ఆటాపోటీ

నిబంధనలకు చెల్లుచీటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత క్రీడా మంత్రి విజయ్ గోయల్‌కు అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాటించాల్సిన నిబంధనలు కూడా తెలియవా? ఉద్దేశపూర్వకంగానే వాటిని చెల్లుచీటీ ఇచ్చాడా? కనీస అవగాహన కూడా లేకుండానే ఆయన రియో ఒలింపిక్స్‌కు వెళ్లాడా? అందుకే, అక్కడ పొరపాట్లు చేసి, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) అధికారుల ఆగ్రహానికి గురయ్యాడా? ఇవన్నీ నిజాలే. రియోలో గోయల్ హల్‌చల్ చేసిన విధానమే ఇందుకు ఉదాహరణ. నిబంధనలకు విరుద్ధంగా పోటీలు జరిగే మైదానాల్లోకి అతను పరుగులు తీయడం వివాదానికి కారణమైంది. గోయల్ వ్యవహార శైలిపై భారత చెఫ్ డె మిషన్ రాకేష్ గుప్తాకు రియో ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీ (ఒసి) కాంటినెంటల్ మేనేజర్ సరా పెటెర్సన్ ఫిర్యాదు కూడా చేశాడు. సంఘటన వివరాల్లోకి వెళితే, భారత్, నెదర్లాండ్స్ జట్ల మధ్య పురుషుల హాకీ మ్యాచ్‌కి ముందు గోయల్ మైదానంలోకి వెళ్లాడు. ఇది నిబంధనలకు విరుద్ధమని నిర్వాహకులు మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే, రియో నుంచి బలవంతంగా వెనక్కు పంపాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇంత జరిగినా, గోయల్ మాత్రం తన తప్పేమీ లేదని సమర్థించుకున్నాడు. భారత హాకీ జట్టు సభ్యులను అభినందించడానికి, వారికి శుభాకాంక్షలు తెలపడానికే తాను అక్కడికి వెళ్లానంటూ వివరణ ఇచ్చాడు. తాను వచ్చిందే భారత క్రీడాకారులకు మద్దతు తెలపడానికేనని వ్యాఖ్యానించాడు. ఇంతకు ముందు ఒకసారి తాను ఇదే విధంగా మైదానంలోకి వెళ్లి క్రీడాకారులను కలిసిన విషయాన్ని కూడా ధ్రువీకరించాడు. అప్పట్లో పాస్ తీసుకొని రావాల్సిందిగా అక్కడి వలంటీర్లు సూచించారని చెప్పాడు. ఈసారి పాస్‌ను తీసుకెళ్లానని, దీనిపై రాద్ధాంతం ఎందుకు జరుగుతున్నదో అర్థం కావడం లేదంటూ ఎదురుదాడికి దిగాడు. కేంద్ర క్రీడాశాఖ మంత్రికే అంతర్జాతీయ ఈవెంట్స్‌పై స్పష్టత లేకపోవడం దేశ క్రీడా రంగం పరిస్థితికి అద్దం పడుతుంది. కనీసం క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు కూడా ఆయనకు తగిన సూచనలు చేసి పంపలేదా అన్న ప్రశ్నకు సమాధానం లేదు. క్రీడా రంగాన్ని క్రీడలతో సంబంధం లేని వారు శాసిస్తుంటే, పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా ఉంటాయో చెప్పడానికి గోయల్ చేసిన హడావుడి ఒక ఉదాహరణ మాత్రమే.