ఆటాపోటీ

నేరం రుజువైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగేళ్ల క్రితం జరిగిన లండన్ ఒలింపిక్స్‌కు, ఈసారి ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌కు మధ్య కాలంలో ‘బ్లేడ్ రన్నర్’ ఆస్కార్ పిస్టోరియస్ జీవితంలో ఎవరూ ఊహించని మార్పులు జరిగాయ. దివ్యాంగులకు మాత్రమే పరిమితమైన పారాలింపిక్స్‌లో ప్రతిభ చాటుకొని, 2012 సమ్మర్ ఒలింపిక్స్‌లో పోటీపడి అందరి దృష్టిని ఆకర్షించాడు. 400 మీటర్ల పరుగులో సెమీ ఫైనల్ వరకూ చేరాడు. రెండు కాళ్లూ లేకుండా, కృత్రిమ కాళ్లతో పరుగులు తీసే ఒక అథ్లెట్ సమ్మర్ ఒలింపిక్స్‌లో పాల్గొనడం, సెమీస్ చేరడం అదే మొదటిసారి. ఫైనల్ చేరలేకపోయనప్పటికీ అతను తన ఉనికిని చాటుకున్నాడు. 400 మీటర్ల రిలేలోనూ అతను పరిగెత్తాల్సి ఉండింది. అయతే, తన కంటే ముందు పరిగెత్తిన ఆఫెంటిస్ మోగావనే పిస్టోరియస్‌కు బాటన్‌ను అందించడానికి ముందే కింద పడ్డాడు. ఫలితంగా బాటన్ చేతికి రాకపోవడంతో పిస్టోరిస్‌కు రిలేలో పోటీపడే అవకాశం దక్కలేదు. మొత్తం మీద నాలుగేళ్ల క్రితం అందరి చేత ఔరా అనిపించుకున్న పిస్టోరియస్ ఈసారి ఒలింపిక్స్ ఆరంభానికి ముందే గర్ల్‌ఫ్రెండ్ రీవా స్టీన్‌క్యాంప్‌ను హత్య చేసిన కేసులో దోషిగా తేలడంతో ప్రతిష్ఠ పోగొట్టుకున్నాడు. ఆరేళ్ల జైలు శిక్ష పడడంతో అతని కెరీర్‌కు తెరపడినట్టే.
**
గర్ల్‌ఫ్రెండ్ రీవా స్టీన్‌క్యాంప్‌ను హత్య చేసిన కేసు జరుగుతున్న సమయంలో ‘బ్లేడ్ రన్నర్’ ఆస్కార్ పిస్టోరియస్ కోర్టులో అద్భుతంగా నటించాడు. చాలాసార్లు కన్నీళ్లు పెట్టుకున్నాడు. దుఃఖంతో గొంతు పూడుకుపోయినట్టు చాలా తక్కువ నెమ్మదిగా మాట్లాడాడు. కొన్ని సందర్భాల్లో బిగ్గరగా ఏడ్చేశాడు. మొత్తం మీద తాను చాలా అమాయకుడినని, తనకు ఏ పాపం తెలియదని కోర్టును నమ్మించే ప్రయత్నం చేశాడు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారన్న అనుమానంతో కాల్పులు జరిపానని, రీవాను హత్య చేయాల్న ఆలోచనగానీ, అలాంటి అవసరంగానీ తనకు లేవని చాలా గొప్పగా వాదించాడు. కానీ, అతను చేసిన నేరం రుజువైంది. సుప్రీం కోర్టు వరకూ వెళ్లిన ఈ కేసులో అతనికి ఆరు సంవత్సరాల జైలు శిక్ష పడింది.
