రంగారెడ్డి

అవకాశ రాజకీయాలకు తెరలేపిన టిఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జనవరి 23: కేసిఆర్ తన పబ్బం గడుపుకోవడానికి అవకాశవాద రాజకీయాలకు తెరలేపి ప్రజలను మోసగిస్తున్నారని మాజీ హోంశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి కేసిఆర్‌పై విరుచుకుపడ్డారు. శనివారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ దుర్గానగర్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కేసిఆర్ గ్రేటర్ ఎన్నికల్లో జిత్తులమారిగా వ్యవహరిస్తూ తన పబ్బం గుడపుకోవడానికి ఊసరవెల్లిగా రంగులు మారుస్తున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే నగరం చుట్టూ మణిహారంగా రింగురోడ్డు, అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్, కార్గో రోడ్లను నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. పరిశ్రమల అభివృద్ధి కోసం ల్యాండ్ బ్యాంక్ వ్యవస్థను ఏర్పాటు చేశామని వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్‌వే, విశాలమైన రోడ్లు కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించినట్టు వివరించారు. ఐటి రంగాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, 2004లో 70 వేల ఉద్యోగాలు ఉంటే 2014 లో 3500 ఉద్యోగ అవకాశాలను కల్పించామని గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లాలో విలువైన స్థలాల్లో రూ.400 కోట్లతో 80 వేల కుటుంబాలకు రాజీవ్‌గృహ కల్ప స్కీమ్ కింద ఇళ్లు కట్టించామని గుర్తు చేశారు. నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి గోదావరి, కృష్ణా ఫేజ్ - 1, 2, 3 దివంగత రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నిర్వహించామని గుర్తు చేశారు. అన్ని రంగాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేసిందని, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు, పాతబస్తీ అభివృద్ధి కోసం రూ.2 వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించి న్యూ సిటీగా తీర్చిదిద్దిందని ఆమె వివరించారు. ప్రతిపక్షాలను మనుగడ లేకుండా చేయాలనే లక్ష్యంతో తన అవకాశ రాజకీయాలకు పాల్పడుతూ పబ్బం గడుపుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఎన్నికల ముందు లంకలో పుట్టినవారంతా రాక్షసులని, ఆంధ్రాలో పుట్టిన వారంతా తెలంగాణ ద్రోహులని విమర్శించిన కేసిఆర్, గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ మనుగడ కోసం ఆంధ్ర వలస ప్రజలపై కపటప్రేమ గుప్పిస్తూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇద్దరు చంద్రులు దొందూ దొందేనని తెలంగాణ ప్రజలను మోసగిస్తూ గ్రేటర్‌లో గెలవడానికి కొత్త నాటకాలకు తెరలేపారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చిందని, ఆంధ్ర ప్రజలు నష్టపోకుండా విభజన చట్టంలో అనేక ప్రాజెక్టులు పొందుపరిచి వారికి న్యాయం చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. కేసిఆర్ తనయుడు కేటిఆర్ గ్రేటర్‌లో వంద సీట్లు గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కొత్త నాటకం ఆడుతున్నారని, అందుకు సిద్ధంగా ఉండాలని ఆమె సవాల్ విసిరారు. ఎన్నికల ముందు తండ్రి తెలంగాణకు దళితుడిని సిఎంని చేస్తానని, లేకపోతే తల నరుక్కుంటానని కపట నాటకం ఆడాడని విమర్శించారు.
హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
తాండూరు, జనవరి 23: హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి కంకణబద్ధులు కావాలని చినజీయర్‌స్వామి పిలుపునిచ్చారు. రెండురోజులు జరిగే విహెచ్‌పి ప్రాంతీయ సమావేశంలో ఆయన సందేశం ఇచ్చారు. ప్రతి మనిషి తన జీవితంలో కృషి పట్టుదల, దృఢ సంకల్పం, ఆత్మబలంతో ముందుకు సాగాలని సూచించారు. సమసమాజ స్థాపన, నీతివంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని ప్రభోదించారు. సమాజంలో ఎవరూ ముందే గొప్పవారు, మహాత్ములు కారని, తాము చేసే కార్యాలు, ప్రజాహితం కోరితేనే అవుతారని అన్నారు. అందుకు ఉదాహరణ త్రేతాయుగంలో శ్రీరాముడు మానవునిగా పుట్టి మాధవుడిగా కీర్తి గడించారని, లోకకల్యాణార్ధం శ్రీరాముడు చేసిన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఘట్టాలను జీయర్ స్వామి వివరించారు. పరమత సహనం ప్రతి హిందూ ఆయుధం అని దాంతో మనం ప్రపంచాన్ని జయించిన వారమవుతామని పేర్కొన్నారు. భగవద్గీతతోపాటు, ఖురాన్, బైబిల్‌ను నిత్యం కొంత సమయం కేటాయించి పఠించాలని సూచించారు. పరమత గ్రంథాల పఠనంద్వారా నేటి సమాజంలో హిందువులుగా మనం పాటిస్తున్న ధర్మం ఏమిటీ? పరమతస్తులు పాటిస్తున్న ధర్మాల సారాంశం మనకు విదితమవుతుందని అన్నారు. మన దేశం ఒక మహత్తర జాతీయవాద దేశంగా ప్రపంచ దృష్టిని కలిగి వుందని, మన సంస్కృతి సంప్రదాయాలను బయటి దేశాలు గౌరవిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలన్నారు. హిందూ జాతి ధర్మ పరిరక్షణకు హిందువులంతా కుల మత వర్గ విభేదాలు వదలి జాతి పరిరక్షకులు కావాలని జీయర్‌స్వామి పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్‌పర్సన్ కె.విజయలక్ష్మి, వెంకటయ్య దంపతులు, కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్ బి.సునీతా సంపత్‌కుమార్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.