ఆటాపోటీ

చిసోరాకు కోపమొచ్చింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోపిష్టి బాక్సర్‌గా ముద్రపడిన డెరెక్ చిసోరాకు కోపమొచ్చింది. ఈసారి ఏకంగా బ్రిటిష్ బాక్సింగ్ బోర్డు (బిబిబిసి) అధికారులపైనే అతను కాలుదువ్వాడు. బ్రిటిష్ చాంపియన్ డిలియన్ వైట్‌తో చిసోరా ఫైట్‌ను ప్రమోట్ చేయడానికి బిబిబిసి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే లండన్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పోటీదారుల వివరాలను ప్రకటిస్తున్న సమయంలో డిలియన్ వైట్ గురించి అధికారులు మాట్లాడుతున్నప్పుడు చిసోరా చిరాకుపడ్డాడు. అతనిని ఆకాశానికి ఎత్తుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకానొక దశలో స్టేజీపై ఉన్న టేబుల్‌ను ఎత్తి కింద పడేశాడు. ఈ సంఘటనను బిబిబిసి తీవ్రంగా పరిగణించింది. అతని బాక్సింగ్ లైసెన్సును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, అంతర్జాతీయ బాక్సింగ్ మండలి (డబ్ల్యుబిసి) మాత్రం చిసోరా ఫైట్స్‌ను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్‌షిప్ ఎలిమినేషన్ దశకు చేరుకున్న నేపథ్యంలో చిసోరా లైసెన్సును రద్దు చేసి, అతనిని ఫైట్స్‌లో పాల్గొనకుండా అడ్డుకోలేమని ప్రకటించింది. కానీ, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన అతనిపై తీసుకునే చర్యలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. చ ర్యల విషయం ఎలావున్నా చిసోరా అంటే ఏమిటో మరోసారి తెలిసింది.