ఆటాపోటీ

ధోనీ ఇన్నింగ్స్‌కు తెర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్‌తో జరిగిన వనే్డ, టి-20 సిరీస్‌ల్లో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి చక్కటి సలహాలు, సూచనలిచ్చి, టీమిండియా విజయాలకు బాటలు వేసిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ కెరీర్‌ను త్వరలోనే ముగిస్తాడా? స్వదేశంలో అతను తన చివరి మ్యాచ్‌ని ఆడేశాడా? ఇంగ్లాండ్‌తో బెంగళూరులో జరిగిన చివరి, మూడో టి-20 మ్యాచ్ అతని క్రీడా జీవితంలో, వేలాది మంది స్వదేశ అభిమానుల మధ్య ఆడిన చివరి మ్యాచ్‌గా నిలిచిపోనుందా? ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తే, ఈ ప్రశ్నలకు అవునన్న సమాధానమే వినిపిస్తుంది. గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడలేకపోయిన రోహిత్ శర్మ చివరి టి-20 మ్యాచ్ ముగిసిన వెంటనే, ధోనీకి ఒక ప్రత్యేక బహుమతిని అందచేశాడు. 2007 టి-20 ప్రపంచ కప్, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నంబర్ వన్ జట్టుకు ఇచ్చే టెస్టు గద, 2011 ప్రపంచ కప్ వనే్డ చాంపియన్‌షిప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలను స్వీకరించినప్పటి ఫొటోలతో కూడిన ఒక ఆల్బమ్‌ను రోహిత్ అతనికి ఇచ్చాడు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధికారులే ఈ బహుమతిని ఇవ్వాల్సిందిగా రోహిత్‌కు సూచించారని సమాచారం. అదే నిజమైతే, స్వదేశంలో ఇదే చివరి పరిమిత ఓవర్ల మ్యాచ్ అనే విషయాన్ని ధోనీకి పరోక్షంగా చెప్పినట్టే.
ఈ ఏడాది జూలై మాసంలో చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నీ ఇంగ్లాండ్‌లో జరుగుతుంది. కాగా, స్వదేశంలో భారత్ ఈ ఏడాది అక్టోబర్ మాసంలో ఆస్ట్రేలియాతో వనే్డ సిరీస్ ఆడుతుంది. చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన తర్వాత, అక్టోబర్ వరకూ ధోనీ కెరీర్‌ను కొనసాగించే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఎంతో మంది యువ ఆటగాళ్లు జట్టులో స్థానం కోసం తీవ్రంగా పోటీపడుతున్న నేపథ్యంలో, రాబోయే వనే్డ, టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే జట్టు కూర్పుపై దృష్టి సారించాల్సిన అవసరం సెలక్టర్లపై ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుంటే, ధోనీ కంటే యువ ఆటగాళ్లకు ప్రాధాన్యమిచ్చి, వారిని ప్రపంచ కప్ చాంపియన్‌షిప్స్‌కు సిద్ధం చేయడమే సెలక్టర్లు లక్ష్యంగా ఎంచుకుంటారు. టీమేజ్ సంచలన వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు టీమిండియాలో చోటు కల్పించడం అన్యాపదేశంగా ధోనీని రిటైర్మెంట్‌పై హెచ్చరించడమేనని అంటున్నారు.
ధోనీకి హడావుడి నచ్చదు. రిటైర్మెంట్ల సమయంలో ఆర్భాటాలకు దూరంగా ఉంటాడని ఇప్పటికే స్పష్టమైంది. ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్ పూర్తికాక ముందు అతను ఆ ఫార్మాట్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించి ధోనీ సంచలనం సృష్టించాడు. అతను ఏఏ కారణాలతో ఆ నిర్ణయం తీసుకున్నాడో ఎవరికీ తెలియదు. అయితే, అప్పట్లో జట్టుకు డైరెక్టర్‌గా వ్యవహరించిన రవి శాస్ర్తీ అడుగడుగునా జోక్యం చేసుకోవడం నచ్చకే ధోనీ హఠాత్ నిర్ణయం తీసుకున్నాడన్న వాదన ఉంది. అతను టెస్టు క్రికెట్ నుంచి వైదొలగినప్పుడు వీడ్కోలు కార్యాక్రమం ఏదీ జరగలేదు. సహజంగా క్రికెటర్లకు ఆయా క్రికెట్ బోర్డులు వీడ్కోలు మ్యాచ్‌లను నిర్వహించి, ఘనంగా సత్కరింస్తాయి. కానీ, ధోనీ ఆస్ట్రేలియా పర్యటనలో, అది కూడా సిరీస్ సగంలో ఉన్నప్పుడే టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీనితో, సచిన్ మాదిరిగానే ధోనీకి ఘనంగా వీడ్కోలు చెప్పాలన్న బిసిసిఐ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. వనే్డ, టి-20 ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్టు అతను ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆరంభానికి ముందే ప్రకటించాడు. సిరీస్ ఆరంభమైన తర్వాత ఈ ప్రకటన చేసివుంటే, చివరి మ్యాచ్ ముగిసిన వెంటనే వీడ్కోలు సభ ఉండేది. కానీ, ఆ అవకాశాన్ని బిసిసిఐకి ధోనీ ఇవ్వలేదు. నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడే తప్ప క్రికెటర్‌గా ఇంకా కొనసాగుతున్నాడు కాబట్టి, అతనికి అభినంద సభ ఏ విధంగా నిర్వహించాలో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ధోనీ ఇంగ్లాండ్‌లో చాంపియన్స్ ట్రోఫీతోనే కెరీర్‌ను ముగిస్తే, వీడ్కోలు మ్యాచ్‌కి, సత్కారానికి అవకాశం లేనట్టే. ఏది ఏమైనా స్వదేశంలో, పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లో ధోనీ చివరి మ్యాచ్ ఆడేశాడనే అనుకోవాల్సి ఉంటుంది.