డైలీ సీరియల్

యమహాపురి- 43

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కానీ బాధ్యత మనదౌతుంది. తెలివిని ఇతరులకమ్మితే- మనకి సంపాదన తక్కువుండొచ్చు కానీ బాధ్యత ఉండదు. బాధ్యతలు లేని సంపాదన మనిషికి ఎదుగుదలకంటే ఎక్కువ సంతోషాన్నిస్తుంది. జీవితంలో సంతోషానికి ప్రాధాన్యం ఇవ్వడమే అసలైన తెలివి’’ అంటాడు సందరం తండ్రి. ఆయన్ని అనుసరిస్తూ ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు.
సుందరం కానిస్టేబుల్‌గా ఉన్నా తన తెలివితో పై అధికారులకు సాయపడతాడు. హోదాకి మించిన బాధ్యతలు స్వీకరించాడని వారతణ్ణి గౌరవిస్తారు. అదే అతడికి తృప్తి!
‘‘సరేలే కానీ- ఈ ఫొటోలో ఉన్నవాళ్ల ఆచూకీ నాకెప్పుడిస్తావ్?’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఆచూకీ అర్జంటుగా తియ్యాలి సార్! ఎందుకంటే ఆ ఫొటోలో మన బిచ్చగాణ్ణిచంపిన హంతకుడున్నాడు’’ అన్నాడు సందరం.
‘‘వ్వాట్’’ అన్నాడు శ్రీకర్ షాక్ తిని.
‘‘అదే నాకు చిత్రంగా ఉంది సార్! ఆ వార్త అందుకే పదే పదే చదివాను. జగదానందస్వామి దీవెన గురించి జనం గొప్పగా చెప్పుకుంటారు. ఆయన వేదికమీదకి పిలిచి దీవించిన వ్యక్తి హంతకుడంటే- ఆయనలోనూ ఏదో పెద్ద మతలబున్నట్లే తోస్తోంది సార్!’’ అన్నాడు సుందరం.
బిచ్చగాడికి విషప్రయోగం చేసిన హంతకుణ్ణి సుందరం దగ్గర్నుంచీ చూశాడు. గుర్తుపట్టడంలో సుందరం ఏ మాత్రం పొరబడడు. అంటే- తనిప్పుడు నిజంగానే జగదానందస్వామి గురించి కాస్త ఎక్కువ ఆలోచించాలి.
శ్రీకర్ కళ్లు మూసుకొని కుర్చీలో వెనక్కి వాలాడు.
జగదానందస్వామి దీవెన పొందినవారిలో తనకి తెలిసి ఒకడు హంతకుడు. ఒకడు యోగి. మిగిలిన నలుగురిలో ఒకామెని హంతకుడితో కలిపి జంటగా దీవించాడు స్వామి. వాళ్లిద్దరూ జంటగానే వేదిక దిగారు. ఆమె ఎవరు? హంతకుడు దొరికితే ఆమె కూడా దొరుకుతుంది. ఆమె దొరికితే ఇంకా ముగ్గురున్నారు. మొత్తం ఆరుగుర్నీ కలిపితే, స్వామి రహస్యం ఏమైనా బయటపడుతుందా?
‘‘సుందరం! నువ్వు బ్రిలియంటే కాదు, లక్కీ కూడా! నీ చూపు పడితే చాలు ఏ కేసుకైనా ఆధారాలు దొరుకుతాయి. ఎలాగో అలా ఈ ఫొటోలో వ్యక్తుల ఆరా తీసి ఆచూకీ సంపాదించు’’ అన్నాడు శ్రీకర్.
‘‘సార్! మీరు నా గురించి అన్నమాటలు- నిజమని నిజంగా మీరు నమ్మితే చిన్న రిక్వెస్టు. మీరు తులసి కిడ్నాప్ కేసు చేపట్టాలి’’ అన్నాడు సుందరం.
హఠాత్తుగా మరో కొత్త పేరు వినపడేసరికి శ్రీకర్ తెల్లబోయి ‘తులసి ఎవరు?’ అన్నాడు.
సుందరం అతడికి తులసి కథ చెప్పి, ‘‘ఆమె తండ్రి పంపిన ఉత్తరం చదివినప్పుడు నాకీ కేసుమీద ఆసక్తి లేదు సార్! కానీ ఈ కేసు కూడా మనని నరకపురికో, శివగిరికో తీసుకెడుతుందన్న అనుమానం మొదలైంది సార్- మీ మాటలు విన్నాక!’’ అన్నాడు.