పిస్టోరియస్‌ను ఆషామాషీ అథ్లెట్‌గా అనుకోవడానికి వీల్లేదు. రెండు కాళ్లూ లేకపోయినా, కృత్రిమ కాళ్లతోనే పరుగులు తీశాడు. నిరంతరం శ్రమించి ప్రపంచ మేటి అథ్లెట్‌గా ఎదిగాడు. ‘బ్లేడ్ రన్నర్’ అన్న పేరు సంపాదించుకున్న అతను మొదట పారాలింపిక్స్‌లో పతకాలు సాధించాడు. అక్కడితో అతని లక్ష్యం నెరవేరలేదు. సమ్మర్ ఒలింపిక్స్‌లో సాధారణ అథ్లెట్స్‌తో పోటీపడిన మొట్టమొదటి దివ్యాంగ అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అతనిని చాలా మంది రోల్ మోడల్‌గా ఎంచుకున్నారు. ఎంతో మందికి అతను ఆరాధ్య దైవమయ్యాడు. కానీ, గర్ల్ ఫ్రెండ్‌ను హత్య చేసిన తర్వాత ఒక్కసారిగా ప్రతిష్ట కోల్పోయాడు. 2013లో ‘ప్రేమికుల రోజు’నే తన ప్రేయసి రీవాను హత్య చేసి, పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో తన గదిలోకి చొరబడ్డారన్న అనుమానంతో కాల్పులు జరిపానని, రీవా హత్య ఉద్దేశపూర్వకంగా జరగలేదని పిస్టోరియస్ చేసిన వాదనను ప్రాసిక్యూషన్ ఖండించింది. రీవాను అతను కావాలనే హత్య చేశాడని నిరూపించేందుకు సాక్ష్యాలను సేకరించి కోర్టుకు సమర్పించింది. మొత్తం మీద ఈ కేసులో ప్రాసిక్యూషన్ ఆరోపణలు, డిఫెన్స్ వివరణలతో కేసు చిట్టా పెరిగిపోయింది. సుమారు 2,000 పేజీల వివరాలను న్యాయస్థానం అధ్యయనం చేసింది. అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకొని అతనికి ఆరేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ వాదన ఎంత బలంగా ఉందో, ప్రతివాదులు కూడా అదే స్థాయిలో ఆరోపణలను తిప్పికొట్టారు. ఎవరికి వారు తమ వాదనలను నిరూపించుకునేందుకు భారీగానే సాక్ష్యాధారాలను సమర్పించారు. వాష్ రూమ్‌లో ఉన్న రీవాను పిస్టోరియస్ తుపాకీతో కాల్చి హత్య చేసినట్టు ప్రాసిక్యూషన్ వాదన. సంఘటన స్థలంలో లభించిన సాక్షాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. బాత్‌రూమ్ తలుపుల నుంచి బులెట్లు దూసుకెళ్లిన ఆనవాళ్లున్నాయి. అంతేకాదు.. పిస్టోరియస్ వద్ద ఉన్న ఒక క్రికెట్ బ్యాట్‌పైనా రక్తం మరకలున్నాయి. దక్షిణాఫ్రికా మాజీ స్టార్ బ్యాట్స్‌మన్ హెర్చెల్ గిబ్స్ సంతకం చేసి తనకు బహూకరించిన బ్యాట్‌తోనే పిస్టోరియస్ రీవాను బలంగా కొట్టాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. హత్య జరిగిన రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత పిస్టోరియస్, రీవా పెద్దగా వాదించుకోవడం వినిపించిందని చుట్టుపక్కల వాళ్లు చెప్పిన వాంగ్మూలాన్ని కూడా కోర్టుకు సమర్పించింది. అప్పటికే మద్యం సేవించిన పిస్టోరియస్ తన గర్ల్‌ఫ్రెండ్ రీవాతో ఘర్షణ పడ్డాడని, కోపం తట్టుకోలేక ఆమెపై బ్యాట్‌తో దాడి చేసి ఉంటాడని ప్రాసిక్యూషన్ కథనం. ప్రాణభయంతో రీవా బాత్‌రూమ్‌లోకి పరిగెత్తిందని, పిస్టోరియస్ తన బెడ్ పక్కనే ఉన్న తన కృత్రిమ కాళ్లను తగిలించుకొని వెళ్లి, బయటి నుంచి తుపాకీతో కాల్పులు జరిపాడని ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఈ వాదనకు తగిన సాక్ష్యాధారాలను కూడా కోర్టు ముందు ఉంచింది.
