ఆటాపోటీ

టాప్ ‘ప్లేయర్స్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ సిరీస్ లేదా టోర్నీల్లోనైనా ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లేదా టోర్నమెంట్ అవార్డులు అత్యంత ప్రధాన్యతను సంతరించుకుంటాయి. 1998లో మొదటిసారి చాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును జాక్వెస్ కాలిస్ దక్కించుకున్నాడు. ఆ టోర్నీలో ఫిలియో వాలెస్ అత్యధికంగా 221 పరుగులు చేయగా, కాలిస్ అందరికంటే ఎక్కువగా 8 వికెట్లు సాధించాడు. 2000 చాంపియన్స్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ క్రిస్ కెయిన్స్‌కు లభించింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ఎవరికీ ప్రకటించలేదు. సౌరవ్ గంగూలీ 348 పరుగులతో టాప్ స్కోరర్‌గా, వెంటేశ్ ప్రసాద్ 8 వికెట్లతో ఉత్తమ బౌలర్‌గా నిలిచారు. 2002లో ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును ప్రకటించలేదు. వీరేందర్ సెవాగ్ (271 పరుగులు) ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా, ముత్తయ్య మురళీధరన్ (10 వికెట్లు) ఉత్తమ బౌలర్‌గా అవార్డులు స్వీకరించారు. 2004లో ప్లేయర్ ఆఫ్ ఫైనల్ అవార్డు ఇయాన్ బ్రాండ్‌షాకు లభించగా, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును రాంనరేష్ శర్వాణ్ దక్కించుకున్నాడు. మార్కస్ ట్రెస్క్థోక్ 51 పరుగులతో టాప్ స్కోరర్‌గా, ఆండ్రూ ఫ్లింటాఫ్ 9 వికెట్లతో ఉత్తమ బౌలర్‌గా నిలిచారు. 2006లో ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్‌గా షేన్ వాట్సన్ అవార్డు స్వీకరించగా, క్రిస్ గేల్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది. గేల్ 474 పరుగులు సాధించి, ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిస్తే, జరోమ్ టేలర్ 13 వికెట్లు పడగొట్టి, ఉత్తమ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. 2009లోనూ ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ అవార్డు షేన్ వాట్సన్‌కు లభించింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా రికీ పాంటింగ్ ఎంపికయ్యాడు. అతను 288 పరుగులతో టాప్ స్కోరర్‌గానూ నిలిచాడు. వేన్ పార్నెల్ 11 వికెట్లు సాధించాడు. 2013లో ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్‌గా రవీంద్ర జడేజా, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా శిఖర్ ధావన్ అవార్డును తీసుకున్నారు. ధావన్ 363 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా, ఉత్తమ బౌలర్‌గా రవీంద్ర జడేజా (12 వికెట్లు) అవార్డు పొందాడు.

చిత్రం..జాక్వెస్ కాలిస్