ఆటాపోటీ

నిబంధనలకు తూట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయనవారిని ఒక రకంగా, కాని వారిని మరో రకంగా చూడడం క్రికెట్ పెద్దలకు అలవాటుగా మారింది. సాధారణ ఆటగాళ్లకు వర్తించే నిబంధనలేవీ స్టార్ క్రికెటర్లకు పట్టవు. క్రమశిక్షణకు కట్టుబడి లేకపోయనా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా వారిని నియంత్రీకరించే పనికి అధికారులు పూనుకోవడం లేదు. ఇంగ్లాండ్‌తో జరిగిన వనే్డ సిరీస్‌లోనేకాదు.. ఇప్పుడు జరుగుతున్న ఐపిఎల్ టి-20 క్రికెట్ టోర్నీలోనూ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిబంధనలను అతిక్రమించినప్పటికీ, అతనిని హెచ్చరికతో విడిచిపెట్టడం వివాదం రేపుతున్నది.
*
అతి చేష్టలు, ఏకపక్ష విధానాలను నివారించడానికి నిబంధనలు ఉంటాయి. అన్ని రంగాలతోపాటు క్రీడారంగంలోనూ కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి. ఆటగాళ్లను కట్టడి చేయడానికి, వారి వల్ల క్రీడాస్ఫూర్తి దెబ్బతినకుండా చూడడానికి ప్రతి క్రీడా సమాఖ్య లేదా సంఘం నిబంధనావళిని ఆమోదించి, అమలు చేస్తుంది. కానీ, క్రీడాస్ఫూర్తిని కాపాడేందుకు రూపొందించిన నిబంధనలకు కొంత మంది క్రీడాకారులు, అధికారులు తూ ట్లు పొడుస్తున్నారు. క్రికెట్‌లో ఈ ధోరణి వెర్రితలలు వేస్తున్నది. ఆటగాళ్ల స్థాయిని, అంతర్జాతీయంగా వారికి ఉన్న పేరుప్రఖ్యాతులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం క్రికెట్ అధికారులకు ఆనవాయితీగా మారింది. వివిధ దేశాల క్రికెట్ బోర్డులే కాదు.. చివరికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) కూడా ఇదే సూత్రాన్ని అనుసరించడం దురదృష్టకరం. ఇటీవల భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో ఇరు జట్ల కెప్టెన్లు విరాట్ కోహ్లీ, స్టీవెన్ స్మిత్ వివాదం వాస్తవానికి తీవ్రమైనదే. ఐసిసి కఠినంగా వ్యవహరించి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన సంఘటనే. కానీ, ఇది క్రికెట్ ప్రపంచంలో రెండు మేటి జట్లు, భారత్, ఆస్ట్రేలియా మధ్య చోటు చేసుకున్నది కావడంతో ఒకరి పక్షాన నిలిస్తే మరొకరి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందన్న భయం ఐసిసిని వెంటాడిందో ఏమోగానీ, ఎలాంటి చర్యలు తీసుకోకుండానే ఇద్దరినీ విడిచిపెట్టింది. స్మిత్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడని, క్రీడాస్ఫూర్తిని మంటగలిపాడని కోహ్లీ ఆరోపించిన విషయం తెలిసిందే. బిసిసిఐ కూడా కోహ్లీకి మద్దతుగా నిలిచి, మ్యాచ్ రిఫరీకి లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) సైతం ఏమాత్రం వెనుకడుగు వేయకుండా, ప్రతిదాడులకు దిగింది. రెండు దేశాల క్రికెట్ అధికారులు, ఆటగాళ్ల మధ్య మాటల తూటాలు పేలాయి. ఐసిసి స్పందన తీవ్రంగా ఉంటుందని, దోషులపై తీసుకోబోయే చర్యలు భవిష్యత్తులో ఒక స్పష్టమైన మార్గాన్ని నిర్దేశించేవిగా ఉంటాయని అంతా ఊహించారు. కానీ, ఇరు దేశాల క్రికెట్ బోర్డుల అధికారులు సమావేశమై చర్చించడంతో సమస్యకు తెరపడింది. కోహ్లీ, స్మిత్ మాత్రమేగాక ఈ వివాదంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జోక్యం ఉన్న వారిని కూడా ఐసిసి విడిచిపెట్టింది. ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదని ఐసిసి ప్రకటించింది. మొత్తం మీద ఈ వివాదానికి తెరపడిందన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు ఇటు బిసిసిఐ, అటు సిఎ విపరీతంగా కష్టపడ్డాయి. ఐసిసి కూడా తనవంతు సాయం చేసింది. కానీ, బెంగళూరు టెస్టులో చోటు చేసుకున్న ‘డిఆర్‌ఎస్’ సంఘటనపై అంతర్జాతీయ స్థాయిలో వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. స్మిత్ మెదడు మొద్దుబారుతున్నదని, అందుకే, నిబంధనలకు విరుద్ధంగా అతను డిఆర్‌ఎస్ అప్పీల్స్ సమయంలో సపోర్టింగ్ స్ట్ఫా