ఆటాపోటీ

‘బ్యాడ్ బాయ్’ కిర్గియోస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియా టెన్నిస్ అభిమానులు తమ దేశానికే చెందిన నిక్ కిర్గియోస్ పేరు చెప్తేనే మండిపడుతున్నారు. అద్వితీయ ప్రతిభావంతుడిగా పేరుతెచ్చుకున్నప్పటికీ, మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు అతని ప్రవర్తనను అంతా మూకుమ్మడిగా ఖండిస్తున్నారు. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ఆండ్రియాస్ సిప్పీని ఢీకొన్న కిర్గియోస్ మొదటి రెండు సెట్లను 1-6, 6-7 తేడాతో గెల్చుకున్నాడు. అయితే, పలుమార్లు అంపైర్ నిర్ణయాలతో విభేదిస్తూ, గట్టిగా కేకలు పెడుతూ, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకాగ్రత కోల్పోయాడు. సులభంగానే గెలిచి, మూడో రౌండ్ చేరే అవకాశం ఉన్నప్పటికీ, చివరి మూడు సెట్లను 4-6, 2-6, 8-10 తేడాతో కోల్పోయి, టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఒకప్పుడు జాన్ మెకెన్రో, విక్టర్ ట్రైకో, ఆండీ రాడిక్ వంటి ఆటగాళ్లు టెన్నిస్‌లో అపర దుర్వాసులుగా పేరుపొందారు. మెకెన్రో తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని జరిమానాల రూపంలో చెల్లించాడు. మితిమీరిన ఆగ్రహం వల్లే ట్రైకో, రాడిక్ తమ సామర్థ్యానికి తగినన్ని విజయాలను అందుకోలేకపోయారు. కిర్గియోస్ కూడా వారి మార్గంలోనే నడుస్తున్నాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతని వైఖరి కారణంగా ఆస్ట్రేలియా పరువు మంటగలుస్తున్నదని విమర్శిస్తున్నారు. స్వదేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కిర్గియోస్ తన వైఖరిని మార్చుకుంటాడో లేదో చూడాలి.

చిత్రం..నిక్ కిర్గియోస్