ఆటాపోటీ

ఒలింపిక్స్‌కు 61 ఏళ్ల రైడర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా తరఫున 61 ఏళ్ల డ్రెస్సేజ్ రైడర్ మేరీ హన్నా పోటీకి దిగనుంది. ఇప్పటి వరకూ నాలుగు ఒలింపిక్స్‌లో పాల్గొన్న హన్నా రికార్డు స్థాయిలో ఐదో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నది. ఆస్ట్రేలియా తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఎక్కువ వయసుగల క్రీడాకారిణిగా రికార్డు సృష్టించనుంది. అంతేగాక, ఐదు ఒలింపిక్స్‌లో పాల్గొన్న మూడో ఆస్ట్రేలియా మహిళగా కూడా ఆమె పేరు రికార్డు పుస్తకాల్లో చేరుతుంది. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ జియాన్ ఫాంగ్ లే కూడా ఐదోసారి ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నది. ఇప్పటికే రిటైరైన బీచ్ వాలీబాల్ క్రీడాకారిణి నటాలీ కుక్ ఐదు ఒలింపిక్స్‌లో పాల్గొంది. 1996లో మొదటిసారి ఒలింపిక్స్‌కు హాజరైన హన్నా ఆగస్టు 10న పోటీకి దిగుతుంది. అప్పటికి ఆమె వయసు 61 సంవత్సరాల 253 రోజులు. ఇంతకు ముందు, 1976 మాంట్రియల్ ఒలింపిక్స్ ఈక్వెస్ట్రియన్ ఈవెంట్‌లో పాల్గొన్నప్పుడు బిల్ రాయ్‌క్రాఫ్ట్ వయసు 61 సంవత్సరాల 128 రోజులు. ఆస్ట్రేలియా తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఎక్కువ వయసుగల అథ్లెట్‌గా అతని పేరిట ఉన్న రికార్డును హన్నా అధిగమించనుంది.

- సత్య