ఆటాపోటీ

టాప్ స్కోరర్ గేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ టాప్ స్కోరర్ వెస్టిండీస్ హీరో క్రిస్ గేల్. మొత్తం 17 మ్యాచ్‌లు ఆడిన అతను 17 ఇన్నింగ్స్‌లో 791 పరుగులు చేశాడు. శ్రీలంక మాజీ ఆటగాడు మహేల జయవర్ధనే 18 ఇన్నింగ్స్‌లో 742, అతని సహచరుడు కుమార సంగక్కర 21 ఇన్నింగ్స్‌లో 683 పరుగులతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత ఆటగాళ్లలో సౌరవ్ గంగూలీ (11 ఇన్నింగ్స్‌ల 666 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (15 ఇన్నింగ్స్‌లో 627 పరుగులు) వరుసగా నాలుగు, ఆరు స్థానాలను ఆక్రమించి, ‘టాప్-10’ జాబితాలో ఉన్నారు.
ఒక ఇన్నింగ్స్‌లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానాన్ని నాథన్ ఆస్టెల్ (న్యూజిలాండ్), ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే) సంయుక్తంగా పంచుకుంటున్నారు. వీరిద్దరూ చెరి 145 పరుగులు చేశారు. సచిన్ తెండూల్కర్, గ్రేమ్ స్మిత్, సౌరవ్ గంగూలీ తలా 131 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, షేన్ వాట్సన్ 136 పరుగులతో మూడో స్థానాన్ని సంపాదించాడు.

- సత్య