ఆటాపోటీ

పరుగుల యంత్రం ప్రణవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1,009 పరుగులు... ఇది ఒక జట్టు మొత్తం కలిసి చేసిన స్కోరుకాదు.. ఒకే ఒక్కడు సాధించిన పరుగులు. 2016 జనవరి 5న హెచ్‌టి భండారీ కప్ అంతర్ పాఠశాల క్రికెట్ టోర్నమెంట్‌లో ఆర్యా గురుకుల్‌పై కెసి గాంధీ స్కూల్‌కు ప్రాతినిథ్యం వహించిన ప్రణవ్ ధనవాదే ఈ భారీ స్కోరు చేసి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతకు ముందు, 1899లో ఆర్థర్ కొలిన్స్ జూనియర్ హౌస్ మ్యాచ్‌లో 628 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. క్రికెట్‌లో ఏ స్థాయి పోటీల్లోనైనా అదే వ్యక్తిగత అత్యధిక స్కోరుగా నమోదైంది. ఆ రికార్డును సుమారు 117 సంవత్సరాల తర్వాత ప్రణవ్ బద్దలు చేశాడు. ఒక బ్యాట్స్‌మన్ ఇన్ని పరుగులు చేయడం సాధ్యమా? సాధ్యమేనని నిరూపించాడు ప్రణవ్.