సూచనల కోసం డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూశాడని, ఇది నిబంధనలకు విరుద్ధమని కోహ్లీ విమర్శించడంతో వివాదం మొదలైంది. అయితే, ఆ సమయంలో తనకు ఏమీ తోచలేదని, డిఆర్‌ఎస్ అప్పీల్ చేయకుండా మైదానంలో నిలబడడం ద్వారా తాను తప్పు చేశానని స్మిత్ వ్యాఖ్యానించాడు. అతను చేసిన ప్రకటనతో దీనికి ‘బుద్ధిక్షయం’ వివాదమన్న పేరు ఖాయమైంది. బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఉమేష్ యాదవ్ వేసిన బంతి స్మిత్ ప్యాడ్స్‌కు తగిలింది. వెంటనే బౌలర్ ఎల్‌బి అప్పీల్ చేయగా, అంపైర్ సానుకూలంగా స్పందించాడు. కానీ, ఈ అంపైర్ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత కూడా స్మిత్ పిచ్‌ను విడిచిపెట్టలేదు. మెల్లిగా నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌కు వెళ్లి, అక్కడ ఉన్న పీటర్ హ్యాండ్స్‌కోమ్‌తో మాట్లాడాడు. అదే సమయంలో సపోర్టింగ్ స్ట్ఫా సూచనలను తీసుకునే ఉద్దేశంతో డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూశాడు. అయితే, అక్కడి నుంచి సూచనలేవీ రాకపోవడంతో, డిఆర్‌ఎస్ అప్పీల్ ఆలోచనను మానుకొని పెవిలియన్‌కు వెశ్లాడు. ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోహ్లీ ఆర్‌ఎస్‌ను డ్రెస్సింగ్ రూమ్‌కు చేర్చాడంటూ స్మిత్‌పై మండిపడ్డాడు. మైదానంలో ఉన్న ఆటగాళ్లు ఎవరైనా సలహాలు లేదా సూచనల కోసం డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూడకూడదన్న నిబంధన ఉందని కోహ్లీ గుర్తుచేశాడు. డిఆర్‌ఎస్ అప్పీల్‌కు వెళ్లబోయే ముందు ఈ నిబంధనను ఖచ్చితంగా పాటించాలని అన్నాడు. కానీ ఆ విషయానే్న పట్టించుకోని స్మిత్ క్రీడాస్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించాడనీ, కాబట్టి అతనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశాడు. బిసిసిఐ కూడా కోహ్లీ డిమాండ్‌కు మద్దతునిచ్చి, ఐసిసికి స్మిత్‌పై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఆతర్వాత ఏం జరిగిందో ఏమోగానీ, హఠాత్తుగా ఇరు దేశాల క్రికెట్ బోర్డులు రాజీకొచ్చాయి. ఈ సంఘటనకు ఇంతటితో తెరపడిందని, ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదనీ ఐసిసి ప్రకటించింది. దేశాలు, ఆటగాళ్ల స్థాయి, హోదాలను బట్టి నిబంధనలు మారిపోతున్నాయని ఐసిసి మరోసారి రుజువు చేసింది.
ఐపిఎల్‌లోనూ అదే తంతు!
ఇప్పుడు జరుగుతున్న పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లోనూ ఇదే తంతు కొనసాగుతున్నది. ఆటగాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ వికెట్‌కీపర్, భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ డిఆర్‌ఎస్‌కు అప్పీల్ చేయడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. నిజానికి డిఆర్‌ఎస్ అప్పీల్ చేసే అధికారం క్రీజ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌కు లేదా ఫీల్డింగ్ సైడ్ కెప్టెన్‌కు ఉంటుంది. పుణే జట్టుకు నిరుడు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ, ఇంతకు ముందు ఇంగ్లాండ్‌తో వనే్డ మ్యాచ్‌లో మాదిరిగానే ధోనీ మరోసారి తనను తాను కెప్టెన్‌గా ఊహించేసుకున్నాడు. డిఆర్‌ఎస్ అప్పీల్ చేసి, నిబంధనలను తుంగలో తొక్కాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వనే్డలోనూ ధోనీ తాను కెప్టెన్‌ను కాననే విషయాన్ని మరచిపోయ డిఆర్‌ఎస్ అప్పీల్ చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ నుంచి ధోనీ వైదొలగ్గా, టెస్టులతోపాటు వనే్డ, టి-20ల్లోనూ భారత్ జట్టుకు నాయకత్వం వహించే బాధ్యతను కోహ్లీ స్వీకరించాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. పూర్తి స్థాయి కెప్టెన్‌గా కోహ్లీ తొలి వనే్డను ఇంగ్లాండ్‌తో ఆడగా, చాలాకాలం తర్వాత ధోనీ టీమిండియాలో ఒక ఆటగాడిగా మైదానంలో కనిపించాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు హార్దిక్ పాండ్య వేసిన బంతికి ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫ్లంబయ్యాడు. దానిని కాట్ బిహైండ్‌గా పాండ్యతోపాటు ఇతర ఫీల్డర్లు కూడా అప్పీల్ చేశారు. ధోనీ కూడా అప్పీల్ చేసినప్పటికీ, అంపైర్ పట్టించుకోలేదు. దీనితో, తాను జట్టులో సాధారణ సభ్యుడినేనన్న విషయాన్ని మరచిపోయన ధోనీ క్షణాల్లోనే డిఆర్‌ఎస్ అప్పీల్ చేశాడు. ఒక జట్టు కెప్టెన్‌కు మాత్రమే డిఆర్‌ఎస్ అప్పీల్ హక్కు ఉంటుందన్న ప్రాథమిక నిబంధనను అతను మరచిపోయాడు. రెగ్యులర్ కెప్టెన్‌గా ఉన్న కోహీని సంప్రదించకుండా, కనీసం అతని అనుమతిని తీసుకోకుండా ధోనీ నేరుగా డిఆర్‌ఎస్ అప్పీల్ చేయడం విచిత్రం. ఆ వెంటనే, పరిస్థితి గమనించిన కోహ్లీ వెంటనే డిఆర్‌ఎస్ అప్పీల్ చేయడం ద్వారా గందరగోళానికి, వివాదానికి తెరదించే ప్రయత్నం చేశాడు. దాదాపు అలాంటి పొరపాటే ఐపిఎల్‌లోనూ పునరావృతమైంది. పుణే జట్టుకు కెప్టెన్ కాకపోయనప్పటికీ, అతను డిఆర్‌ఎస్ అప్పీల్ చేసి, మరోసారి నిబంధనలను అతిక్రమించాడు. కానీ, ధోనీపై బిసిసిఐగానీ, ఐసిసిగానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిబంధనలకు పేరొందిన స్టార్లకు వర్తించవని రుజువైంది. ధోనీని కూడా అధికారులు శిక్షించకుండా, ఒక హెచ్చరించి విడిచిపెట్టారు.
ముంబయి ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఐపిఎల్‌లో అంపైర్ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. వాంఖడే స్టేడియంలో ఈనెల 9న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద ఆడుతున్నప్పుడు సునీల్ నారైన్ వేసిన బంతికి రోహిత్ వికెట్లకు అడ్డంగా దొరికిపోయాడు. బౌలర్ అప్పీల్‌ను సమర్థించిన అంపైర్ అతనిని అవుటైనట్టు ప్రకటించాడు. కానీ, ఈ నిర్ణయంతో ఏకీభవించని రోహిత్ క్రీజ్‌లోనే నిలబడిపోయాడు. ఆతర్వాత అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఏ స్థాయి పోటీల్లోనైనా, అంపైర్ నిర్ణయాన్ని అమలు చేయకపోవడం లేదా అంపైర్‌తో ఘర్షణ పడడం తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. కానీ, అధికారులకు ఇది కఠినంగా వ్యవహరించాల్సిన స్థాయి నేరంగా కనిపించలేదు. ఒక చిన్నపాటి హెచ్చరికతో వివాదానికి శుభంకార్డు వేశారు. నింబధనలు సామాన్యులకేగానీ సెలబ్రిటీలకు వర్తించవన్న సత్యాన్ని ప్రజలందరికీ తెలిసేలా చేశారు. ఆటగాళ్లపై, జట్లపై, చివరికి క్రికెట్ అధికారులపైనా కామెంటేటర్లు ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తున్నా ఎవరికీ వినిపించడం లేదు. కామెంటేటర్‌గా మారిన మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అనుచిత వ్యాఖ్యలు, వాటిపై వెస్టిండీస్ ఆటగాడు కీలన్ పొలార్డ్ ఘాటైన సమాధానాలు క్రికెట్ ప్రపంచంలో సరికొత్త వివాదానికి కారణమైనా, బిసిసిఐ లేదా ఐసిసి అధికారుల్లో మాత్రం చలనం కనిపించడంలేదు. భారత క్రికెటర్లను ఉద్దేశించి ఒక చిన్నమాట అన్నందుకే ప్రముఖ ప్రజెంటర్ హర్ష భోగ్లేను శాశ్శతంగా క్రికెట్ సంబంధిత కార్యక్రమాలకు దూరం చేసిన బిసిసిఐకి సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలు వినిపించలేదా? పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే, క్రికెట్ మైదానాల్లోనేకాదు.. కామెంటరీ బాక్సుల్లో, డ్రెస్సింగ్ రూముల్లోనూ యుద్ధాలు జరుగుతాయి. అధికారులు స్పందించకపోతే, నిబంధనలు కాగితాలకే పరిమితమై, వివాదాలు క్రీడల్లో భాగమైపోతాయి. ధోనీ లేదా మంజ్రేకర్.. కీరన్ పొ లార్డ్ లేదా గౌతం గంభీర్.. ఎవరు పొరపాటు చేసినా, క్రమ శిక్ష ణను ఉల్లంఘించినా, ఒకే రకమైన చర్యలు తీసుకోవడానికి క్రికె ట్ అధికారులు సాహించకపోతే, క్రికెట్‌పై అభిమానులకు నమ్మ కం సడలిపోయే ప్రమాదం ఉంది.

చిత్రం..అంపైర్‌తో ధోనీ వాగ్వాదం

- శ్రీహరి