ఆటాపోటీ

లోధా కమిటీ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలి. అప్పుడే స్పాట్ ఫిక్సింగ్ వంటి అకృత్యాలకు తెరపడుతుంది. లేకపోతే, ఫిక్సింగ్, బెట్టింగ్ నిరాటంకంగా కొనసాగుతునే ఉంటాయి.
బిసిసిఐ కార్యకలాపాల్లో ఎక్కువ శాతం ప్రజలకు సంబంధించిన అంశాలతోనే ముడిపడి ఉంటాయి కాబట్టి ఏం జరుగుతున్నదో తెలుసుకునే హక్కు వారికి ఉంది. తమిళనాడులో ఒక స్వచ్ఛంద సంస్థగా నమోదైనందున బోర్డు పాలనా వ్యవహారాలను గురించి ఎవరికీ వివరించాల్సిన అవసరం లేదని బిసిసిఐ చేస్తున్న వాదన తప్పు. బోర్డు కూడా సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) పరిధిలోకి తీసుకురావాలి.
సభ్యత్వ విధానాన్ని కూడా నియంత్రీకరించాలి. బోర్డులో 30 యూనిట్లకు సభ్యత్వం ఉంటే, సర్వీసెస్, రైల్వేస్ వంటి యూనిట్లకు సరిహద్దులంటూ ఏవీ లేకపోవడం తప్పు. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి మూడేసి సంఘాలకు బిసిసిఐలో సభ్యత్వం ఉండడం కూడా పొరపాటే. ఈ అసమానతలను తొలగించాలి. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సంఘం మాత్రమే ఉండాలి.
బిసిసిఐ పాలక మండలి తొమ్మిది మందితో ఏర్పాటు కావాలి. వీరిలో ఐదుగురిని బోర్డు సర్వసభ్య సమావేశం ఎన్నుకోవాలి. ఇద్దరు క్రికెటర్ల ప్రతినిధులు ఉండాలి. ఒక మహిళకు కూడా స్థానం కల్పించాలి.

చిత్రం.. ఆర్‌ లోధా