రీవాను తాను ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని పిస్టోరియస్ వాదించాడు. అయితే, కాల్పులు జరిపిన తుపాకీకి లైసెన్స్ లేదు. అసలు తన వద్ద తుపాకీ ఉన్నట్టు పిస్టోరియస్ ఎన్నడూ సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వలేదు. అక్రమంగా మారణాయుధాన్ని కలిగి ఉండం దక్షిణాఫ్రికాలో తీవ్రమైన నేరం. ఈ కేసులోనూ అతను దోషిగా తేలాడు. సైసెన్స్ లేని అక్రమ ఆయుధాన్ని ఉపయోగించి హత్య చేయడం తనపై దాఖలైన మరో కేసు. ఇరుగుపొరుగున ఉన్న వారి సాక్ష్యాల నుంచి, హత్య జరిగిన ప్రాంతంలో సేకరించిన వివిధ ఆధారాలతో ప్రాసిక్యూషన్ అధికారులు ఈ కేసును పకడ్బందిగా ఫైల్ చేశారు. చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకొని పిస్టోరియస్ నిర్దోషిగా బయటపడేందుకు వీలులేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. తొలుత కింది కోర్టులో, ఆతర్వాత సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. పిస్టోరియస్‌ను దోషిగా పేర్కొంటూ, మిగతా కేసులను కూడా విచారించి, శిక్షను ఖరారు చేసే బాధ్యతను తిరిగి జొహానె్నస్‌బర్గ్ కోర్టుకు సుప్రీం కోర్టు అప్పచెప్పింది. అన్ని కోర్టుల్లోనూ ప్రాసిక్యూషన్ సంధిస్తున్న ప్రశ్నలకు పిస్టోరియస్ సమాధానాలు చెప్పలేకపోయాడు. పదేపదే బిగ్గరగా ఏడవడం, తాను రీవాను ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని, పొరపాటున జరిపిన కాల్పుల్లో ఆమె మరణించిందని చెప్పడం మినహా అతను కోర్టుకు ఎలాంటి కొత్త సమాచారం ఇవ్వలేదు. దొంగలు లేదా తనను హత్య చేయడానికి ఎవరో దుండగులు ఇంట్లోకి ప్రవేశించారని అతని కథనం. ఆ అలికిడి విని వాష్ రూమ్‌లోకి చొరబడ్డారని భావించి కాల్పులు జరిపానని అతని వాదన. అనంతరం తలుపు తెరిచి చూస్తే రక్తం మడుగుల్లో రీవా కనిపించిందని, ఆమెను గదిలోకి తీసుకొస్తుండగా తన చేతుల్లోనే కన్ను మూసిందని అతను కోర్టుకు చెప్పాడు. కానీ, ప్రాసిక్యూషన్ ఈ వాదనతో ఏకీభవించడం లేదు. ఆగంతకులు చొరబడినట్టు అనుమానం వస్తే, ముందుగా భద్రతా సిబ్బందికి ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించింది. కాల్పులు జరపడానికి ముందు, లేదా ఆ తర్వాతైనా పోలీసులకు తెలపకుండా సమాచారాన్ని ఎందుకు గోప్యంగా ఉంచాల్సి వచ్చిందని నిలదీసింది. రీవా మరణాన్ని ధ్రువీకరించుకున్న తర్వాతే అతను చుట్టుపక్కల వారిని పిలిచాడని, వారి ఫిర్యాదు మేరకే పోలీసులు రంగ ప్రవేశం చేశారని స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ అధికారులు వేసిన ప్రశ్నలతో పిస్టోరియస్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. అర్థరాత్రి రీవాతో ఘర్షణ పడిన తర్వాత ఒక పథకం ప్రకారమే ఆమెను హత్య చేశాడని ప్రాసిక్యూటర్ గెరీ నెల్ పదేపదే చెప్పడంతో, రోదించడం మినహా పిస్టోరియస్ ఏమీ చేయలేకపోయాడు. నిజానికి దక్షిణాఫ్రికా నిబంధనలను అనుసరించి అతనికి పదిహేనేళ్ల శిక్ష పడాలి. కానీ, దీనిని ప్రత్యేక కేసుగా భావించిన కోర్టు అతని జైలు శిక్షను తగ్గించింది. ఈ కేసులో పిస్టోరియస్ పరువు ప్రతిష్ఠలనేకాదు.. కెరీర్‌ను కూడా అంధకారంలోకి నెట్టుకున్నాడు.