‘‘నిజంగా తెలివైనవాడివి. ఛాన్స్ రాగానే నీ పెళ్లాం నీకప్పగించిన కేసుని నాకు బదిలీ చేశావ్. బాధ్యత వదిలించుకోవడం నీ జీన్సులో ఉంది కదా!’’ అన్నాడు శ్రీకర్.
శ్రీకర్ గొంతులో కోపం లేదు. చూపులో ముచ్చట ఉంది. అందుకే సుందరం బదులిచ్చే ప్రయత్నం చెయ్యలేదు.
7
ఉదయం పదకొండు గంటలు. మధురాపురి పోలీసు స్టేషన్ ముందు నీరసంగా తచ్చాడుతున్న ఆ యువకుడి ముఖం వాడిపోయి ఉంది. జీన్స్ పాంట్ మీద టీషర్టు రంగు వెలిసి ఉంది. వయసు పద్దెనిమిది ఉండొచ్చు.
అతణ్ణి గేటు వద్ద జవాన్ గమనిస్తున్నాడు. ఓ పది నిమిషాలు చూసి ‘ఎవర్నువ్వు?’ అన్నాడు.
‘‘ఇన్స్‌పెక్టర్ శ్రీకర్ ఉన్నారా?’’ అనడిగాడా యువకుడు.
‘‘ఉన్నారు’’ అన్నాడు జవాన్.
‘‘నేనాయన్ని అర్జంటుగా కలుసుకోవాలి’’ అన్నాడా యువకుడు.
‘‘అవసరమైతే తప్ప ఆయన అందర్నీ కలుసుకోరు. ముందు నీ పేరు, వివరాలు ఇక్కడ పుస్తకంలో వ్రాయి. నీకేదైనా కంప్లయింటుంటే స్టేషన్లో రిజిస్టర్ చేసుకుని వెళ్లు’’ అన్నాడు జవాన్.
‘‘నాది కంప్లయింట్ కాదు. ఆయనకి పనికొచ్చే సమాచారమొకటి అర్జంటుగా ఆయనకే చెప్పాలి’’
‘‘ఆ మాట ముందే చెప్పొచ్చుగా! ఇంతసేపు నువ్విక్కడ ఎందుకు తచ్చాడుతున్నట్లు?’’ గద్దించాడు జవాన్.
‘‘పోలీస్ స్టేషన్‌కి రావడం నాకు కొత్త’’ నసిగాడు యువకుడు.
జవాన్ అతణ్ణి చెక్‌చేసి లోపలకి పంపించాడు.
అప్పటికే ఆ యువకుడి రాకను మోనిటర్లో గమనించిన శ్రీకర్ అతణ్ణి లోపలకు పంపమని వెంకటరత్నానికి చెప్పడంతో ఆ యువకుడు నేరుగా శ్రీకర్ కదిలోకి వెళ్లాడు.
‘‘కూర్చో’’ అన్నాడు శ్రీకర్. ఆ యువకుడు తటపటాయిస్తూ భయం భయంగా అతడికి ఎదురుగా కుర్చీలో కూర్చుని, ‘‘నా పేరు గోపాల్’’ అన్నాడు.
‘‘ఏం చెప్పాలో త్వరగా చెప్పు’’ అన్నాడు శ్రీకర్.
ఆ యువకుడు తన జేబులోంచి ఓ ఫోటో తీసి బల్లమీద పెట్టాడు.
శ్రీకర్ ఆ ఫోటో చూసి ఉలిక్కిపడ్డాడు. బిచ్చగాడికి విషప్రయోగం చేసిన హంతకుడు!
శ్రీకర్ ఏదో అనబోయేలోగా, ‘‘మా అన్నయ్య రాజా. కొన్నాళ్లుగా కనిపించడంలేదు’’ అన్నాడు గోపాల్.
‘‘అంటే హంతకుడు పరారీలో ఉన్నాడన్నమాట!’’ అని మనసులో అనుకుని ‘ఊ’ అన్నాడు శ్రీకర్ పైకి.
‘‘మా అన్నయ్య ఏదైనా ప్రమాదంలో ఉన్నాడని భయంగా ఉంది’’ అన్నాడు గోపాల్.
‘‘హత్య చేసినవాడు ప్రమాదంలో ఉండడా?’’ అని మనసులో అనుకుని, ‘‘ఎందుకని?’’ అన్నాడు.
‘‘మా అత్తయ్యకి అన్నయంటే పడదు?’’ అన్నాడు గోపాల్.
కథలోకి కొత్త పాత్ర ప్రవేశించడంతో- ఇదేదో చాలా పెద్ద వ్యవహారంలా వుందే అనుకున్నాడు శ్రీకర్.
‘‘నాకేదో అర్జంటు సమాచారం ఇవ్వాలన్నావుట. స్వంత గొడవ మాని, ఆ విషయం చెప్పు’’ అన్నాడు చిరాగ్గా.
‘‘దయతో నేను చెప్పేది వినండి సర్’’ అన్నాడు గోపాల్. శ్రీకర్ అతణ్ణి చెప్పనిచ్చాడు.

ఇంకా ఉంది