ఆటాపోటీ

సమస్యల ఊబిలో ఠాకూర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోనే అత్యధిక ఆదాయ వనరులున్న సంస్థగా ఎదిగి, ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో 41 ఏళ్ల అనురాగ్ ఠాకూర్ సంబరపడుతుండవచ్చు. కానీ, అతను సమస్య ఊబిలో కాలుమోపాడు. దాని నుంచి బయటపడతాడా లేక అందులో కూరుకుపోయి, ఏమీ చేయలేని స్థితిలో చిక్కుకుంటాడా అన్నది ఆసక్తిని రేపుతోంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకూ అతను అధికారంలో ఉంటాడు. లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాల్సిందేనని సుప్రీం కోర్టు ఆదేశిస్తే, అతనికి మూడేళ్ల వరకూ అధ్యక్ష పదవికి పోటీచేసే అవకాశం లభించదు. చాలా తక్కువ కాలంలో ఠాకూర్ ఎంత వరకూ బోర్డుపై తనదైన ముద్ర వేస్తాడన్నది అనుమానంగానే ఉంది. ఇప్పటికే బోర్డు పలు సమస్యలను ఎదుర్కొంటున్నది. కోర్టు కేసులు వెంటాడుతున్నాయి. దీనికి తోడు సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడం బోర్డు అధికారులకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ, సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో లోధా కమిటీ ప్రతిపాదనలకు అనుకూలంగా పలు వ్యాఖ్యలు చేసింది. బిసిసిఐ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశ క్రికెట్‌పై గుత్త్ధాపత్యాన్ని చెలాయించే అధికారం ఎక్కడిదని ప్రశ్నించింది. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి ఎదురయ్యే సమస్యలు ఏమున్నాయని నిలదీసింది. క్రికెట్‌ను చెప్పుచేతల్లో ఉంచుకొని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడింది. బోర్డు రకరకాలుగా ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నదని, ఈ కారణంగానే చాలా మంది యువకులకు సరైన అవకాశాలు దక్కడం లేదని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను గమనిస్తే, బోర్డు గుత్త్ధాపత్యానికి తెరదించే దించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. క్రికెట్‌ను ప్రాణప్రదంగా ఆరాధించే వారి పట్ల సమ న్యాయం పాటించడం లేదని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. ఏకపక్ష నిర్ణయాలకు మారుపేరైన బోర్డు వ్యవహారాన్ని కోర్టు దుయ్యపడుతున్న తరుణంలో, లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయాలా? వద్దా? అన్న ప్రశ్న ఠాకూర్‌ను వేధిస్తున్నది. ఒకవేళ లోధా కమిటీ సిఫార్సులను అమలు చేస్తే బోర్డు ఇన్నాళ్లూ చెలాయించిన ఆధిపత్యానికి కళ్లెం పడుతుంది. గుత్త్ధాపత్యాన్ని కొనసాగించే అవకాశం ఉండదు. భారత క్రికెట్ రంగాన్ని ఇతరులతో కలిసి పంచుకోవాల్సిన పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంది. కాదని వ్యతిరేకిస్తే, సుప్రీం కోర్టు ఏ విధంగా స్పందిస్తోందన్న భయం బోర్డును వెంటాడుతున్నది. లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడంలో బిసిసిఐ లేదా దాని అనుబంధ సంఘాల అభ్యంతరాలను ఇప్పటికే పరిశీలనకు స్వీకరించిన కోర్టుకు ఈ విషయంలో సలహాలు, సూచనలు ఇచ్చే బాధ్యతను సీనియర్ అడ్వొకేట్ గోపాల్ సుబ్రమణ్యానికి అప్పగించింది. బోర్డు అధికారులను కోర్టు పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై ముకుల్ ముద్గల్ కమిటీ రెండు దశల్లో ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం, దోషులకు శిక్షలను ఖరారు చేసేందుకు విశ్రాంత న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా అధ్యక్షతన ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీకి సుప్రీం కోర్టు అప్పచెప్పిన విషయం తెలిసిందే. బిసిసిఐ ప్రక్షాళనకు అవసరమైన ప్రతిపాదనలను ఇచ్చే బాధ్యతను కూడా ఈ కమిటీకే అప్పచెప్పింది. కాగా, సుప్రీం సూచనల ప్రకారం దోషులపై లోధా కమిటీ చర్యలు తీసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లను రెండేళ్లపాటు నిషేధించింది. రాజస్తాన్ సహ భాగస్వామి రాజ్ కుంద్రా, చెన్నై మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గురునాథ్ మెయప్పన్‌పై జీవితకాల సస్పెన్షన్‌ను విధించింది. ఈ చర్యలు భారత క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టించాయి. కాగా, దేశంలో క్రికెట్ వ్యవహారాలు పారదర్శకంగా నడిచేందుకు వీలుగా కమిటీ పలు సూచనలు కూడా చేసింది. ఒక రాష్ట్రానికి ఒకటికి మించిన క్రికెట్ సంఘాలు ఉండరాదని, ఒక సంఘానికి ఒకే ఓటు ఉండాలి అన్న అంశాలు కూడా లోధా కమిటీ సిఫార్సుల్లో ఉన్నాయి. కాగా, కమిటీ సిఫార్సులను అమలు చేయడం కష్టమని బిసిసిఐ వాదిస్తున్నది. కానీ, కోర్టు మాత్రం లోధా ప్రతిపాదనల పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలన్న ప్రశ్నకు ఠాకూర్ వద్ద బహుశా సమాధానం లేకపోవచ్చు.
లోధా కమిటీ సిఫార్సుల అమలులో ఎదురయ్యే సమస్యలపై బిసిసిఐ ఇచ్చిన వివరణలను, వ్యక్తం చేస్తున్న అభ్యరంతరాలను ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్, న్యాయమూర్తి ఎఫ్‌ఎంఐ కలీఫుల్లాతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారిస్తున్నది. ఈ సందర్భంగానే, పలు దశల్లో బిసిసిఐపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. క్రికెట్‌కు ఉన్న ఆదరణను, దేశమంతటా ఉన్న మోజును చూసి ఎంతో మంది యువకులు ఈ క్రీడవైపు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. తాము కూడా కోహ్లీలుగానో, ధోనీలుగానో ఎదగాలని కోరుకుంటున్నారని పేర్కొంది. కానీ బిసిసిఐ అమలు చేస్తున్న విధానాల వల్ల వారిలో చాలా మందికి అవకాశాలు కల్పించడం లేదని విమర్శించింది. బోర్డు తీరుపై దేశ వ్యాప్తంగా లక్షలాది మందిలో గూడుకట్టుకొని ఉన్న అసహనాన్ని, ఆగ్రహాన్ని సుప్రీం కోర్టు వ్యాఖ్యలు తెరపైన ఆవిష్కరించాయి. ఈ విషయంలో ఠాకూర్ ఎలాంటి ప్రక్షాళన చర్యలు చేపడతాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతను స్వయానా క్రికెటర్. పైగా, 25 ఏళ్ల వయసులోనే హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం (హెచ్‌పిసిఎ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. బిసిసిఐలోనూ కీలక భూమిక పోషించాడు. జగ్మోహన్ దాల్మియా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన అనారోగ్యంతో బాధపడుతుంటే, పరోక్షంగా ఠాకూర్ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పుడు తానే అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో అతను తీసుకోబోయే చర్యలు ఏ విధంగా ఉండబోతాయన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తున్నది.
