ఆటాపోటీ

విస్తరిస్తున్న డోప్ మహమ్మారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిషిద్ధ మాదక ద్రవ్యాల వినియోగం క్రీడా రంగాన్ని కూకటివేళ్లతో సహా పెకళిస్తున్నది. దీనికితోడు ఒక దేశమే వ్యూహాత్మకంగా తమ దేశ అథ్లెట్లకు డ్రగ్స్‌ను అలవాటు చేసి, డోపింగ్ పరీక్షలు నిర్వహించినట్టు, అంతా సవ్యంగా ఉందంటూ తప్పుడు సమాచారమిచ్చి మరీ మేజర్ ఈవెంట్స్‌కు పంపడం, పతకాలు సాధించడం క్రీడలకు పట్టిన చీడను పెంచుతున్నాయి. టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా తాను మాల్డోనియం అనే నిషిద్ధ ద్రవ్యాన్ని వినియోగించినట్టు ప్రకటించి రెండేళ్ల సస్పెన్షన్‌కు గురైంది. షరపోవా డ్రగ్స్‌ను వాడితే, మిగతా వారిని నమ్మేది ఎలా అన్న ప్రశ్న తలెత్తుతున్నది. రష్యాలో చాలా మంది డ్రగ్ దోషులు ఉన్నారని ప్రపంచ డోపింగ్ నిరోధిక విభాగం (వాడా) చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. చాలాకాలంగా రష్యా వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడుతున్నదని వాడా ఆధ్వర్యంలోని కమిటీ నిర్ధారించింది. రష్యా రెజ్లర్ డేవిడ్ మొజ్మనష్విల్లీ కూడా షరపోవా మాదిరే మెల్డోనియం వాడి, డోపింగ్ పరీక్షలో విఫలమయ్యాడు. అతని ఉదంతం కలవరాన్ని కలిగించగా, మరికొందరు అథ్లెట్లు కూడా నిషిద్ధ మాదక ద్రవ్యాలను వాడినట్టు రుజువైంది. ఒకదాని తర్వాత మరొకటిగా జాబితాలు విడుదల అవుతూనే ఉన్నాయి. బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లో పోటీపడిన ఎంతో మంది రష్యా అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడినట్టు తేలింది. కొంత మంది నిషేధానికి గురైన కారణంగా తాము సంపాదించిన పతకాలను కూడా కోల్పోవాల్సి వచ్చింది. వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడిన కారణంగా సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటున్న రష్యా దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించినా, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్ వంటి మెగా టోర్నీల్లో పతకాలు కొల్లగొట్టడానికి వీలుగా అథ్లెట్లతో ప్రభుత్వమే నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగింప చేసిందని వాడా ఆధ్వర్యంలోని కమిటీ తేల్చి చెప్పింది. రష్యా ఎంచుకున్న అక్రమ మార్గానికి అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్)లోని కొందరు మాజీ అధికారులు సహకరించారన్నది వాస్తవం. విజయాలు సాధించడానికి, పతకాలను పెంచుకోవడానికి అథ్లెట్లు అడ్డదారులు తొక్కడమే అప్పటి వరకూ అందరికీ తెలుసుగానీ, ఏకంగా ఒక దేశ ప్రభుత్వమే ఈ విధంగా వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడడం విచిత్రం. ఈ ఏడాది వెలుగు చూసిన రష్యా డోపింగ్ ఉదంతం క్రీడా రంగ ప్రక్షాళన ఆవశ్యకతను గుర్తుచేస్తున్నది.

- ఎ. మిథున్