S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

11/02/2017 - 19:14

ఆ సుందరి వేదికమీదకు రాగానే ‘మోరీ.. మోరీ..’ అని జనం హర్షాతిరేకంతో నినాదాలు చేయసాగారు.
ఆమె వంగి జనానికి నమస్కారం చేసి మందహాసం చిందించింది. అంతా కరతాళ ధ్వనులతో ఆమె వందనాన్ని స్వీకరించారు.

11/01/2017 - 18:36

తేజా కూడా నవ్వింది.
క్రిబ్ దగ్గర ఆగి, ఉష వంక చూస్తూ నిలబడిపోయాడు. ఉష కొద్దిగా పెద్దదయింది. నల్లటి జుట్టు మెడమీద పడుతోంది. నిద్రలో ఎందుకో నవ్వుకుంటోంది. దానివంకే తదేకంగా చూస్తున్న రఘురామ్ దృష్టిలో ఉష మెడలో వున్న చైన్ మీద ఆగిపోయింది. నా వంక ప్రశ్నార్థకంగా చూచాడు. అతని ప్రశ్న ఏమిటో నాకు అర్థం అయింది.
తల ఆడించాను, అవున్నట్లు.

10/31/2017 - 18:25

హాస్పిటల్ నుంచి వచ్చాక, ప్రతి చిన్న విషయానికి కలవరపడుతోందనిపిస్తోంది నాకు. బహుశా నేను వెళ్లిపోతే తను అన్నీ మేనేజ్ చేసుకోలేనన్న భయమేమో? ఎంత పెద్ద ప్రాజెక్ట్స్ నిర్వహించగలిగే సమర్థురాలు, ఎంత భయపడుతోంది. మళ్లీ యథాస్థితికి రావడానికి ఎంతకాలం పడుతుందో ఎంతకాలం పట్టినా సరే! అసలు వస్తే చాలు. మనసులోనే ప్రార్థించాను వౌనంగా.

10/30/2017 - 01:56

నువ్వు ఎక్కడో కాలేజీ ప్రిన్సిపాల్‌గా వుండాల్సిన వ్యక్తివి కాదు, కాపిటల్‌లో కూర్చొని, దేశ వ్యవహారంలో సంప్రదింపులు చేయాల్సిన వ్యక్తివి. ఎకనమిక్స్ ప్రిన్సిపల్స్ నిర్దేశించాల్సిన వ్యక్తివి.
మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కల్యాణీ. నేను కలిగించిన మనస్తాపం నీ మానసిక వికాసాన్ని భగ్నం చేయనందుకు సంతోషిస్తున్నాను.

10/28/2017 - 19:41

నిన్ను ఎంత అన్యాయపు దశలో వదిలేశాను కల్యాణి! నాన్నమీద చాలా కోపం వచ్చింది. నామీద నాకే చిరాకేసింది.
అంతలోనే సిగ్గనిపించింది కూడా. నా కర్తవ్యాన్ని మరొకరు బాధ్యతగా నిర్వహించలేదని కోపగించుకున్నందుకు.

10/27/2017 - 18:25

మామూలుగానే- నా మెదడులో ఇలాంటి ఆలోచనలు రావు. మా తాతయ్య అనేవాడు, నీకు మెదడు, మనసు కలసి పని చెయ్యవని. ఏదో ఒక్కటే పనిచేస్తుందేమో! చూడబోతే మెదడు ఒక్కటేనేమో!
నాకు వర్జీనియా మనసు అర్థమయింది. కాని ఏం సమాధానం ఇవ్వాలో తెలియక వౌనాన్ని ఆశ్రయించాను.

10/26/2017 - 18:44

అసలు సంబంధమే పెట్టుకోలేదు. ఆలోచనలలోకి రానివ్వలేదు. అప్పుడు కేవలం ఒక్కటే ఆలోచన- నా మనసుకు ఎటువంటి డైవర్షను రాకూడదని. నా దేశం, నా వాళ్ళు, నన్ను బలహీనపరుస్తారని. భావోద్వేగాలకు దూరంగా వుండాలని. మొదట్లో కష్టం అనిపించినా, అసలే కోపంగా వున్న నా మనసు, రోజురోజుకు ఉత్సాహంగా సాగుతున్న నీ రీసెర్చి, నన్ను పూర్తిగా అందరికీ దూరంగా తీసుకువెళ్లిపోయింది.

10/25/2017 - 18:40

నా గదిలో లైటింకా వెలుగుతోందే అనుకుంటూ వచ్చిన ఆ అమ్మాయి నన్ను చూచి భయపడి వుంటుంది. ఒక అడుగు వెనక్కి వేసి తలుపుమీద కొట్టింది. నాకు వినిపిస్తంది కాని కళ్లు తెరువబుద్ధి అవలేదు.
డా.రఘురామ్- ప్రొఫెసర్.. పిలుపులు వినిపిస్తున్నాయి.
రోజులా వర్జీనియా తండ్రి వచ్చాడుట, ఆమెను తీసుకెళ్లడానికి. నా నుదుటిమీద చెయ్యి వేశాడు.
డాక్టర్ డాక్టర్ పిలిచాడు గట్టిగా.

10/24/2017 - 17:49

ఇక మనసులో ఎందుకిలా జరిగిందన్న విచారణ ఎక్కువైంది. నేను ఎక్కడ ఫెయిల్ అయ్యానన్న వెదుకులాట మొదలయింది.
ఆ వెదుకులాటలో మొదటగా తగిలింది నువ్వు, నీ కొడుకు మాత్రమే! అమెరికా రాంగానే మరో ఆలోచన లేకుండా పనిచేసి వుంటే నేను ఇంకా ముందుగా సాధించేవాడిని. నా చేతులారా భవిష్యత్తును చెడగొట్టుకున్నానన్న భావన ఎక్కువైపోయింది.

10/22/2017 - 21:34

ఆ రోజుల్లో సాధారమయిన అమెరికన్‌కి కాలేజీకి వెళ్లాలని కాదు ధ్యేయం, కాళ్లమీద నిలబడటం, స్వతంత్రంగా బతకడం. కానీ వర్జీనియా చాలా తెలివైనది. కాలేజ్ చదువులమీద చాలా ఆశ పెట్టుకుంది. కాని అనుకోని పరిస్థితుల్లో తల్లి అయింది. కాని తల్లిదండ్రుల సహాయంతో కాలేజీ చదువు మొదలుపెట్టింది.

Pages