ఆటాపోటీ

క్రీడా ప్రపంచానికి గ్రహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకటిరెండు సిరీస్‌లు, రెండు మూడు ఈవెంట్స్‌ను మినహాయిస్తే, ఈ ఏడాది అంతర్జాతీయ క్రీడా సంబరాలకు తెరపడింది. ప్రపంచ క్రీడలకు గ్రహణం పట్టిందన్న వాస్తవాన్ని ఈ ఏడాది చోటుచేసుకున్న అనేకానేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. రష్యా వ్యూహాత్మక డోపింగ్ యావత్ క్రీడా రంగాన్ని కుదిపేసింది. అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. రియో ఒలింపిక్స్ సందర్భంగా చోటు చేసుకున్న పలు పరిణామాలు క్రీడల్లో రాజకీయాల ఉనికిని మరోసారి తెరపైకి తెచ్చాయ. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) అవినీతి కూపంలో మునిగిపోవడం, సెప్ బ్లాటర్ శకానికి తెరపడి, గియానీ ఇన్‌ఫాంటినో కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కావడం క్రీడా జగతి గతిని మార్చేస్తుందని అనుకున్నప్పటికీ అద్భుతాలేవీ జరగలేదు. మూడు అతిపెద్ద సంఘటనలు క్రీడల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేశాయి.
నేర్పిన పాఠాలెన్నో!
రియో డి జెనీరోలో ఆగస్టు 5 నుంచి 21వ తేదీ వరకు జరిగిన సమ్మర్ ఒలింపిక్స్, సెప్టెంబర్ 7న మొదలై 18న ముగిసిన పారాలింపిక్స్ ఎన్నో కొత్త పాఠాలు నేర్పాయి. ఆర్థికంగా దివాలా తీసే స్థితిలో ఉన్న బ్రెజిల్ ఏ విధంగా ఒలింపిక్స్‌ను నిర్వహిస్తుందన్న అనుమానాలు తలెత్తాయి. అంతేగాక, ఒలింపిక్స్‌కు ముందే అక్కడి రాజకీయాల్లో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనేకానేక సమస్యలతో అల్లాడుతూనే సమ్మర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్‌ను నిర్వహించిన బ్రెజిల్ కనీసం మరో దశాబ్దంపాటు కోలుకోలేని విధంగా ఆర్థికంగా చితికిపోయింది. ఇది మిగతా దేశాలకు కనువిప్పు కావాలి. కాలుష్యానికి తెరవేయకపోతే, పరిస్థితి ఏ విధంగా ఉంటుందో రియో ఒలింపిక్స్ చెప్పకనే చెప్పాయి. బ్రెజిల్‌ను కాలుష్య సమస్య తీవ్రంగా వేధిస్తున్నదనేది జగమెరిగిన సత్యం. రోయింగ్, కనోయింగ్ లాగూన్ పోటీలు జరిగిన లాగోవా రోడ్రిగో డి ఫ్రెటాస్ సరస్సులో భారీ సంఖ్యలో చేపలు చనిపోవడంతో, పోటీల ముందు వరకూ అక్కడ పరిస్థితి దారుణంగా కనిపించింది. ఒడ్డుకు కొట్టుకొచ్చిన సుమారు 32 టన్నుల చేపలను తొలగించడానికి అధికారులు నానా తంటాలు పడ్డారు. ఇలాంటి అవాంతరాలను ముందుగా ఊహించకపోవడంతో, ఖర్చు విపరీతంగా పెరిగింది. అంచనాలకు, వాస్తవానికీ ఎక్కడా పోలిక లేకుండా పోయింది. ఒలింపిక్స్‌ను నిర్వహిస్తే, కోట్లకు కోట్లు వచ్చిపడతాయన్న ఆశలు ఆవిరైపోయాయి. ఒలింపిక్స్ కోసం బ్రెజిల్ సర్కారుకు సుమారు 15,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్రెజిల్‌కు అది మోయలేని భారంగానే పరిణమించింది. దీని ప్రభావం దేశంలో కనీసం మరో పదేళ్లు ఉంటుందని నిపుణుల అంచనా. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న బ్రెజిల్‌లో పోలీసులు, డాక్టర్లు, టీజర్లు వేతనాలు సక్రమంగా చెల్లించాలన్న డిమాండ్‌తో ఆందోళనకు దిగారు. కార్మికుల నిరసనలతో కదంతొక్కారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా, కోట్లాది రూపాయలను ఖర్చు చేసి ఒలింపిక్స్‌ను నిర్వహించడం అవసరమా? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఒలింపిక్స్ జరుగుతున్న సమయంలో రియోలో దొంగతనాలు పెరిగాయి. విదేశీ అథ్లెట్లను లక్ష్యం చేసుకొని దొంగలు తెగబడ్డారు. క్రీడా గ్రామంలోని పలు అపార్ట్‌మెంట్స్‌లో వౌలిక సదుపాయాలు లేక అథ్లెట్లు ఇబ్బందులు పడ్డారు. రియోలో మాదక ద్రవ్యాల చలామణి ఎక్కువ. ఆ మత్తులో జరిగే నేరాలు అధికం. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చినందుకు పోలీసు శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డ్రగ్ మాఫియాను కట్టడి చేసే ప్రయత్నం చేసింది. కానీ, డ్రగ్స్ మాఫియా అంతకంటే వేగంగా స్పందించింది. భారీగా భారీగా మాదక ద్రవ్యాలను సరఫరా చేసింది. డ్రగ్స్‌కు వ్యభిచారం కూడా తోడుకావడంతో రియో పరువు పోగొట్టుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, సరైన వ్యూహం, పటిష్టమైన ప్రణాళిక, బలమైన ఆర్థిక వ్యవస్థ లేనప్పుడు మెగా ఈవెంట్‌ను నిర్వహించడం ఎంత పొరపాటో ఒలింపిక్స్‌కు ముందు, ఆ తర్వాత బ్రెజిల్‌లో నెలకొన్న పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.