బోర్డును నిషిద్ధ ప్రాంతంగా మార్చేశారని, ఎవరినీ రానీయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బోర్డుపై సుప్రీం కోర్టు విచారణ సమయంలో మండిపడింది. భారత క్రికెట్‌ను చెప్పుచేతల్లో ఉంచుకొని నడిపిస్తున్నారని, అనుకూల వర్గాలకే క్రికెట్ ఆడే అవకాశం ఉంటుందని, లేనివారు అసలు క్రికెట్ జోలికే వెళ్లకూడదన్న వైఖరి ప్రతి అంశంలోనూ కనిపిస్తున్నదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాస్వామిక విధానం బోర్డుల అమలుకావడం లేదని చాలాకాలంగా వినిపిస్తున్న విమర్శలను ధర్మాసనం కూడా ప్రస్తావించడం రాబోయే రోజుల్లో చోటు చేసుకోబోయే పలు కీలక పరిణామాలను సూచిస్తున్నది. ఇవి కేవలం అనుమానాలేనని, బోర్డు ప్రజాస్వామిక విధానంలోనే నడుస్తున్నదని నిరూపించడానికి ఠాకూర్ ఏ విధంగా ప్రయత్నిస్తాడో చూడాలి. సమ న్యాయం అతని హయాంలో ఉంటుందా లేక గతంలో మాదిరిగానే బోర్డు తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందా అన్నది కూడా ఆసక్తి కరంగా మారింది. అందరికీ సమానావకాశాలు కల్పించే దిశగా తీసుకోబోయే చర్యలపై ఎవరి వాదన వారు చేస్తున్నారు. భారత క్రికెట్‌పై గుత్త్ధాపత్యాన్ని కొనసాగిస్తున్నారంటూ సుప్రీం కోర్టు బెంచ్ చేసిన వ్యాఖ్యలకు ఠాకూర్ ఏ విధంగా సమాధానం చెప్తాడన్నది కీలక ప్రశ్న. ఆధిపత్యానికి గండిపతుందన్న భయంతోనే బోర్డు ఏకపక్ష నిర్ణయాలను అమలు చేస్తున్నదన్న విమర్శలను కూడా ఠాకూర్ తప్పికొట్టాలి. భారత క్రికెట్ జట్టును బోర్డు ఎంపిక చేస్తుంది. అందుకే జట్టుపై పూర్తిగా బోర్డు పెత్తనమే కొనసాగుతున్నది. జట్టు ఎంపిక నుంచి ప్రతి అంశాన్ని తన చేతుల్లోనే ఉంచుకొని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నది. జట్టు ఎంపిక, కాంట్రాక్టులు వంటి బాధ్యతలను ఎవరితోనూ పంచుకోవడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే, భారత క్రికెట్‌పై గుత్త్ధాపత్యాన్ని కొనసాగిస్తున్నది. ఇది సరైన విధానం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేస్తున్నది. దీనిపై ఠాకూర్ ప్రతిస్పందన ఏమిటో ఇంకా తెలియడం లేదు. లోథా కమిటీ సిఫార్సుల అమలుపై అంశాల వారీగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని అతను ఇప్పటికే ప్రకటించాడు. అంటే, బోర్డు గతంలో చేసిన వాదనకే అతను కట్టుబడి ఉంటాడన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే, లోధా కమిటీ సిఫార్సు చేసినట్టు ఒక రాష్ట్రానికి ఒకే ఓటు విధానాన్ని అమలు చేయడం కష్టమని బిసిసిఐ లేవనెత్తిన అభ్యంతరాలపై ధర్మాసనం ఇది వరకే తీవ్రంగా స్పందించింది. దేశంలోని అన్ని ప్రాంతాలకూ బిసిసిఐలో స్థానం లభించాలని, ఒక రాష్ట్రానికి ఒకే ఓటు ఉండాలని లోధా కమిటీ ప్రతిపాదించిన విషయాన్ని ప్రస్తావించింది. బోర్డులో సంస్కరణలు అత్యవసరమని తేల్చిచెప్పింది. సంస్కరణలను వ్యతిరేకిస్తూ, ఆ విధానాలను అమలు పరచడం కుదరదని ఎవరైనా అనుకుంటే, వారికి భారత క్రికెట్‌లో స్థానం ఉండదని వ్యాఖ్యానించింది. మొత్తం మీద బోర్డు అనుసరిస్తున్న విధానాలను, వ్యవహార శైలిని సుప్రీం కోర్టు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఇప్పటికే చేసిన పలు వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బోర్డు అధ్యక్షుడిగా ఠాకూర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడన్నది వేచిచూడాలి. అతనికి బిసిసిఐ అధ్యక్ష పదవి అనుకున్నంత ఆనందాన్ని ఇవ్వలేదని, సమస్యలతో కుస్తీ పట్టక తప్పని పరిస్థితిని కల్పిస్తుందని వినిపిస్తున్న వాదనలో సత్యం ఉంది. అందుకే, ఠాకూర్ తీసుకోబోయే నిర్ణయాల గురించి అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.