరస్పరం గౌరవించుకోవాలి. ఆధిపత్యం కోసం గొడవలు పడకుండా ఇద్దరిలో సహనం ఉండాలి. ఒకరు కోపంతో ఉన్నపుడు మరొకరు శాంతంగా వుండాలి. అప్పుడే ఆ సంసారం ముందుకు సాగుతుంది.

09/12/2017 - 23:08

సంవత్సరంలోపు పిల్లలకు ఆవుపాలు పట్టించటం హానికరం అంటున్నారు నిపుణులు. అలర్జీకి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. శ్వాస, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు సైతం తలెత్తుతాయని అంటున్నారు. తల్లిపాలకు బదులు నేడు అనేక మంది ఆవుపాలను పట్టించటం పరిపాటి. కాని ఈ పాలలో ఇనుముధాతువు ఉండదు. ఫలితంగా పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఆవుపాలు తమ సంస్కృతిలో భాగంగా చూస్తుంటాం.

09/10/2017 - 00:21

సాటి మనిషికి సహాయం చెయ్యాలనే ఆలోచన చాలా తక్కువమందిలో వుంటుంది. ఆ ఆలోచనలను ప్రోత్సహించే జీవిత భాగస్వామి సాహచర్యం, కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో సేవామార్గంలో నడుస్తున్నారు బెల్లం మాధవి. సావిత్రి భాయి ఫూలే మహిళా సంక్షేమ సంఘం స్థాపించి పది సంవత్సరాలుగా ఎంతోమంది మహిళలకు అండగా నిలిచారు.

09/08/2017 - 23:04

మట్టిలో ఉన్న బంగారాన్ని సానబెడితే మెరుస్తుంది. అలాగే ప్రతిభ ఉన్నవాళ్లను ప్రోత్సహిస్తే మెరికల్లా తయారవుతారు. జిమ్మాస్టిక్స్‌లో అద్భుతాలు చేస్తూ.. ప్రశంసలు అందుకుంటున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. జిమ్మాస్టిక్ క్రీడలో పెంచుకున్న మక్కువ వీరిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. దేశం గర్వించే విధంగా బంగారు, వెండి పతకాలను సొంతం చేసుకున్నారు.
హైదరాబాద్ నుంచి...

09/07/2017 - 23:32

నిత్యం మన వంటల్లో ఉపయోగించే మసాలా దినుసులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకుందాం.

09/06/2017 - 23:36

ఐటీ ఉద్యోగాలు దేశ ఆర్థిక ముఖచిత్రంతోపాటు లక్షలాది కుటుంబాల జీవన స్థితుల్నీ మార్చేశాయి. కాసులు కురిపించే ఐటీ ఉద్యోగాలు కొండంత ఒత్తిడిని కూడా భారతీయ యువతపై మోపుతున్నాయి. కేవలం ఐటీ ఉద్యోగులే కాదు.. ఇతర వృత్తులవారు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటివారు ఒత్తిడిని అధిగమించాలంటే..
నిత్యం వ్యాయామం చేయాలి.
క్రమం తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.

09/05/2017 - 22:21

మనిషి మనుగడ సక్రమంగా సాగాలంటే నేడు ప్రతి ఒక్కరికి మొబైల్ తప్పనిసరి. ఇకపై మొబైల్ ఫోన్ మనీపర్సు కూడా! నగదు రహిత లావాదేవీలు ప్రస్తతం ప్రజలందరు తెలుసుకోవడం తప్పనిసరి అయింది. పెద్దనోట్ల రద్దు తరువాత మొబైల్ ద్వారానే లావాదేవీలు నిర్వహణకు మొబైల్ వినియోగానికి అనేక సంస్థలు ముందుకు వచ్చాయి. అందుకే సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రతిభ వున్నవారు కొత్త యాప్‌లు రూపొందించే పనిలోపడ్డారు.

09/05/2017 - 22:19

నలుగురిలో అందంగా ఆకర్షణీయంగా కనిపించాలంటే దుస్తులే కాదు, హ్యాండు బ్యాగుల్ని కూడా ఎంచుకోవడంలో శ్రద్ధ వహించడం తప్పనిసరి. ఇప్పుడు ఫ్యాషన్ యాక్సెసరీల్లో హ్యాండు బ్యాగులు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈతరం స్ర్తిల అభిరుచి, ఆసక్తికి తగినట్లుగా పలు రకాల డిజైన్లు మార్కెట్‌లో లభిస్తున్నాయి.

08/31/2017 - 23:52

‘‘దోమ చిన్నదే.. కాని దాని కాటుకు వచ్చే రోగాలే భయానకం. బాల్కానీలో నిల్చుంటే చాలు చుట్టుముట్టేస్తుంటాయి. తలుపులు వేసుకున్నా చాలు జొరబడి నిద్రలేకుండా చేస్తుంటాయి. సాయంత్రం ఆరు గంటలు దాటితే చాలు వీటి నివారణకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటాం. చేటు అని తెలిసినా రసాయనాలతో కూడిన మందులనే వాడుతుంటాం. వర్షాలతోపాటు వచ్చే మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలకు ఇవే ప్రధాన కారకాలు.

08/31/2017 - 23:51

భుజాన గిటార్...చేతి సంచిలో వేణువులు (్ఫ్లట్)తో కనిపించే ఈ వ్యక్తే నడయాడే సంగీతం. ఆయనే సంచార సంగీత అధ్యాపకునిగా పేరు గడించిన సుర్రాని వెంకటేశ్వరరావు (ఎస్.వి.రావు). సంగీత కళను దైవ స్వరూపంగా భావించే ఆయన తాను నేర్చుకున్న సంగీతాన్ని నలుగురికి నేర్పించాలనే సదాశయంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇలా సంచార సంగీత అధ్యాపకుడుగా మారాడు. సంగీత శిక్షణకు వయోపరిమితి లేదని నిరూపిస్తున్నారు.

Pages