ఆటాపోటీ

సోచి వింటర్ ఒలింపిక్స్ విజేతల్లో నలుగురు డోప్ దోషులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిల్స్, మే 9: వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడిందన్న విమర్శలు ఎదుర్కొంటూ అంతర్జాతీయ క్రీడా రంగంలో ఇప్పటికే ప్రతిష్ట కోల్పోయిన రష్యా మరోసారి వివాదంలో చిక్కుకుంది. రష్యా డోపింగ్ నిరోధక విభాగం (రసడా) మాజీ అధికారి విటాలీ స్టెపనోవ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సోచీ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించిన వారిలో నలుగురు డోపింగ్ దోషులేనంటూ సంచలన ప్రకటన చేశాడు. అతని భార్య యూలియా స్టెపనొవా పేరుప్రఖ్యాతులు ఆర్జించిన అథ్లెట్. అయితే, ఆమె డోపింగ్‌కు పాల్పడిందని రుజువుకావడంతో అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. కాగా, భార్యతో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చిన విటాలీ మాట్లాడుతూ 2014 సోచీ వింటర్ ఒలింపిక్స్‌లో చాలా మంది నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించారని ఆరోపించాడు. ఆ పోటీల్లో రష్యా 13 స్వర్ణ పతకాలను కైవసం చేసుకోగా, విజేతల్లో నలుగురు డోపింగ్ దోషులేనని అన్నాడు. రియో ఒలింపిక్స్‌కు రష్యా అథ్లెట్లను అనుమతిస్తారా లేదా అన్న ప్రశ్న ఒకవైపు వేధిస్తుండగా, మరోవైపు రష్యా మాజీ అధికారే డోపింగ్ ఆరోపణలు చేయడం గమనార్హం. అంతర్జాతీయ క్రీడా సంఘాలు, సమాఖ్యలతోపాటు, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) కూడా రష్యా అనుసరించిన వ్యూహాత్మక డోపింగ్‌పై దృష్టి పెట్టాలని అతను సూచించాడు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అథ్లెట్లకు రష్యా ప్రభుత్వమే మాదక ద్రవ్యాల వినియోగాన్ని అలవాటు చేసిందని ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ఆధ్వర్యంలోని కమిటీ ఇది వరకే స్పష్టం చేసింది. ఈ ప్రకంపనలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. ఈలోగా విటాలీ ఆరోపణలు రష్యాను కుదిపేస్తున్నాయి.