ఆటాపోటీ

పంచ్‌లు పడలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత బాక్సర్లు ప్రత్యర్థులపై బలమైన పంచ్‌లు విసరడంలో విఫలమయ్యారు. వికాస్ కృషన్, మనోజ్ కుమార్, శివ థాపా తమ స్థాయికి తగిన ప్రదర్శన కూడా ఇవ్వలేక చతికిల పడ్డారు. లండన్ ఒలింపిక్స్‌లో మేరీ కోమ్ కాంస్య పతకాన్ని సాధించగా, ఈసారి మహిళల విభాగంలో ఒక్కరూ కూడా క్వాలిఫై కాలేదు.
బాణాలు తగల్లేదు
ఆర్చర్లు గురితప్పారు. దీపికా కుమారి, బొంబాల్యా దేవి వంటి సీనియర్లు కూడా విఫలం కావడం అందరినీ ఆశ్చర్య పరచింది. లైష్రామ్ మజీ, అతాను దాస్ కూడా ముందంజ వేయలేకపోయారు.
నామమాత్రపు పోటీ
వెయిట్‌లిఫ్టింగ్‌లో సతీష్ శివలింగం, సైఖోమ్ మీరాబాయ్ చాను, టేబుల్ టెన్నిస్‌లో శరత్ కమల్, సౌమ్యజిత్ ఘోష్, వౌమా దాస్, మనికా బత్రా, రోయింగ్‌లో దత్తు బాబన్ బొకానల్, స్విమ్మింగ్‌లో శివానీ కటారియా, సాజన్ ప్రకాష్, జూడోలో అవతార్ సింగ్ నామమాత్రపు పోటీనిచ్చి, ఆరంభంలోనే పోరు నుంచి నిష్క్రమించారు. వీరి నుంచి ఎవరూ అద్భుతాలను ఆశించలేదు కాబట్టి, ఈ పరాజయాలు అభిమానులను పెద్దగా బాధించలేదు.