ఆటాపోటీ

సింధుకు నీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియోలో భారత బృంద ప్రదర్శనను ఒకసారి గుర్తుచేసుకుంటే, ఆ పాఠాలతో భవిష్యత్తుకు పునాదులు వేసుకోవచ్చు. బాడ్మింటన్‌లో పివి సింధు ఫైనల్‌కు చేరి, టైటిల్ పోరులో ప్రపంచ నంబర్ వన్ కరోలినా మారిన్‌తో చివరి వరకూ పోరాడింది. తుది యుద్ధంలో ఓడి, రజత పతకానికి పరిమితమైనప్పటికీ, కోట్లాది మంది అభిమానుల నీరాజనాలు అందుకుంది. అయితే, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ లీగ్ దశలోనే ఓటమిపాలుకాగా, పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్ వరకూ చేరాడు. కానీ, లిన్ డాన్‌తో తలపడి పరాజయాన్ని చవిచూశాడు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్ప, పురుషుల డబుల్స్‌లో అను అత్రి, సుమీత్ రెడ్డి నాకౌట్ దశను కూడా చేరుకోలేకపోయారు.