ఆటాపోటీ

కొత్తకాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్లెడ్జింగ్ లేదా మైదానంలో బాహాబాహీ.. క్రికెట్ పరువును దిగజార్చడంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ముందుంటారన్న వాదన ఉంది. అయితే, మనకూ ఇదేమీ కొత్తకాదు. పలువురు క్రికెటర్లు వివాదాల్లో చిక్కుకున్నవారే. ఐపిఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొని, జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ పేరును ఈ సందర్భంగా ప్రస్తావించాలి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల క్రికెటర్లు ‘పెద్దమనిషి’ అని గౌరవంగా పిలుచుకునే సచిన్ తెండూల్కర్‌తో గొడవ పడిన ఘన చరిత్ర శ్రీశాంత్‌కు ఉంది. విదేశీ క్రికెటర్లు మైఖేల్ వాన్, ఆండ్రూ సైమండ్స్, కెవిన్ పీటర్సన్, ఆండ్రూ నెల్ వంటి ఎంతో మంది విదేశీ ఆటగాళ్లతో అతను మైదానంలో బాహాబాహీకి దిగి, భారత క్రికెట్ పరువు మంటకలిపాడు. 2008 ఐపిఎల్‌లో హర్భజన్ సింగ్ చేతిలో చెంపదెబ్బతిన్నాడంటే, అతను తన సహచరుల పట్ల కూడా ఏ విధంగా వ్యవహరిస్తాడో స్పష్టమవుతుంది.
పది వనే్డ ఇంటర్నేషనల్స్‌లో ఆడిన భారత మాజీ బ్యాట్స్‌మన్ జాకబ్ మార్టిన్‌ను 2011లో పోలీసులు అరెస్టు చేశారు. మనుషుల అక్రమ రవాణాకు పాల్పడినట్టు అతనిపై అభియోగాలున్నాయి. కోర్టు కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఇరుకున్నాడు. 2000లో తెరపైకి వచ్చిన కేసులో అప్పటి దక్షిణాఫ్రికా కెప్టెన్ హన్సీ క్రానేతో కలిసి ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని అజర్‌పై ఆరోపణలున్నాయి. మూడు మ్యాచ్‌లను ఫిక్స్ చేసినట్టు అతను ప్రాథమిక దర్యాప్తులో అంగీకరించడంతో, జీవితకాలం పాటు సస్పెన్షన్‌కు గురయ్యాడు. అయతే అజర్‌పై వచ్చిన ఆరోపణలు రుజువుకాలేదని పేర్కొంటూ 2012లో కోర్టు అతనికి క్లీన్‌చిట్ ఇచ్చింది. కానీ, అప్పటికే అతని కెరీర్ ముగిసింది. ఆ వివాదాంలోనే మరో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌కు కూడా సంబంధం ఉందని, బుకీలను అతనే భారత క్రికెటర్లకు పరిచయం చేశాడని వార్తలు వచ్చాయి. ఒక టీవీ ఇంటర్వ్యూలో ఈ వార్తలను ప్రస్తావిస్తూ కపిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. పోలీసుల విచారణలో కపిల్‌పై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని రుజువు కావడంతో, దేశానికి మొట్టమొదటిసారి ప్రపంచ కప్‌ను సాధించిపెట్టిన ఒక మహా క్రికెటర్ పరువు నిలబడింది. కాగా, ముందుగా అనుమతి తీసుకోకుండా, అమెరికాలో కొన్ని క్రికెట్ మ్యాచ్‌లు ఆడినందుకు దిలీప్ వెంగ్‌సర్కార్ భారత జట్టు కెప్టెన్సీని కోల్పోయాడు.