Others

టెక్కు నిక్కుల హుక్కులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు ఇంట్లో గోడలకి బట్టల్ని వేలాడదీసేందుకూ, హేంగర్స్ తగిలించేందుకు చిలక్కొయ్యలుండేవి. ఇవి చెక్క, జంతువుల కొమ్ములూ, ప్లాస్టిక్.. ఇలా రకరకాల మెటీరియల్‌తో తయారయ్యేవి. మాసిపోయిన, వాడిన బట్టలు వేలాడదియ్యడానికి అందం ఆకారం అని ఒకప్పుడు అనుకునేవారేమోనీ, ఇప్పడలా కాదు. ఆ చిలక్కొయ్యలే ఇపుడు ‘హుక్స్’గా పిలవబడుతూ రకరకాల ఆకారాలతో గోడలపై అతుక్కుంటున్నాయి. గోడలకి మళ్లీ ప్రత్యేకమైన నగిషీలు అద్దక్కర్లేకుండా ఈ హుక్సే అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటికి తాళం చెవులూ, వాలెట్స్, గొడుగులు, తువ్వాళ్ళు కళ్లజోళ్లు బట్టలూ తగిలించే విధంగా తయారవుతున్నాయి. షోకైన హుక్కులు తమ టెక్కుని గోడలపై ప్రదర్శిస్తూ హొయలుపోతున్నాయి.. ఇలా!

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి